AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Hacks: వర్షాకాలంలో ఆహార పదార్ధాలకు పురుగులు పట్టకుండా ఎలా నిల్వ చేసుకోవాలంటే

ఈ సీజన్ లో ఎక్కువగా క్రిములు, కీటకాలు కనిపిస్తాయి. ఇవి నిల్వ చేసుకున్న ఆహార పదార్ధలల్లో కూడా చేరి వస్తువులను పాడు చేస్తాయి. పరుగులు పట్టిన వస్తువులు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు.. అదే సమయంలో వారిని శుభ్రం చేయడం కూడా కష్టం..అటువంటి పరిస్థితిలో వర్షాకాలంలో పప్పులు, బియ్యం, పిండి వంటివి నిల్వ చేసుకోవాలంటే కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి. వంట ఇంట్లో ఉండే కొని రకాల వస్తువులతో క్రిమి కీటకాలు చేరకుండా.. తేమ పట్టకుండా నిల్వ చేసుకోవచ్చు. ఈ రోజు ఆ టిప్స్ గురించి తెలుసుకుందాం..

Kitchen Hacks: వర్షాకాలంలో ఆహార పదార్ధాలకు పురుగులు పట్టకుండా ఎలా నిల్వ చేసుకోవాలంటే
Kitchen Hacks
Surya Kala
|

Updated on: Jun 27, 2024 | 12:33 PM

Share

వేసవి నుంచి ఉపసమనం ఇస్తూ వరుణుడు అడుగు పెట్టేశాడు. వర్షాకాలం వచ్చేసింది. అనేక ప్రాంతాల్లో వానలు కురుస్తున్నాయి. దీంతో చాలా చోట్ల నీరు చేరడంతోపాటు వాతావరణం తేమగా ఉంటుంది.ఈ సీజన్‌లో మసాలాలు, పంచదార, పిండి, బియ్యం, పప్పులు వంటి నిల్వ చేయడం అంటే కొంచెం కష్టమైన పనే.. ఎందుకంటే ఈ సీజన్ లో ఎక్కువగా క్రిములు, కీటకాలు కనిపిస్తాయి. ఇవి నిల్వ చేసుకున్న ఆహార పదార్ధలల్లో కూడా చేరి వస్తువులను పాడు చేస్తాయి. పరుగులు పట్టిన వస్తువులు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు.. అదే సమయంలో వారిని శుభ్రం చేయడం కూడా కష్టం.. అటువంటి పరిస్థితిలో వర్షాకాలంలో పప్పులు, బియ్యం, పిండి వంటివి నిల్వ చేసుకోవాలంటే కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి. వంట ఇంట్లో ఉండే కొని రకాల వస్తువులతో క్రిమి కీటకాలు చేరకుండా.. తేమ పట్టకుండా నిల్వ చేసుకోవచ్చు. ఈ రోజు ఆ టిప్స్ గురించి తెలుసుకుందాం..

ఉప్పు ఉపయోగించండి వర్షాకాలంలో బియ్యం పిండి, చపాతీ పిండి వంటి వాటిల్లో పురుగులు పడతాయి. దీంతో చాలా ఇబ్బంది కలుగుతుంది. అటువంటి పరిస్థితిలో ఈ సమస్యను నివారించడానికి ఉప్పు చక్కటి పరిష్కారం. పిండిని నిల్వ చేసే కంటైనర్‌లో.. పిండితో పాటు కొంచెం ఉప్పుని చేర్చుకోండి. ఉదాహరణకు 10 కిలోల పిండిలో 4 నుంచి 5 స్పూన్ల ఉప్పును జోడించి నిల్వ చేసుకోవచ్చు.

బే ఆకులు వర్షంలో ఎక్కువగా వంట ఇంట్లో కీటకాలు చోటు చేసుకుంటాయి. ఈ నేపధ్యంలో బే ఆకు వాసన కీటకాలను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. బియ్యం, ధాన్యం, శనగలు వంటివి నిల్వ చేసే కంటైనర్ లో కొన్ని బే ఆకులను వేయండి.

ఇవి కూడా చదవండి

దాల్చిన చెక్క దాల్చినచెక్క కీటకాలను దూరంగా ఉంచడానికి మంచి సహాయకారిగా ఉంటుంది. కనుక దాల్చినచెక్క ముక్కను పప్పులు పెట్టుకునే సీసాల్లో వేయండి. దాల్చిన చెక్క కీటకాలను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది.

వేప ఆకులు ఆహార పదార్థాల నుండి కీటకాలను దూరంగా ఉంచడానికి వేప ఆకులు ఒక మంచి ఎంపిక. పప్పులు , బియ్యం నిల్వ చేసే పాత్రల్లో కొన్ని వేప ఆకులను ఉంచినట్లయితే.. ఈ వస్తువులు కీటకాల నుండి రక్షించబడతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను సూచనలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)