Watch: ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వానా.. అంటూ వర్షంలో తడుస్తూ యువతీ రీల్స్.. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే..?
ఫాలోవర్స్‌తో పాటు ఫేమ్‌ను సాధించేందుకు ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తున్న వారి వీడియోలు అనేకం ఇప్పటికే వైరల్ కావడం చూశాం. కొందరు రీల్స్ చేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ యువతీ రీల్స్ చేస్తూ తృటిలో తప్పించుకుని ప్రాణాలతో బయటపడింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం యువతపై సోషల్ మీడియా ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. ఇన్‌స్టా రీల్స్, లైకులు, వ్యూస్ కోసం జనాలను ఆకర్షించేందుకు కొత్త కొత్త స్టంట్స్ చేస్తున్నారు చాలా మంది యువతీ యువకులు. రీల్స్ పిచ్చితో ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. సోషల్ మీడియాలో హాబీ కోసం రీల్స్ చేస్తుండగా.. మరికొందరు వాటితో ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఫాలోవర్స్‌తో పాటు ఫేమ్‌ను సాధించేందుకు ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తున్న వారి వీడియోలు అనేకం ఇప్పటికే వైరల్ కావడం చూశాం. కొందరు రీల్స్ చేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ యువతీ రీల్స్ చేస్తూ తృటిలో తప్పించుకుని ప్రాణాలతో బయటపడింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
బీహార్‌లోని సీతామర్హిలో చాలారోజుల తర్వాత బుధవారం వర్షం కురిసింది. దీంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. దీంతో ప్రజలు కూడా ఎండల నుండి ఉపశమనం పొందారు. ఈ క్రమంలో బేలా పోలీస్ స్టేషన్ పరిధిలోని సిర్సియా గ్రామానికి చెందిన ముఖియా రాఘవేంద్ర భగత్ అలియాస్ కమల్ భగత్ కూతురు సానియా కుమారి పొరుగునే ఉన్న దేవనారాయణ్ భగవత్ ఇంటి డాబాపై వర్షంలో తడుస్తూ డ్యాన్స్ చేస్తుంది. ఆమె రీల్స్ చేస్తుండగా ఆమె స్నేహితుడు వీడియో తీస్తున్నాడు. ఇంతలోనే ఉన్నట్టుండి ఇంటికి దగ్గరలో భారీ శబ్దం, మెరుపులతో పిడుగుపడింది. దాంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన ఆమె అక్కడి నుంచి పరుగులు పెట్టింది. పిడుగు పాటుకు ఇంటి పైకప్పు, మెట్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. కానీ, అదృష్టవశాత్తు సానియాకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆమె సురక్షితంగా తప్పించుకోగలిగింది.
A Girl was making a reel video in Sitamarhi, Bihar when lightning struck her from the sky, The woman survived the lightning strike🤯#bihar #lightning #sdcworld #life #reels pic.twitter.com/BN2PU5oJ0C
— SDC World (@sdcworldoffl) June 26, 2024
విద్యుత్ వైరింగ్‌తోపాటు ఫ్రీజర్, ఫ్యాన్, ఇతర విద్యుత్ ఉపకరణాలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ కూడా దగ్ధమైనట్లు సమాచారం. పిడుగు పాటుకు సమీపంలోని పదుల సంఖ్యలో ఇళ్లలోని విద్యుత్ పరికరాలు దెబ్బతిన్నాయి. దీంతో ప్రజలు తీవ్ర నష్టానికి గురయ్యారు. ఇదిలా ఉంటే వర్షంలో సానియా డ్యాన్స్ చేస్తూ రిల్స్ చేసిన వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ప్రాణాలను పణంగా పెట్టి సోషల్ మీడియాలో ఫేమ్ ఇచ్చేందుకు ఇలాప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఏంటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..