AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కార్మికుడి చేయి కట్.. కుక్కలా పొలం నుంచి విసిరేసిన యజమాని. ఇటలీలో భారతీయ కార్మికుడి మృతి..

జూన్ 17న స్ట్రాబెర్రీ ప్యాకింగ్ చేస్తుండగా సత్నామ్ సింగ్ చేయి కట్ అయింది. కాళ్లకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చేర్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే పొలం యజమాని ఆంటోనెల్లో లోవాటో.. అయ్యో పాపం అని వెంటనే ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించాల్సింది పోయి.. కనికరం లేకుండా సత్నామ్ సింగ్‌ను పొలం నుంచి తీసుకెళ్లి రోడ్డుపై పడేశాడు. ఈ ఘటన ఇటలీలో సంచలనం సృష్టించింది. దేశంలో అపఖ్యాతి పాలైంది.

కార్మికుడి చేయి కట్.. కుక్కలా పొలం నుంచి విసిరేసిన యజమాని. ఇటలీలో భారతీయ కార్మికుడి మృతి..
Indian Labour Dead In Italy
Surya Kala
|

Updated on: Jun 27, 2024 | 9:54 AM

Share

భారతీయుడు ఇటలీలో మరణించిన విధానం ప్రస్తుతం ఆ దేశంలో కలకలం రేగుతోంది. ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఇది ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీ దృష్టికి చేరుకోవడంతో ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటలీలోని లాటినాలో స్ట్రాబెర్రీ ప్యాకింగ్ మెషిన్ దగ్గర పని చేస్తున్న భారతీయ కార్మికుడు సత్నామ్ సింగ్ చేయి ప్రమాదవ శాత్తు తెగిపోయింది. ఈ ప్రమాదం తర్వాత కంపెనీ యజమాని క్షతగాత్రుడి పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. వెంటనే సత్నామ్ సింగ్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి పంపించే బదులు అతడిని బాధిత స్థలం నుంచి బయటకు గెంటేశాడు. అప్పుడు అక్కడే ఉన్న మరొక వ్యక్తీ సత్నామ్ సింగ్ కి సహాయం చేశాడు. అతి కష్టం మీద ఆస్పత్రికి తరలించాడు. అయినప్పటికీ వైద్యులు సత్నామ్ సింగ్ ను కాపాడలేకపోయారు.

సత్నామ్ సింగ్ పని నిమిత్తం రెండేళ్ల క్రితం ఇటలీ వెళ్లాడు. ఇప్పటి వరకూ అంతా బాగానే సాగుతుంది.. అయితే జూన్ 17న స్ట్రాబెర్రీ ప్యాకింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సత్నామ్ సింగ్ చేయి కట్ అయింది. కాళ్లకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చేర్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే పొలం యజమాని ఆంటోనెల్లో లోవాటో.. అయ్యో పాపం అని వెంటనే ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించాల్సింది పోయి.. కనికరం లేకుండా సత్నామ్ సింగ్‌ను పొలం నుంచి తీసుకెళ్లి రోడ్డుపై పడేశాడు. ఈ ఘటన ఇటలీలో సంచలనం సృష్టించింది. దేశంలో అపఖ్యాతి పాలైంది.

సత్నామ్ సింగ్ రక్షించమని వేడుకున్న భార్య

ఇవి కూడా చదవండి

రోడ్డుపై పడేసిన తర్వాత సత్నాం కొన్ని గంటలపాటు జీవించే ఉన్నాడు. అతని భార్య సహాయం కోసం సమీపంలోని వారిని వేడుకుంది. అప్పుడు ఒక వ్యక్తీ స్పందించి సత్నాం కు సహాయం చేసి అంబులెన్స్‌కు కాల్ చేశాడు. సత్నామ్ సింగ్‌ను ఆసుపత్రికి పంపారు. అప్పటికే ఆలస్యం అయింది.. పరిస్థితి విషమించింది..దీంతో చికిత్స పొందుతూ సత్నాం సింగ్ మరణించాడు. ప్రమాదం జరిగిన వెంటనే సత్నామ్ సింగ్‌ను ఆసుపత్రికి పంపి ఉంటే, అతను ప్రాణాలతో బయటపడి ఉండేవాడని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ ఘటనతో ఇటలీలోని ప్రజలు షాక్‌కు గురయ్యారు. ఇతర దేశాల కార్మికులను ఇలాగే దారుణంగా చూస్తే మన దేశానికి ఎవరూ రారని ఇటలీ ప్రజలు అంటున్నారు. సెంట్రల్ ఇటలీలోని లాజియో ప్రాంతంలోని భారతీయ కమ్యూనిటీ హెడ్ గుర్ముఖ్ సింగ్ మాట్లాడుతూ సత్నామ్ సింగ్‌ను కుక్కలా విసిరివేసారు. ఇక్కడ ప్రతిరోజూ శ్రామిక దోపిడీ జరుగుతోంది. ప్రతిరోజూ భరిస్తున్నాం. ఇక నైనా ఈ శ్రామిక దోపిడీ ముగియాలన్నారు.

చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన భారత్ సత్నామ్ సింగ్ మృతికి కారణమైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని భారత్ ఇటలీని కోరింది. విదేశాంగ మంత్రిత్వ శాఖలోని కాన్సులర్, పాస్‌పోర్ట్, వీసా, విదేశీ భారతీయ వ్యవహారాల కార్యదర్శి ముక్తేష్ పరదేశి.. భారతదేశంలోని సత్నామ్ సింగ్ (31) మరణంపై ఇటాలియన్ సిటిజన్స్ అబ్రాడ్ అండ్ మైగ్రేషన్ పాలసీల డైరెక్టర్ జనరల్ లుయిగి మారియా విగ్నాలీకి తెలియజేశారు. ఇటలీలోని రాయబార కార్యాలయం ట్విట్టర్‌లో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సత్నాం మరణానికి కారణమైన బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రాయబార కార్యాలయం డిమాండ్‌ చేసింది. సహాయం కోసం, మృతదేహాన్ని స్వదేశానికి తిరిగి తీసుకురావడానికి సత్నామ్ సింగ్ కుటుంబ సభ్యులతో రాయబార కార్యాలయం సంప్రదిస్తోందని రాయబార కార్యాలయం తెలిపింది.

ఇటలీ ప్రధాని మెలోని సత్నామ్ సింగ్ మరణాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తారు. సత్నామ్ సింగ్ పట్ల సంతాపం తెలిపారు. మెలోని సత్నామ్ సింగ్‌ను అమానవీయ చర్యలకు బాధితుడిగా అభివర్ణించారు. దోషులుగా తేలిన వారిని కఠినంగా శిక్షించాలని సూచించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..