AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budha Asta: కర్కాటక రాశిలో బుధుడు అస్తమయం.. సింహరాశితో సహా ఈ రాశుల వారికి సమస్యలే సమస్యలు

నవ గ్రహాల్లో రాకుమారుడైన బుధుడు జూలై 24, 2025న సాయంత్రం 7:42 గంటలకు రాశి కర్కాటక రాశిలో అస్తమిస్తాడు. దీని ప్రభావం మొత్తం 12 రాషులపై మంచి చెడుల ప్రభావాన్ని చూపిస్తుంది. అంతేకాదు దేశం, ప్రపంచం, స్టాక్ మార్కెట్‌పై కూడా కనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో బుధుడు అస్తమించడం వల్ల ఏ రాశుల వారు ప్రతికూలంగా ప్రభావితమవుతారో తెలుసుకుందాం.

Budha Asta: కర్కాటక రాశిలో బుధుడు అస్తమయం.. సింహరాశితో సహా ఈ రాశుల వారికి సమస్యలే సమస్యలు
Budha Asta 2025
Surya Kala
|

Updated on: Jul 22, 2025 | 5:34 PM

Share

కర్కాటక రాశిలో బుధుడు అస్తమించడం వలన వ్యక్తి ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్ సామర్థ్యం, నిర్ణయం తీసుకునే శక్తిపై ప్రభావం చూపుతుంది. అయితే ఖర్చులను నియంత్రించడంలో, పొదుపు చేయడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఈ సమయంలో కుటుంబ బాధ్యతలను నెరవేర్చడంలో లేదా ప్రయాణ ప్రణాళికలను రూపొందించడంలో అడ్డంకులు ఏర్పడవచ్చు. జూలై 24, 2025న సాయంత్రం 7:42 గంటలకు బుధుడు చంద్రుని రాశి కర్కాటక రాశిలో అస్తమిస్తాడు. దీని ప్రభావం మొత్తం రాశులపై ప్రభావం పడుతుంది. ఈ కాలంలో ఆలోచనాత్మకంగా మాట్లాడటం, ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితిలో బుధుడు అస్తమించడం వల్ల ఏ రాశులు ప్రతికూలంగా ప్రభావితమవుతాయో తెలుసుకుందాం..

మేష రాశి: ఈ రాశికి బుధుడు మూడవ, పన్నెండవ ఇంటి అధిపతి. ఇప్పుడు బుధుడు వీరి నాల్గవ ఇంట్లో అస్తమిస్తున్నాడు. దీని ప్రభావం ఏమిటంటే ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ పనిలో పదేపదే అడ్డంకులను ఎదుర్కొంటారు. వీరికి అవకాశాలు లభిస్తాయి. అయితే ఫలితాలు ఆశించిన విధంగా ఉండవు. ఇది ఆత్మపరిశీలన చేసుకోవడానికి, వ్యూహాలను పునరాలోచించుకోవడానికి తగిన సమయం. ఉద్యోగస్తులు అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. కొన్ని ఊహించని పరిస్థితుల కారణంగా మానసిక అశాంతికి గురి అయ్యే అవకాశం ఉంది.

మిథున రాశి: ఈ రాశి వారికి బుధుడు మొదటి, నాల్గవ ఇళ్లకు అధిపతి. ఇప్పుడు రెండవ ఇంట్లో అస్తమిస్తున్నాడు. దీని ప్రభావం వలన కెరీర్ లో గందరగోళం ఏర్పడవచ్చు. రోజువారీ జీవిత గమనం కూడా ప్రభావితం కావచ్చు. ఉద్యోగంలో అకస్మాత్తుగా మార్పు వచ్చే అవకాశం ఉంది. ఇది అసంతృప్తి భావనకు కారణమవుతుంది. వ్యాపారంలో కొత్త ఒప్పందం చేసుకోవడం లేదా కొత్త భాగస్వామ్యాన్ని ప్రారంభించడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కర్కాటక రాశి: రాశి వారికి మూడవ, పన్నెండవ ఇంటి అధిపతి అయిన బుధుడు మొదటి ఇంట్లో అస్తమిస్తున్నాడు. దీని ప్రభావం వలన వీరి హృదయం ఒప్పుకొని విధంగా స్థానభ్రంశం వంటి పరిస్థితి తలెత్తవచ్చు. కెరీర్ పరంగా, కోరుకున్న ఉద్యోగం పొందడంలో ఆలస్యం కావచ్చు లేదా చేస్తున్న పనిలో సంతృప్తి లేకపోవడం కావచ్చు. వ్యాపారంలో పోటీ ఒత్తిడి పెరుగుతుంది. దీని కారణంగా లాభాలు తగ్గవచ్చు.

సింహ రాశి: వారికి బుధుడు రెండవ, పదకొండవ ఇంటి అధిపతి. ఇప్పుడు పన్నెండవ ఇంట్లో అస్తమిస్తున్నాడు. దీని కారణంగా వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. ఆకస్మిక నష్టం మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. కెరీర్‌లో బదిలీ ఉండవచ్చు. ఇది గందరగోళాన్ని పెంచుతుంది. వ్యాపారంలో ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవద్దు. ఎందుకంటే ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. ఈ సమయం ఆర్థిక పరిస్థితి కొంచెం అస్థిరంగా ఉంది.

కన్య రాశి: వారికి బుధుడు మొదటి, పదవ ఇళ్లకు అధిపతి. ఇప్పుడు పదకొండవ ఇంట్లో అస్తమిస్తున్నాడు. ఈ సమయంలో చేసే ప్రయాణాల్లో అడ్డంకులు ఏర్పడవచ్చు. పరిచయస్తుల నుంచి కోరుకున్న విధంగా మద్దతు లభించదు. కెరీర్‌లో సీనియర్లతో విభేదాలు ఏర్పడవచ్చు. దీంతో చేస్తున్న పని ప్రభావితం అవుతుంది. వ్యాపారంలో నిర్ణయాలు తీసుకోవడంలో సందేహం ఉంటుంది. దీని కారణంగా ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంది. ఆదాయం, వ్యయాన్ని సమతుల్యం చేసుకోవడం సవాలుగా ఉంటుంది.

వృశ్చిక రాశి: వారికి బుధుడు తొమ్మిదవ, పదకొండవ ఇంటి అధిపతి . ఇప్పుడు తొమ్మిదవ ఇంట్లో అస్తమిస్తున్నాడు. దీని ప్రభావం వలన ఈ రాశికి చెందిన వ్యక్తులు తమ లక్ష్యాన్ని చేరుకోవడంలో పదేపదే అడ్డంకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో అవగాహన, నిర్ణయం తీసుకునే సామర్థ్యం కొంత బలహీనంగా ఉండవచ్చు. కెరీర్ రంగంలో, సీనియర్లు మీ ప్రతిభను విస్మరించవచ్చు. ఇది మానసిక ఒత్తిడిని పెంచుతుంది. వ్యాపారంలో సాధారణ పనుల నుంచి పరిమిత లాభం పొందుతారు. అయితే వీరు స్టాక్ మార్కెట్ నుంచి లాభం పొందే అవకాశం ఉంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.