AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhumi Amla: ఈ మొక్కని కలుపు మొక్క అని పీకేస్తున్నారా.. అణువణువూ ఔషధగుణాలే.. సర్వ రోగ నివారిణి

ప్రకృతిలోని అనేక మొక్కలు ఔషధగుణాలు కలిగి ఉన్నాయి. వాటిని మనం ఉపయోగించకుండా.. ఎందుకూ పనికి రాదని భావించి నిర్లక్షం చేస్తున్నాం. మన ఇంటి చుట్టూ పెరిగే అనేక మొక్కలను కలుపు మొక్కలని భావించి పీకి పారేస్తూ ఉంటాం. అలాంటి మొక్కలో ఒకటి భూమి ఆమ్లా.. దీనినే నేల ఉసిరి అని కూడా అంటారు. ఇది ఆయుర్వేద మూలిక. ఈ మొక్క అనేక వ్యాధుల నివారణకు వైద్య చికిత్సలో ఉపయోగపడుతోంది. నేల ఉసిరి కాండం, వేర్లు, ఆకులు, పువ్వులు, కాయలు మాత్రమే కాదు చివరికి చెట్టు నుంచి ఏర్పడే పాలను కూడా ఆయుర్వేద మందుల్లో ఉపయోగిస్తారు. ఈ రోజు నేల ఉసిరి ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాం..

Surya Kala
|

Updated on: Jul 22, 2025 | 12:27 PM

Share
చాలా మంది తమ చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఖరీదైన రసాయన ఉత్పత్తులను ఉపయోగిస్తారు. ఈ ఉత్పత్తులు కొన్నిసార్లు ప్రయోజనానికి బదులుగా హాని కలిగిస్తాయి. ఎవరైనా మార్కెట్ నుంచి చర్మ సంరక్షణ, జుట్టు సంరక్షణ ఉత్పత్తులను కొని కొని చికాకు వస్తే.. అటువంటి వ్యక్తులు ఒక్కసారి నేల ఉసిరిని(భూమి ఆమ్లా) ప్రయత్నించండి. చర్మ మెరిసేలా చేస్తుంది. అంతేకాదు జుట్టు నల్లగా, దట్టంగా కురులు  పెరిగేలా చేస్తుంది. ఆయుర్వేదంలో నెల ఉసిరిని ఒక అద్భుతమైన మొక్కగా పరిగణిస్తారు. ఇది ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. దీని ఆకులు, కాండం , వేర్లు అనేక ఆరోగ్య సమస్యలను నయం చేయడంలో ప్రభావవంతంగా ఉంటాయి.

1 / 8
ఆయుర్వేదం ప్రకారం నేల ఉసిరిలోని ఔషధ గుణాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ఈ మొక్కకి ఉండే చిన్న చిన్న పండ్లు పోషకమైన, ఔషధ పండ్లు. ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు , ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి

2 / 8
నేల ఉసిరి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్, డయాబెటిస్, కాలేయం, జీర్ణ సమస్యలను నయం చేయడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, దీనిని సరిగ్గా తీసుకుంటే కాలేయ వాపు, హెపటైటిస్ బి, కామెర్లు, క్యాన్సర్ వంటి వ్యాధుల నివారణలో కూడా మంచి ప్రభావాలను చూపుతుంది.

3 / 8
భూమి ఆమ్లాలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇది శరీరాన్ని వ్యాధులతో పోరాడటానికి వీలు కల్పిస్తుంది. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా, ప్రకాశవంతంగా మారుస్తాయి, అలాగే జుట్టును బలోపేతం చేస్తాయి. మందంగా చేస్తాయి.

4 / 8
దీనిలో ఫైబర్ అధికంగా ఉండటం జీర్ణక్రియను మెరుగుపడుతుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ రక్తపోటును నియంత్రిస్తాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

5 / 8
నేల ఉసిరి రక్తంలో చక్కెర పరిమాణాన్ని నియంత్రించడం ద్వారా డయాబెటిస్ లక్షణాలను తగ్గిస్తుంది. ఇది యాంటీఆక్సిడెంట్లు కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

6 / 8
కామెర్లు, హెపటైటిస్, కాలేయ ఆరోగ్యానికి నేల ఉసిరి దివ్య ఔషధం. కాలేయం సమస్యలు వల్ల ఏర్పడే కంటి సమస్యల నుంచి ఉపశమనం కోసం నేల ఉసిరి రసాన్ని ఉదయం ఒకసారి ఖాళీ కడుపుతో తీసుకోవాలి.  ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో నేల ఉసిరి రసాన్ని కలిపి సేవిస్తే కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

7 / 8
భూమి ఆమ్లా తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే నిపుణులు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. భూమి ఆమ్లా తీసుకునేటప్పుడు కారంగా ఉండే ఆహారం, పాలు, మాంసాహారం తీసుకోకూడదు. సలాడ్‌ను ఆహారంలో చేర్చుకోవాలి. దీనితో పాటు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, పిల్లలు దీనిని తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోవాలి. తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు దీనిని తీసుకునే ముందు ఆయుర్వేద వైద్యుడిని కూడా సంప్రదించాలి.

8 / 8
Follow Us
కప్ప – ముత్యం నీతి కథ: అత్యాశతో ఉన్నదీ పోగొట్టుకున్న వేటగాడు..!

మీ వద్ద తులం బంగారం ఉంటే ఎంత లోన్ వస్తుందో తెలుసా..?

ఏపీలో మరో గోల్డ్ మైన్స్.. త్వరలో టెండర్ ప్రక్రియ!

అమ్మోరు సినిమాలో నిజమైన పాముతో షూటింగ్.. తర్వాత జరిగిందిదే..

ఏపీ ఈఏపీ-సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. వెబ్ ఆప్షన్లు ఎప్పటి

ఓటీటీలోకి మలయాళం సూపర్ హిట్ .. తెలుగులోనూ చూడొచ్చు

రోజుకు 3GB డేటాతో బీఎస్‌ఎన్‌ఎల్‌ చౌకైన ప్లాన్‌..వ్యాలిడిటీ ఎంతంటే

ఏందక్కాయ్ నువ్వు..ఏకంగా కండక్టర్ బ్యాగుకే ఎసరు పెట్టావ్..

పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పాతకాలపు సాంప్రదాయ టిఫిన్ "రైలు పలహారం"
పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పాతకాలపు సాంప్రదాయ టిఫిన్
దేశ అణు రక్షణపై సైబర్ అటాక్! కీలక పత్రాలు లీక్!