అమవాస్య వచ్చేస్తుంది.. ఈ రోజు పొరపాటున కూడా చేయకూడని పనులివే!
ప్రతి నెల అమావాస్య రావడం అనేది సహజం. అయితే ఈ సారి జూలై 24న రాబోయే అమావాస్యను ఆది అమావాస్య అంటారు. దీనికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు పూర్వీకులకు తర్పణం సమర్పించడం చాలా మంచిది అంటారు. అయితే ఈ అమవాస్య రోజున కొన్ని పనులు అస్సలే చేయకూడదు అంటున్నారు పండితులు అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Jul 22, 2025 | 5:39 PM

ప్రతి నెల అమావాస్య రావడం అనేది సహజం. అయితే ఈ సారి జూలై 24న రాబోయే అమావాస్యను ఆది అమావాస్య అంటారు. దీనికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు పూర్వీకులకు తర్పణం సమర్పించడం చాలా మంచిది అంటారు. అయితే ఈ అమవాస్య రోజున కొన్ని పనులు అస్సలే చేయకూడదు అంటున్నారు పండితులు అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

అమావాస్య రోజున ప్రయాణాలు అస్సలే చేయకూడదు అంటారు పండితులు. ఈరోజు ప్రయాణాలు చేయడం వలన ప్రయాణాల్లో ఆటంకాలు వస్తుంటాయంట. అంతే కాకుండా కొన్ని సార్లు ప్రమాదాలు కూడా జరిగే ఛాన్స్ కూడా ఉన్నదంట. అందుకే ఎట్టి పరిస్థితుల్లో అమావాస్య రోజున దూర ప్రయాణాలు చేయకూడదంట.

ఇక అమావాస్య రోజున దుష్ట శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుందంటారు మన పెద్దవారు. అందుకే ఈరోజున ప్రతి కూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. అలాగే రాత్రి సమయంలో ఎట్టిపరిస్థితుల్లో ఒంటిరిగా ప్రయాణం చేయకూడదంట.

అలాగే ఈ రోజున గోర్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించడం వంటివి అస్సలే చేయకూడదంట. దీని వలన నెగిటివ్ ఎనర్జీ ఇంటిలోపలికి ప్రవేశిస్తుందంట. ఇది అస్సలే మంచిది కాదు అంటున్నారు పండితులు.

అలాగే అమావాస్య రోజున పెళ్లీలు చేయడం గృహ ప్రవేశం , చిన్న పిల్లలకు ఉయ్యాల పండుగ, నామకరణం, కొత్త వ్యాపారాలు చేపట్టడం, తీర్థ యాత్రలు చేయడం వంటివి చేయకూడదంట. ఈరోజున ఎలాంటి శుభ కార్యాలు జరపకూడదని చెబుతున్నారు పెద్దవారు.