Tulsi Ginger Water: టీకి బదులుగా పరగడుపున తులసి అల్లం నీరు త్రాగండి.. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..
కాఫీ, టీ బదులుగా కొన్ని ఆరోగ్యకరమైన పానీయాలతో రోజును ప్రారంభించడం ఆరోగ్యానికి మేలు అని చెబుతున్నారు. రోజు ప్రారంభంలో కొన్ని ఆరోగ్యకరమైన వస్తువులను తీసుకుంటే.. కొన్ని రకాల తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది. కనుక ఉదయం పాలు, టీ లేదా కాఫీకి బదులుగా తులసి అల్లం జ్యూస్ ని తాగమని సూచిస్తున్నారు. తులసి, అల్లం రెండూ మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ప్రతిరోజూ ఉదయాన్నే తులసి, అల్లం నీటిని తాగడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఈ రోజు తెలుసుకుందాం..
కరోనా తర్వాత ప్రజలకు ఆరోగ్యానికి సంబంధించిన కేరింగ్ ఎక్కువ అయింది. ఆరోగ్యంగా ఉండటానికి తమ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటున్నారు. అదే సమయంలో ఆరోగ్యంగా ఉండడం కోసం మంచి జీవనశైలి, సమయానికి నిద్ర లేవడం, వ్యాయామం చేయడంతో పాటు కొన్ని ఆరోగ్యకరమైన పానీయాలతో రోజును ప్రారంభించడం వంటి మెరుగైన ఉదయం దినచర్యను కలిగి ఉండటం చాలా ముఖ్యం. అయితే మన దేశంలో చాలా మంది టీ లేదా కాఫీతో రోజుని ప్రారంభించేందుకు ఇష్టపడతారు. కాఫీ, టీ బదులుగా కొన్ని ఆరోగ్యకరమైన పానీయాలతో రోజును ప్రారంభించడం ఆరోగ్యానికి మేలు అని చెబుతున్నారు. రోజు ప్రారంభంలో కొన్ని ఆరోగ్యకరమైన వస్తువులను తీసుకుంటే.. కొన్ని రకాల తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది. కనుక ఉదయం పాలు, టీ లేదా కాఫీకి బదులుగా తులసి అల్లం జ్యూస్ ని తాగమని సూచిస్తున్నారు. తులసి, అల్లం రెండూ మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ప్రతిరోజూ ఉదయాన్నే తులసి, అల్లం నీటిని తాగడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఈ రోజు తెలుసుకుందాం..
తులసి, అల్లం రెండూ ఔషధ గుణాలతో నిండి ఉన్నాయి. ఖాళీ కడుపుతో తులసి, అల్లం నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాదు బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. ప్రతిరోజూ ఉదయం అల్లం, తులసి నీటిని తాగడం ద్వారా అనేక ఇతర ప్రయోజనాలను పొందవచ్చు. అవి ఏమిటంటే
ఖాళీ కడుపుతో తులసి, అల్లం నీరు త్రాగడం వల్ల కలిగే ప్రయోజనాలు
- యాంటీ ఫంగల్ లక్షణాలు: యాంటీ ఫంగల్, యాంటీ వైరల్,యాంటీ కొలెస్ట్రాల్ లక్షణాలు తులసిలో ఉన్నాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచడంతో పాటు, గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి.
- బరువు తగ్గించడంలో ఎఫెక్టివ్: రోజూ ఉదయం ఖాళీ కడుపుతో తులసి, అల్లం నీళ్లు తాగితే బరువు తగ్గడం సులువవుతుంది. పొట్టలో ఉండే అదనపు కొవ్వును సులభంగా కరిగిస్తుంది.
- మెరుగైన జీర్ణక్రియ: తులసిలో యుజినాల్ ఉంది. ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అల్లంలో జింజెరాల్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాదు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.
- బలమైన రోగనిరోధక శక్తి: ఎవరైనా తరచుగా అనారోగ్యానికి గురవుతుంటే లేదా వాతావరణం మారడం వలన జలుబు, దగ్గుతో బాధపడుతుంటే.. దాని నుంచి బయటపడటానికి ప్రతిరోజూ ఉదయం తప్పనిసరిగా తులసి అల్లం నీటిని త్రాగాలి.
- సమృద్ధిగా యాంటీ ఆక్సిడెంట్లు: తులసి, అల్లంతో తయారైన ఈ పానీయంలో యాంటీ ఆక్సిడెంట్లలో సమృద్ధిగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి పనిచేస్తుంది. అంతేకాదు శరీరాన్ని సహజంగా డిటాక్సిఫై చేయడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ ఉదయం ఈ డ్రింక్ తాగడం వల్ల నోటి దుర్వాసన కూడా దూరమవుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను సూచనలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)