ప్రతి నలుగురు కొత్త డయాబెటిస్ పేషెంట్లలో ఒకరు యంగ్‌ ఎజ్‌ వారే.. తాజా షాకింగ్‌ సర్వే వెల్లడి

ఒబెసిటీ తోనే డయాబెటిస్, హైబీపీ, హార్ట్ డిసీజెస్, క్యాన్సర్ లాంటి నాన్ కమ్యూనికేషన్ డిసీజెస్ పెరుగుతున్నట్టు తెలిపారు. ఒబే సిటీలో భారత్...అమెరికా, చైనా తర్వాత టాప్ టెన్ లో ఉన్నదన్నారు. చండీగఢ్‌లో 20.4 శాతం మంది డయాబెటిస్తో బాధపడుతున్నట్టు తమ స్టడీలో తేలిందని తెలిపారు.

ప్రతి నలుగురు కొత్త డయాబెటిస్ పేషెంట్లలో ఒకరు యంగ్‌ ఎజ్‌ వారే.. తాజా షాకింగ్‌ సర్వే వెల్లడి
Diabetes
Follow us
Yellender Reddy Ramasagram

| Edited By: Jyothi Gadda

Updated on: Jun 27, 2024 | 7:45 AM

డయాబెటిస్.. ఈ మధ్యకాలంలో చాలామందిని వేధించే తీవ్రమైన జబ్బు. ఎవరికైనా ఈ డయాబెటిస్ రావచ్చు. ప్రతి ఏడాది లక్షలమంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. 40 ఏళ్ల నాటితో పోలిస్తే ఇప్పుడు ఈ వ్యాధి వ్యాప్తి దాదాపు నాలుగు రెట్లు పెరిగిందని పరిశోధనలు చెబుతున్నాయి. షుగర్ వ్యాధి రోజురోజుకు ప్రమాదకరంగా మారుతోందని కొత్త పరిశోధనలు తెలిపాయి.. డయాబెటిస్ బారిన పడుతున్న ప్రతి నలుగురు పేషంట్లలో ఒకరు 40 ఏళ్ల వయసు లోపు వారేనని పరిశోధకులు గుర్తించారు. యువతకు కూడా షుగర్ ముప్పు అధికంగానే ఉన్నట్టు తెల్చారు. దీనికి జీవన విధానంతో..ఒబేసిటీ ప్రధాన కారణమని కనుగొన్నారు.

దేశంలోని పట్టణ జనాభాలో 70 శాతం మంది ఉబకాయంతో బాధపడుతున్నట్టు చండీఘడ్ లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఈ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పరిశోధకులు గుర్తించారు. 18 నుండి 65 ఏళ్ల మధ్య వయసున్న వారిపై స్టడీ చేయగా ఈ విషయాన్ని గుర్తించారు. దేశంలో 60 శాతం మంది షుగర్ పేషెంట్లు ఉబకాయులేనని గుర్తించారు. ఇందులో 25 నుండి 35శాతం మందికి బిఎంఐ 30 కంటే ఎక్కువగా ఉన్నదని నిర్ధారించారు.

అనారోగ్య కారకమైన ఆహారం, నిద్దలేమి శారీరక శ్రమ లేకపోవడంతో ఉబకాయం ముప్పు వాటిల్లుతుందని, ఫలితంగా డయాబెటిస్ బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతుందని పీజీఐఎంఈఆర్ కు చెందిన పరిశోధకులు తెలిపారు. ఒబెసిటీ తోనే డయాబెటిస్, హైబీపీ, హార్ట్ డిసీజెస్, క్యాన్సర్ లాంటి నాన్ కమ్యూనికేషన్ డిసీజెస్ పెరుగుతున్నట్టు తెలిపారు. ఒబే సిటీలో భారత్…అమెరికా, చైనా తర్వాత టాప్ టెన్ లో ఉన్నదన్నారు. చండీగఢ్‌లో 20.4 శాతం మంది డయాబెటిస్తో బాధపడుతున్నట్టు తమ స్టడీలో తేలిందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

18 ఏళ్లలోపు చాలామంది టైప్ టు డయాబెటిస్ ఉన్నట్టు నిర్ధారణ అయిందని షాకింగ్‌ విషయాలు వెల్లడించారు పరిశోధకులు. ఇది అమ్మాయిల్లో కంటే అబ్బాయిల్లో ఎక్కువగా వస్తున్నదని గుర్తించామన్నారు. ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ లో మార్పులు చేసుకొని నిత్యం ఎక్ససైజ్ చేస్తే హైబీపీ,హార్ట్ డిసీజెస్ తో పాటు 80శాతం వరకు టైప్ టు డయాబెటిస్ ను తగ్గించుకోవచ్చని తెలిపారు. ఐదు నుండి పది కిలోల బరువు తగ్గిన డయాబెటిస్ తో పాటు కొన్ని రోగాల ముప్పు నుంచి తప్పించుకోవచ్చని సూచించారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి