AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fatty Liver: ఫ్యాటీ లివర్ సమస్య నుంచి ఉపశమనం కోసం ఈ సింపుల్ టిప్స్ పాటించండి.. ప్రభావం వారంలోనే కనిపిస్తుంది

ప్రస్తుతం ఫ్యాటీ లివర్ సమస్య నివురుగప్పిన నిప్పులా వ్యాపిస్తోందని యువతలో వేగంగా పెరుగుతోందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. దీనికి ముఖ్యమైన కారణం చెడు జీవన శైలి. ఈ ఫ్యాటీ లివర్ సమస్యను నయం చేసుకోకపొతే కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంది. అయితే మొదట్లోనే ఈ సమస్యకు చెక్ పెడితే భయపడాల్సిన అవసరం లేదు. మందులు తీసుకోవడం, కొన్ని జీవనశైలి మార్పులు చేయడం ద్వారా ఫ్యాటీ లివర్‌ను నయం చేయవచ్చు (లైఫ్‌స్టైల్ చేంజెస్ ఫర్ ఫ్యాటీ లివర్). ఈ రోజు జీవన శైలిలో చేసుకోవాల్సిన మార్పులు ఏమిటో తెలుసుకుందాం..

Fatty Liver: ఫ్యాటీ లివర్ సమస్య నుంచి ఉపశమనం కోసం ఈ సింపుల్ టిప్స్ పాటించండి.. ప్రభావం వారంలోనే కనిపిస్తుంది
Fatty Liver Diet
Surya Kala
|

Updated on: Jul 22, 2025 | 2:04 PM

Share

ఫ్యాటీ లివర్ అనేది కాలేయంలో అదనపు కొవ్వు పేరుకుపోయే తీవ్రమైన ఆరోగ్య సమస్య. ఈ రోజుల్లో యువతలో ఈ సమస్య చాలా పెరుగుతోంది. కొవ్వు పెరగడం వల్ల కాలేయంపై ఒత్తిడి పెరుగుతుంది, దీని కారణంగా అది క్రమంగా దెబ్బతినడం ప్రారంభమవుతుంది. అయితే జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా కొవ్వు కాలేయ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ మార్పులు చాలా ప్రభావవంతంగా ఉంటాయి, కొన్ని రోజుల్లో మీరే తేడాను అనుభూతి చెందడం ప్రారంభిస్తారు. కొవ్వు కాలేయాన్ని సమస్య నుంచి ఉపశమనం కోసం ఏమి చేయాలో ఈ రోజు తెలుసుకుందాం.

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి కొవ్వు కాలేయాన్ని నయం చేసుకోవాలంటే ముందు తినే ఆహారాన్ని మెరుగుపరచుకోవడం అవసరం.

కొవ్వు కాలేయాన్ని సమస్య నుంచి ఉపశమనం కోసం ఏమి తినాలంటే

  1. ఫైబర్- తృణధాన్యాలు, ఓట్స్, గంజి, ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు (ఆపిల్, బేరి, బొప్పాయి వంటివి) తినండి.
  2. ప్రోటీన్ – పప్పులు, పెసలు, సోయాబీన్, గుడ్డులోని తెల్లసొన, కీమా వంటి ఆహరాన్ని తీసుకోండి.
  3. ఇవి కూడా చదవండి
  4. ఆరోగ్యకరమైన కొవ్వులు – ఆలివ్ నూనె, గింజలు (బాదం, వాల్‌నట్స్) అవకాడో వంటి ఆరోగ్యకరమైన కొవ్వులను చేర్చుకోండి.
  5. యాంటీఆక్సిడెంట్లు – పసుపు, వెల్లుల్లి, గ్రీన్ టీ, అల్లం వంటివి కూడా ప్యాటీ లివర్ సమస్యను తగ్గిస్తాయి.

ఈ సమస్య ఉన్నవారు ఏమి తినకూడదంటే

  1. చక్కెర, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు – స్వీట్లు, శీతల పానీయాలు, శుద్ధి చేసిన పిండి అంటే మైదా, తెల్ల రొట్టెలకు దూరంగా ఉండండి.
  2. వేయించిన ఫుడ్, జంక్ ఫుడ్- వేయించిన ఆహారం, ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినవద్దు.
  3. ఆల్కహాల్- తక్కువ మొత్తంలో తీసుకునే ఆల్కహాల్ కూడా కాలేయాన్ని దెబ్బతీస్తుంది. కనుక ఆల్కహాల్‌ అలవాటుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
  4. బరువు నియంత్రణ: కొవ్వు కాలేయం ఏర్పడటానికి ఊబకాయం ఒక ప్రధాన కారణం. ఎవరైనా అధిక బరువుతో ఉంటే క్రమంగా బరువు తగ్గడానికి ప్రయత్నించండి. ప్రతిరోజూ 30-45 నిమిషాలు వ్యాయామం చేయండి (నడక, యోగా, సైక్లింగ్, ఈత).
  5. హైడ్రేషన్ పై శ్రద్ధ వహించండి నీరు కాలేయం నుంచి విషాన్ని బయటకు పంపడంలో సహాయపడుతుంది. రోజూ 8-10 గ్లాసుల నీరు త్రాగాలి. నిమ్మకాయ నీరు, కొబ్బరి నీరు , హెర్బల్ టీలు కూడా కాలేయానికి మంచివి.
  6. క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా కార్డియో వ్యాయామాలు (జాగింగ్, సైక్లింగ్) కొవ్వును బర్న్ చేస్తాయి. అలాగే కపాలభాతి ప్రాణాయామం, భుజంగాసనం, ధనురాసనం, పవనముక్తాసనం వంటి యోగాసనాలు కూడా కాలేయానికి మేలు చేస్తాయి.
  7. బాగా నిద్ర నిద్ర లేమి సమస్య కూడా జీవక్రియను ప్రభావితం చేస్తుంది. తక్కువ నిద్ర పోయేవారిలో కొవ్వు కాలేయ సమస్యను పెంచుతుంది. ప్రతిరోజూ 7-8 గంటలు నిద్రపోయేలా చూసుకోండి.
  8. ఒత్తిడి నిర్వహణ ఒత్తిడి కాలేయంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ధ్యానం, శ్వాస మీద అదుపు, అభిరుచులను పెంపొందించుకొని తద్వారా ఒత్తిడి నుంచి ఉపశనం పొందండి.
  9. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు.. వైద్యుడిని సంప్రదించి, ఎప్పటికప్పుడు మందులు తీసుకోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)