దేశంలో ఈ నగరం విదేశీయులను ఆకట్టుకుంటూ .. ఫేమస్ పర్యాటక నగరాల్లో టాప్ పైఫ్ లో చోటు దక్కించుకుంది..
2025లో ప్రపంచంలోనే పర్యాటకులను ఆకర్షిస్తున్న అత్యుత్తమ నగరాలు ఏమిటి అనేది తెలుసుకునేందుకు ట్రావెల్ + లీజర్ సంస్థ సర్వే చేయింది. ఈ సర్వేలో మన దేశంలోని ఒక ప్రధాన నగరానికి టాప్ ఫైవ్ ప్లేస్ల్ లో చోటు దక్కింది. వారసత్వం, షాపింగ్ , ఆతిథ్యంలో ప్రశంసలు పొందిన రాజస్తాన్ లోని జైపూర్ నగరం టోక్యో , బ్యాంకాక్ వంటి ప్రపంచ ఇష్టమైన నగరాల సరసర చోటు దక్కించుకుంది. కాగా మెక్సికోలోని శాన్ మిగ్యుల్ డి అల్లెండే ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది

గ్లోబల్ ట్రావెల్ పబ్లికేషన్ ట్రావెల్ + లీజర్ నిర్వహించిన “వరల్డ్స్ బెస్ట్ అవార్డ్స్” 2025 సర్వేలో రాజస్థాన్ రాజధాని జైపూర్ ఇటలీకి చెందిన ఫ్లోరెన్స్‌ను అధిగమించింది. అంతర్జాతీయ పర్యాటకులచే ఓటు వేయబడిన జైపూర్ నగరం ప్రయాణం, సంస్కృతి, మొత్తం సందర్శకుల అనుభవంతో ప్రపంచంలోని టాప్ ఐదు నగరాల్లో ఒకటిగా నిలిచింది. దీంతో పింక్ సిటీ ఆఫ్ ఇండియా పిలబడే జైపూర్ నగరం అనేక ఐకానిక్ గ్లోబల్ గమ్యస్థానాల కంటే ముందుంది.
పింక్ సిటీగా కూడా పిలువబడే జైపూర్.. 91.33 స్కోరుతో ప్రపంచంలోనే పర్యాటకులను ఆకర్షిస్తున్న నగరాల లిస్టు లో 5వ స్థానంలో ఉంది. 90.08 స్కోరుతో 11వ స్థానంలో ఉన్న ఫ్లోరెన్స్ కంటే ముందుంది. ట్రావెల్ + లీజర్ జైపూర్‌ను తప్పక చూడవలసిన గమ్యస్థానంగా అభివర్ణించింది. ఈ నగరంలోని సంపన్న హోటళ్ళు, ప్రపంచ స్థాయి షాపింగ్, శక్తివంతమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రశంసించింది.
ఈ జాబితాలో అగ్రస్థానంలో మెక్సికోలోని శాన్ మిగ్యుల్ డి అల్లెండే ఉంది. ఇది దాని ప్రత్యేకమైన సాంస్కృతిక వాతావరణం, ఆర్ధిక స్థోమతకు ప్రసిద్ధి చెందింది. సర్వే ప్రకారం మ్యూజియంలు, బొటానికల్ గార్డెన్‌లు ,బోటిక్ షాపింగ్ వంటివి పర్యాటకులకు ఆకర్షణలుగా నిలుస్తున్నాయని పేర్కొంది. నగరం కళా దృశ్యం, శాన్ మిగ్యుల్ రైటర్స్ కాన్ఫరెన్స్ & లిటరరీ ఫెస్టివల్‌తో సహా వార్షిక కార్యక్రమాల నిండిన క్యాలెండర్ కూడా చాలా మంది ఈ నగరం మొదటి ప్లేస్ లో నిలవడానికి ముఖ్య కారణాలుగా పేర్కొన్నారు.
థాయిలాండ్‌లోని చారిత్రాత్మక ఉత్తర నగరం చియాంగ్ మై 91.94 స్కోరుతో రెండవ స్థానంలో ఉంది. ఈ నగరం సాంస్కృతిక ప్రదేశాలు, షాపింగ్, వంటకాలు, ప్రకృతికి ప్రాప్యత , అసమానమైన కలయికకు ప్రసిద్ధి చెందింది. చియాంగ్ మై లోని అద్భుతమైన లగ్జరీ హోటళ్ళు పర్యాటకులను ఆకర్షించి ఓటు వేయడానికి కారణం అని తెలుస్తుంది.
ట్రావెల్ + లీజర్ పాఠకుల ప్రకారం ప్రపంచంలోని అగ్ర నగరాలు నిజంగా అన్నీ కలిగి ఉన్నాయి. అద్భుతమైన ఆకర్షణలు, టళ్ళు, ఎలక్ట్రిక్ డైనింగ్ దృశ్యాలు, ప్రపంచ స్థాయి వైబ్‌తో పర్యాటకులను తమవైపు వచ్చేలా చేస్తున్నాయి. ట్రావెల్ + లీజర్ వెల్లడించిన టాప్ నగరాల జాబితాలోని అనేక పెద్ద పేర్లు ప్రపంచ ప్రయాణికులకు సుపరిచితం. అయితే ఈ ఏడాది ఇష్టమైన నగరాల్లో కొన్ని నగరాల ఎంపిక ఆశ్చర్యకరం అనిపించావచ్చు.
పర్యాటకులకు టాప్ 10 ఉత్తమ నగరాలు లిస్టు
శాన్ మిగ్యుల్ డి అల్లెండే- మెక్సికో
చియాంగ్ మై- థాయిలాండ్
టోక్యో – జపాన్
బ్యాంకాక్- థాయిలాండ్
జైపూర్- భారత దేశం
హోయ్ ఆన్- వియత్నాం
మెక్సికో నగరం
క్యోటో- జపాన్
ఉబుద్- బాలి
కుజ్కో- పెరూ
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








