Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భాగస్వామి లేకుండా 14 పిల్లలకు జన్మనిచ్చిన కొండ చిలువ.. అరుదైన ఘటన ఎక్కడంటే

తొమ్మిదేళ్ల క్రితం గొప్ప ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో పేరుని ఈ కొండ చిలువకు పెట్టారు . అయితే ఇప్పుడు నిపుణులకు షాక్ ఇచ్చిన సంగతి ఏమిటంటే.. ఇన్ని రోజుల వరకూ రొనాల్డో మగ కొండ చిలువ అని అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు విచిత్రం ఏమిటంటే పాలు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత అది మగ కొండ చిలువ కాదని, ఆడ పాము అని తెలిసింది. ఈ అద్భుతం ఎలా జరిగిందో వివరంగా తెలుసుకుందాం.

భాగస్వామి లేకుండా 14 పిల్లలకు జన్మనిచ్చిన కొండ చిలువ.. అరుదైన ఘటన ఎక్కడంటే
Brazilian Rainbow Boa Snake
Follow us
Surya Kala

|

Updated on: Jun 27, 2024 | 10:17 AM

భాగస్వామి లేకుండా గర్భం దాల్చి 14 మంది పిల్లలకు జన్మనిచ్చింది ఓ కొండచిలువ. ఇంగ్లండ్‌లో జరిగిన ఈ ఘటన ఆ కొండచిలువ సంరక్షకులకు షాక్‌నిచ్చింది. ఇప్పుడు ఈ కొండచిలువ మగ కొండ చిలువతో సంబంధం లేకుండా ఎలా పిల్లలకు జన్మనిచ్చిందనే ప్రశ్న మొదలైంది. తొమ్మిదేళ్ల క్రితం గొప్ప ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో పేరుని ఈ కొండ చిలువకు పెట్టారు . అయితే ఇప్పుడు నిపుణులకు షాక్ ఇచ్చిన సంగతి ఏమిటంటే.. ఇన్ని రోజుల వరకూ రొనాల్డో మగ కొండ చిలువ అని అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు విచిత్రం ఏమిటంటే పాలు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత అది మగ కొండ చిలువ కాదని, ఆడ పాము అని తెలిసింది. ఈ అద్భుతం ఎలా జరిగిందో వివరంగా తెలుసుకుందాం.

సహజంగానే, ‘మగ జీవులు ఎలా గర్భం దాలుస్తాయని ఎవరైనా ఆశ్చర్యపోతారు. వాస్తవానికి తొమ్మిదేళ్ల క్రితం ఒక పశువైద్యుడు కొండచిలువ మగదని ప్రకటించాడు. అయితే ఈ ఆశ్చర్యకరమైన సంఘటన తర్వాత ఆ కొండ చిలువ మగ కాదని, ఆడదని తేలింది. అయితే ఈ కొండచిలువ మగ కొండ చిలువతో సంబంధం లేకుండా ఎలా పిల్లలకు జన్మనిచ్చిందనేది ఇప్పుడు ప్రశ్న.

స్కై న్యూస్ నివేదిక ప్రకారం 13 ఏళ్ల రొనాల్డో 6 అడుగుల (1.8 మీటర్లు) పొడవున్న బ్రెజిలియన్ రెయిన్‌బో బోవా కన్‌స్ట్రిక్టర్.. ఇది పైథాన్ జాతి. ఈ కొండ చిలువ ఇంగ్లాండ్‌లోని పోర్ట్స్‌మౌత్ కాలేజీలో బోనులో నివసిస్తోంది. ఇక్కడే ఉంటూ ఇప్పుడు పిల్లలకు జన్మనిచ్చింది. కళాశాల జంతు సంరక్షకుడు పీట్ క్విన్లాన్ ప్రకారం.. ఈ కొండ చిలువ గత తొమ్మిదేళ్లపాటు మగవాడిగా భావించబడింది. అయితే పిల్లలు పుట్టిన తర్వాత.. ఈ కొండ చిలువ జెండర్ ప్రస్తావన మళ్ళీ వచ్చింది. RSPCA అనే స్వచ్ఛంద సంస్థ నుండి 9 సంవత్సరాల క్రితం కొండ చిలువ ను రక్షించినట్లు ‘రొనాల్డో’ కేర్‌టేకర్ చెప్పాడు.

ఇవి కూడా చదవండి

నివేదిక ప్రకారం, ఈ రకమైన పునరుత్పత్తిని పార్థినోజెనిసిస్ అంటారు. ఇది అలైంగిక పునరుత్పత్తికి సహజ రూపం. ఇక్కడ ఫలదీకరణం లేకుండా గుడ్డు పిండంగా అభివృద్ధి చెందుతుంది. ఇది మొక్కలు, ఆల్గే, కొన్ని అకశేరుకాలు (వెన్నెముక లేనివి)లతో పాటు కొన్ని సకశేరుక జంతువులలో సంభవించవచ్చు. అయితే ఇలా కొండచిలువ జాతికి చెందిన కొండచిలువలు మగవాటితో సంబంధం లేకుండా పిల్లలకు జన్మనిచ్చిన సంఘటలు ఇప్పటి వరకూ మూడు సార్లు చోటు చేసుకున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Horoscope Today: ఆ రాశి ఉద్యోగుల శ్రమకు, ప్రతిభకు గుర్తింపు..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగుల శ్రమకు, ప్రతిభకు గుర్తింపు..
ఐపీఎల్ ప్రారంభోత్సవంలో సందడి చేసే స్టార్స్ వీరే
ఐపీఎల్ ప్రారంభోత్సవంలో సందడి చేసే స్టార్స్ వీరే
ఏపీలో మొదటి మదర్స్ మిల్క్ బ్యాంక్‌ను ప్రారంభించిన మహేష్.. ఫొటోస్
ఏపీలో మొదటి మదర్స్ మిల్క్ బ్యాంక్‌ను ప్రారంభించిన మహేష్.. ఫొటోస్
రాత్రిపూట చియా సీడ్స్‌ వాటర్ తాగుతున్నారా..? ఏమౌతుందో తెలిస్తే..
రాత్రిపూట చియా సీడ్స్‌ వాటర్ తాగుతున్నారా..? ఏమౌతుందో తెలిస్తే..
సమస్యలు వినడమే కష్టమనుకుంటే.. అన్నం కూడా పెడుతున్నారే..!
సమస్యలు వినడమే కష్టమనుకుంటే.. అన్నం కూడా పెడుతున్నారే..!
మీ ఇంట్లో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడుతున్నారా..?
మీ ఇంట్లో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడుతున్నారా..?
చిటికెడు పసుపుతో బోలేడు లాభాలు.. ఇలా చేస్తే ఈజీగా బరువు తగ్గుతారట
చిటికెడు పసుపుతో బోలేడు లాభాలు.. ఇలా చేస్తే ఈజీగా బరువు తగ్గుతారట
: ఇబ్బందుల్లో హృతిక్ రోషన్ క్రిష్ 4.. బిగ్ షాక్ ఇచ్చిన నిర్మాత
: ఇబ్బందుల్లో హృతిక్ రోషన్ క్రిష్ 4.. బిగ్ షాక్ ఇచ్చిన నిర్మాత
ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు ఇవే.. పలు బిల్లులకు ఆమోదం..!
ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు ఇవే.. పలు బిల్లులకు ఆమోదం..!
టాయిలెట్‌లోంచి వస్తున్న వింత శబ్ధాలు.. కమోడ్‌లో తొంగి చూడగా..
టాయిలెట్‌లోంచి వస్తున్న వింత శబ్ధాలు.. కమోడ్‌లో తొంగి చూడగా..