AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : మీకు ఇలాంటి అనారోగ్య సమస్యలుంటే ఈ కూరగాయను అస్సలు తినొద్దు..!

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో పచ్చి కూరగాయలు ఎంతో ముఖ్యమైనవి. తీవ్రమైన వ్యాధుల నుండి మనలను రక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉన్న అనేక పోషకాలు వాటిలో ఉన్నాయి.. అటువంటి కూరగాయలలో సొరకాయ ఒకటి. మనలో చాలా మంది దీనిని అనిగెకాయ అని కూడా అంటారు. అవును, ఇది రుచికరమైనది. విటమిన్ సి, ఐరన్, ఫైబర్, పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్ యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఈ కూరగాయలో సమృద్ధిగా ఉంటాయి. ఏ అనారోగ్యం లేనివాళ్లకు ఈ సొరకాయ ఆరోగ్యకరమైన ఆహారపదార్థం. కానీ, కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ఇది అస్సలు మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాబట్టి సొరకాయను ఎవరు తినకూడదు..? ఎందుకు తినకూడదు..? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Jun 27, 2024 | 10:57 AM

Share
కిడ్నీల్లో రాళ్లు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు ఆనిగెకాయను అస్సలు తినకూడదని చెబుతున్నారు. ఇలాంటి వారు పొరపాటున కూడా ఆనిగెకాయ రసం తాగకూడదని డైటీషియన్స్‌ అంటున్నారు. ఆనిగెకాయలో అధిక మొత్తంలో ఆక్సలేట్ ఉంటుందని, ఇది మూత్రపిండాల్లో రాళ్ల సమస్యను మరింత పెంచుతుందని సూచిస్తున్నారు.

1 / 5

లోబీపీ సమస్య ఉన్నవాళ్లు కూడా సొరకాయకు వీలైనంత దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆనిగెకాయలో ఉండే పొటాషియం రక్తపోటును తగ్గించడంలో సాయపడుతుంది. దాంతో బీపీ మరింత తగ్గుతుంది. హైబీపీకి మందులు వాడేవాళ్లు కూడా ఈ సొరకాయకు దూరంగా ఉండాలి. సడెన్‌గా బీపీ తగ్గిపోయే ఛాన్స్‌ ఉందంటున్నారు.

2 / 5
బలహీనమైన జీర్ణవ్యవస్థ ఉన్నవాళ్లు కూడా సొరకాయ తినడం, దాని రసాన్ని తీసుకోవడం మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సొరకాయలో అధిక మొత్తంలో ఉండే ఫైబర్‌ను జీర్ణం చేయడం బలహీన జీర్ణవ్యవస్థకు సాధ్యం కాదు. కాబట్టి అలాంటివారు ఆనిగెకాయ తింటే జీర్ణవ్యవస్థ మరింత దెబ్బతింటుంది. కడుపు నొప్పి, అజీర్తి, మలబద్ధకం, విరేచనాలు లాంటి సమస్యలు వస్తాయి.

3 / 5
పేగుల్లో పుండ్లు, అల్సర్లు లాంటి సమస్యలు ఉన్నవాళ్లు కూడా సొరకాయను తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దానివల్ల జీర్ణకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పేగుల్లో వాపు, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయని అంటున్నారు.

4 / 5
గుండె జబ్బులతో బాధపడుతున్న వారికి కూడా సొరకాయ మంచిది కాదు. కాబట్టి వారు ఈ సొరకాయ, సొరకాయ జ్యూస్‌ను అత్యంత మితంగా తీసుకోవడం మంచిది. ఏదైనా సరే.. అతిగా తింటే ఆరోగ్య ప్రయోజనాలకు బదులుగా అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యులు పదే పదే చెబుతున్నారు.

5 / 5
Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !

భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా

ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు

లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్

రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.

ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు

‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే

అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే

మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!

ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌