Viral Video: లండన్‌లో బ్యాగ్ నిండా డబ్బులు తీసుకెళ్లి జేబులో సరుకులు తెచ్చుకోవలేమో.. కూరగాయలు, పండ్ల ధరలు తెలిస్తే షాక్..

ద్రవ్యోల్బణం వలన రోజు రోజుకీ నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలు తాకుతున్నాయి. దీంతో సామాన్యులు ఇప్పుడు గృహావసరాలను కూడా ఆలోచనాత్మకంగా కొనుగోలు చేసే పరిస్తితి నెలకొంది. ఈ పరిస్థితి భారతదేశంలోనే కాదు విదేశాలలో కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి చర్చనీయాంశమైంది. లండన్ సూపర్ మార్కెట్లలో లభించే భారతీయ ఆహార పదార్థాల ధరను ఓ అమ్మాయి చెప్పడం ఈ వీడియోలో చూడవచ్చు.

Viral Video: లండన్‌లో బ్యాగ్ నిండా డబ్బులు తీసుకెళ్లి జేబులో సరుకులు తెచ్చుకోవలేమో.. కూరగాయలు, పండ్ల ధరలు తెలిస్తే షాక్..
Representative ImageImage Credit source: Getty Images
Follow us
Surya Kala

|

Updated on: Jun 27, 2024 | 8:30 AM

జేబులో డబ్బులు తీసుకుని వెళ్లి.. సంచి నిండా వస్తువులు కొని తెచ్చుకునే రోజుల నుంచి సంచి నిండా డబ్బులు తీసుకుని మార్కెట్ కు వెళ్లి జేబులో సరుకులు తెచ్చుకునే రోజులు వచ్చాయి అని పెద్దలు సరదాగా అన్నా.. రోజు రోజుకీ పెరిగిపోతున్న పప్పు, ఉప్పు సహా కూరగాయల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తూనే ఉన్నాయి. అవును ప్రస్తుతం మిడిల్ క్లాస్ వారు ఏమైనా కొనుగోలు చేసే ముందు వందసార్లు ఆలోచించేంతగా ఖరీదు పెరిగిపోతున్నాయి. ద్రవ్యోల్బణం వలన రోజు రోజుకీ నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలు తాకుతున్నాయి. దీంతో సామాన్యులు ఇప్పుడు గృహావసరాలను కూడా ఆలోచనాత్మకంగా కొనుగోలు చేసే పరిస్తితి నెలకొంది. ఈ పరిస్థితి భారతదేశంలోనే కాదు విదేశాలలో కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి చర్చనీయాంశమైంది. లండన్ సూపర్ మార్కెట్లలో లభించే భారతీయ ఆహార పదార్థాల ధరను ఓ అమ్మాయి చెప్పడం ఈ వీడియోలో చూడవచ్చు.

అసలు ఈ ధరలు ఇప్పుడు ఎందుకు చర్చకు వచ్చాయో అని ఆశ్చర్యపోతున్నారా.. ఏమీ ఈ వీడియోలో భారతీయ ఆహార ధరలు వివరించింది. ఎందుకంటే లండన్లోని సూపర్ మార్కెట్లలో లభించే భారతీయ ఆహార ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఈ వీడియో చూసిన వారికి తెలుస్తుంది. సాధారణ కూరగాయల నుంచి భారతీయ స్నాక్స్ వరకు లండన్‌లో అత్యధిక ధరకు అమ్ముడవుతున్నాయని వైరల్ క్లిప్ లో చూపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

20 రూపాయల చిప్స్ ప్యాకెట్ లండన్‌లో 95 రూపాయలకు దొరుకుతుందని నైనే అనే యువతి చెప్పడం వీడియోలో మీరు చూడవచ్చు. భారతదేశంలో మనం 100 రూపాయలకు కొనుగోలు చేసే మ్యాగీని 300 రూపాయలకు విక్రయిస్తుండగా.. పనీర్ ప్యాకెట్‌కు 700 రూపాయలకు లభిస్తుంది. ఇక మామిడి కాయ సహా ఇతర కూరగాయల ధరల గురించి మాట్లాడుకుంటే.. బెండకాయ కిలో రూ.650, కాకర కాయ కిలో రూ.1000, ఆల్ఫోన్సో మామిడికాయలు 6 రూ.2400 చొప్పున విక్రయిస్తున్నారు.

ఇవి మాత్రమే కాదు ఇతర ఆహార పదార్థాల ధరల్లోకి వెళ్తే.. రూ.10 విలువైన గుడ్ డే బిస్కెట్ లండన్ లో రూ.100కి దొరుకుతుంది. లిటిల్ హార్ట్స్ బిస్కెట్ల చిన్న ప్యాకెట్లను కూడా రూ.100కి విక్రయిస్తున్నారు. మన దేశంలో 100 రూపాయలకు లభించే భుజియా లండన్ లో కొనాలంటే 1000 రూపాయలు పెట్టాల్సిందే. ఈ వీడియోను నైనే తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇప్పటి వరకూ ఈ వీడియోను వేలాది మంది చూడగా.. రకరకాలుగా వ్యాఖ్యానిస్తూ ప్రతిచర్యలను ఇస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.