AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంతులేని విషాదం.. రోజుల వ్యవధిలోనే తండ్రీ కొడుకులు మృతి.. పెంపుడు కుక్క కూడా.. ఇంతకీ ఏం జరిగిందంటే..?

సాధారణంగా పెంపుడు కుక్కల్ని బయట కుక్కలు కరిచినప్పుడు కొన్ని రకాల వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంటుంది. వాటికి ఆ సమయంలో వ్యాక్సిన్ ఇవ్వకపోతే అది విషం గా మారే ప్రమాదం ఉంటుంది.  అలాంటి కుక్కలు కరిస్తే ప్రాణాలకి ఇబ్బందులు కలిగే పరిస్థితులు వస్తాయి.. ఇప్పుడు కూడా అదే జరిగి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. పెంపుడు కుక్క మరణించిన తర్వాత భార్గవ్ హుటాహుటినా హాస్పిటల్ కి వెళ్లినా అప్పటికే రేబిస్ వ్యాధి వారి శరీరంతో పాటు మెదడుకు కూడా సోకిందని తేలింది.

అంతులేని విషాదం.. రోజుల వ్యవధిలోనే తండ్రీ కొడుకులు మృతి.. పెంపుడు కుక్క కూడా.. ఇంతకీ ఏం జరిగిందంటే..?
Father Son Dies
Eswar Chennupalli
| Edited By: Jyothi Gadda|

Updated on: Jun 26, 2024 | 1:33 PM

Share

విశాఖ జిల్లా భీమిలిలో మాటలకు అందని విషాదం చోటు చేసుకుంది. కలలో కూడా ఊహించిన విధంగా అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పెంపుడు కుక్కే ఈ విషాదానికి కారణమైంది. అత్యంత విశ్వసనీయమైన స్నేహితుడిగా ఉండే పెట్ డాగ్ కారణంతో ఇద్దరు మృతి చెందడం ఆ కుటుంబాన్ని అగాధంలోకి తోసేసింది. ఒకవైపు కంటికి రెప్పలా పెంచుకున్న పెంపుడు కుక్క… మరొకవైపు ఆ కంటి రెప్పల్లాంటి భర్త, తనయుడు ఇద్దరూ మృతి చెందడంతో ఆ తల్లి విషాదానికి మాటల్లేకుండా పోతున్నాయి.

నాలుగు రోజుల వ్యవధిలో తండ్రి… కొడుకులు

గతనెల మే 31 న భార్గవ్ (27) అనే యువకుడిని పెంపుడు కుక్క కరిచింది. వెంటనే హాస్పిటల్ కు వెళ్లి మొదటి డోస్ వ్యాక్సిన్ వేయించుకున్న భార్గవ్ తర్వాత 2, 3 డోస్ లను చేయించుకోలేదు. దీంతో వ్యాధి ముదిరి నాలుగు రోజుల క్రితం భార్గవ్ మరణించారు. ఆయన తండ్రి నర్సింగరావు కు 65 సంవత్సరాలు. ఆర్టీసీ కండక్టర్ గా పని చేస్తూ రిటైర్డ్ అయి ప్రస్తుతం అనారోగ్యంతో ఇంట్లోనే ఉంటున్నారు. గత కొన్నేళ్లుగా ఆయన మంచానికే పరిమితం అయి ఉన్నారు. ఆయన బాగోగులును కుమారుడు భార్గవ్ నే చూసేవారు. అలాంటి భార్గవ్ ఆకస్మికంగా చనిపోవడంతో తండ్రి నరసింగరావు ఆయన మంచానికే పరిమితమై నిన్న ప్రాణాలు వదిలాడు. దీంతో నాలుగు రోజులు వ్యవధిలో తండ్రి కొడుకులు మరణించడంతో భీమిలి విషాదంలో మునిగిపోయింది.

ఇవి కూడా చదవండి

భార్గవ్ తో పాటు తల్లిని కూడా కరచిన పెంపుడు కుక్క

వాస్తవానికి మే 31న భార్గవ్ తో పాటు అతని తల్లిని కూడా పెట్ డాగ్ కరిచింది కానీ తల్లికి ఇబ్బంది లేకపోయినా భార్గవ్ మాత్రం నిర్లక్ష్యం చేయడంతో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని భీమిలి ప్రభుత్వ వైద్యులు నిర్ధారించారు. భార్గవ్ కి మొదటి డోస్ తర్వాత రెండు మూడు డోసులు కూడా వేసుకోవాలని చెప్పామని, కానీ ఆయన తండ్రి అనారోగ్యం, ఇతర కారణాలవల్ల హాస్పిటల్ కి రాలేదని… వ్యాక్సిన్ కూడా తర్వాత వేయించుకోలేదని డాక్టర్ స్పష్టం చేశారు.

పెంపుడు కుక్క కూడా మరణించడం తో భయానికి గురైన భార్గవ్

అదే సమయంలో పెట్ డాగ్ కూడా ఇటీవల వారం క్రితం మరణించింది. పెంపుడు కుక్క మరణించడంతో అప్పటికే వ్యాధి బారిన పడిన విషయం తెలియని భార్గవ్ లో భయం మొదలైంది. చుట్టుపక్కల వాళ్ళు కూడా భార్గవ్ అనారోగ్యానికి పెంపుడు కుక్క కారణం కావొచ్చునని  అనుమానం వ్యక్తం చేశారు. సాధారణంగా పెంపుడు కుక్కల్ని బయట కుక్కలు కరిచినప్పుడు కొన్ని రకాల వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంటుంది. వాటికి ఆ సమయంలో వ్యాక్సిన్ ఇవ్వకపోతే అది విషం గా మారే ప్రమాదం ఉంటుంది.  అలాంటి కుక్కలు కరిస్తే ప్రాణాలకి ఇబ్బందులు కలిగే పరిస్థితులు వస్తాయి.. ఇప్పుడు కూడా అదే జరిగి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. పెంపుడు కుక్క మరణించిన తర్వాత భార్గవ్ హుటాహుటినా హాస్పిటల్ కి వెళ్లినా అప్పటికే రేబిస్ వ్యాధి వారి శరీరంతో పాటు మెదడుకు కూడా సోకిందని తేలింది. దీంతో పూర్తిగా పక్షవాతం వచ్చినట్టు, కదలలేని స్థితికి చేరి భార్గవ్ మరణించాడు. దీంతో ఆ కాలనీలో విషాదం నిండింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…