Viral Video: బట్టలపై మరకలు తొలగించి.. మిలమిలా మెరిసేలా చేస్తున్న పారాసెటమాల్.. వీడియో వైరల్
దుస్తుల మీద మరకలు పడితే వాటిని ఉతకడం ఒక పెద్ద పని. అంతేకాదు ఎంత మంచి బట్టలు అయినా సరే మరకలు ఉంటే మళ్ళీ వేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా భావిస్తారు. ఈ నేపధ్యంలో బట్టల మీద పడిన మరకలను పోగొట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న పెయిన్ కిల్లర్ ఫర్ క్లీనింగ్ క్లాత్స్ వీడియో చూస్తే షాక్ అవుతారు. ఎందుకంటే బట్టలపై ఉన్న మరకలను టాబ్లెట్స్ తో తొలగిస్తున్నారు.

శరీరం అలసిపోయినా లేదా జ్వరం వచ్చినా.. వెంటనే ఒక చిన్న పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకుంటే చాలు ఉపశమనం లభిస్తుంది. అయితే జ్వరం చాలా ఎక్కువగా ఉంటే.. కొన్నిసార్లు ఈ టాబ్లెట్ కూడా పనిచేయదు. అప్పుడు వైద్యులు ఈ టాబ్లెట్ తో పాటు ఇతర యాంటీబయాటిక్ మందులను తీసుకోవాలని సలహా ఇస్తారు. ఏది ఏమైనా ప్రతి ఇంట్లో ఉండే ప్రథమ చికిత్స వస్తు సామగ్రిలోని పారాసెటమాల్ కి ప్రత్యేక స్థానం ఉందని చెప్పవచ్చు. అయితే ఈ టాబ్లెట్ అనేక ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని మీకు తెలుసా.. వైరల్ అవుతున్న వీడియోలో ఇదే విషయాన్నీ తెలిపారు.
మీరు ధరించిన బట్టలపై పసుపు లేదా నూనె వంటి మరకలు పడి.. వాటిని తొలగించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అటువంటి వారు బట్టలు ఉతకేటప్పుడు పారాసెటమాల్ వాడవచ్చు. చాలా మంది ఆస్ప్రిన్ వాడమని కూడా సిఫార్సు చేస్తున్నారు.
అద్భుతాన్ని చూడండి.
ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఒక మహిళ పారాసెటమాల్ సహాయంతో బట్టలపై ఉన్న మరకలను క్షణాల్లో శుభ్రం చేస్తున్నట్లు చూడవచ్చు. బట్టలు శుభ్రం చేయడానికి, ఆమె రెండు 650 MG పారాసెటమాల్ మాత్రలను తీసుకుని వేడి నీటిలో వేసి వాటిని కరిగించింది.
దీని తరువాత.. ఆ నీటిలో బేకింగ్ సోడా, డిటర్జెంట్ జోడించింది. తరువాత నీటిలో ఇవన్నీ కరిగేలా కలిపి.. ఆ నీరు చల్ల గా అయిన తర్వార మరకలు ఉన్న దుస్తులను ఆ నీటిలో ముంచాడు. కొంచెం సేపటి తర్వాత బట్టలపై ఉన్న మరకను రుద్దాడు. తర్వాత ఆ బట్టని నీటిలో ముంచి పైకి తీసిన తర్వత దానిపై ఉన్న మరకలు తొలగి.. ఆశ్చర్యకరంగా బట్టలు మెరుస్తున్నాయి. సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియో గురించి రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది నమ్మలేకపోతున్నామని కామెంట్ చేస్తున్నారు.
ఒక యూజర్ ‘మిగిలిన మరకలను డిటర్జెంట్ తో శుభ్రం చేశారా అని నాకు ఆశ్చర్యంగా ఉంది’ అని రాశారు. మరొకరు ‘ఇలాంటి పిచ్చి ట్రిక్స్ తో ప్రజలను పిచ్చివాళ్లను చేస్తున్నారు’ అని రాశారు. ఇది కాకుండా, ఈ వీడియోపై చాలా రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాదు తలనొప్పి లేదా జ్వరం కోసం తీసుకునే పారాసెటమాల్ మాత్రలు ఆరోగ్యానికి మాత్రమే కాదు బట్టలపై మరకలు తొలగించేందుకు కూడా ఉపయోగిస్తున్నారా.. దేవుడా అని ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు కొందరు.
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




