వేడి వేడిగా ఉన్న ఆహారం తింటున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు!
చాలా వేడి వేడిగా ఉండే ఫుడ్ తినడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా వేడి వేడి రైస్ లేదా ఇతర ఆహారపదార్థాలు తింటుంటారు. మరీ ముఖ్యంగా వర్షాకాంలో ఎక్కువ మంది వేడి వేడి ఆహారం తినడానికే ఎక్కవ మక్కువ చూపిస్తారు. కానీ ఇలా వేడి ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇప్పుడు మనం దాని గురించే తెలుసుకుందాం.
Updated on: Jul 22, 2025 | 5:29 PM

65 డిగ్రీల కంటె ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న ఆహార పదార్థాలు లేదా పానీయాలు తీసుకోవడం వలన అనేక సమస్యలు ఎదురు అవుతాయంట. మరీ ముఖ్యంగా అన్న వాహికలోని సన్నని పొర కాలిపోతుందంట. దీని వలన భవిష్యత్తులో అనేక సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో అతిగా వేడి ఉండే ఆహారాలు తీసుకోకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

అదే విధంగా కొన్ని సార్లు వేడి వేడి ఆహారం లేదా టీ, కాఫీ వంటి డ్రింక్స్ తాగుతున్నప్పుడు నాలుక లేదా కడుపులో వేడిగా, కాలి నట్లుగా అనిపిస్తుంది. ఇలాంటి సమయంలో మరోసారి అస్సలే వేడి ఫుడ్ తీసుకోకూడదంట. దీని వలన కడుపులో మంట కణజాలంలో మార్పులు సంభవించి, క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉన్నదంట.

కొన్ని సార్లు వేడి వేడి అన్నం తినాలంటే ఇబ్బంది ఏర్పడుతుంది. ముఖ్యంగా నాలుక చాలా సున్నితంగా కాలినట్లు అనిపించడంతో ఆహారం తీసుకోవడం కష్టమవుతుంది. అయితే అలాంటి సందర్భాల్లో వేడి వేడి అన్నం అస్సలే తీసుకోకూడదంట. ఇది మీ శరీరానికి ఒక హెచ్చిరికగా భావించాలంట. లేకపోతే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట.

అలాగే చాలా మందికి ధూమపానం, మద్యపానం చేయడం అలవాటు ఉంటుంది. అయితే అలాంటి వారు అస్సలే వేడి వేడి ఆహారం తీసుకోకూడదంట. దీని వలన నోటిలోని శ్లేష్మ పొర పొగాకు వలన ప్రభావితం అవుతుంది. అటువంటి సమయంలో వేడి వేడి ఆహారం తీసుకోవడం వలన సమస్య మరింత ఎక్కువ అయ్యి నోటి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుందంట.