Lord Shani dev: మరింత తగ్గనున్న శనీశ్వరుడి ప్రభావం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు..!
ఈ నెల 31 నుంచి ఆగస్టు 22వ తేదీ వరకు సింహ రాశిలో శుక్ర, బుధులు యుతి చెందబోతున్నాయి. ఈ రెండు శుభ గ్రహాల దృష్టి కుంభ రాశిలో ఉన్న శని మీద పడినందువల్ల శని ప్రభావం ప్రభావం మరింతగా తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, కుంభం, మీన రాశుల వారి జీవితాల్లో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.
ఈ నెల 31 నుంచి ఆగస్టు 22వ తేదీ వరకు సింహ రాశిలో శుక్ర, బుధులు యుతి చెందబోతున్నాయి. ఈ రెండు శుభ గ్రహాల దృష్టి కుంభ రాశిలో ఉన్న శని మీద పడినందువల్ల శని ప్రభావం ప్రభావం మరింతగా తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, కుంభం, మీన రాశుల వారి జీవితాల్లో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. పెండింగులో ఉన్న పదోన్నతులు లభించే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తేలికగా సఫలం అవుతాయి. గృహ నిర్మాణ కార్యక్రమాలు ఊపందుకుంటాయి.
- కర్కాటకం: అష్టమ శని ప్రభావం వల్ల ఈ రాశివారికి సాధారణంగా ప్రతి పనీ వెనుకబడిపోతుంటుంది. రావ లసిన డబ్బు రాక ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అయితే, సింహ రాశిలో శుక్ర, బుధుల కల యిక వల్ల ప్రతి పనీ చురుకుగా నెరవేరే అవకాశం ఉంటుంది. ధన సంబంధమైన వ్యవహారాలన్నీ గడువు కాలం లోగా పూర్తవుతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల సమాచారం అందు తుంది. ఎటువంటి సవాళ్లు, సమస్యలనైనా అధిగమిస్తారు. జీతభత్యాలు పెరగడం ప్రారంభిస్తాయి.
- సింహం: ఈ రాశిలో కలుసుకున్న బుధ, శుక్ర గ్రహాల దృష్టి సప్తమ స్థానంలో ఉన్న శని మీద పడినందు వల్ల జీవితంలో అనేక సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. చాలా కాలంగా ఆగిపోయిన పదోన్నతులు ఇప్పుడు అందే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. కొన్ని ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు అవకాశాలు అందడం ప్రారంభమవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో సానుకూల మార్పులు మొదలవుతాయి. అనేక శుభవార్తలు వినే అవకాశం ఉంది.
- వృశ్చికం: ఈ రాశివారికి అర్ధాష్టమ శని నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఇంటా బయటా అనుకూ లతలు పెరుగుతాయి. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. గృహ, వాహన సౌకర్యాలకు సంబంధించిన ఆటంకాలు తొలగిపోతాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. విదేశీ యానానికి మార్గం సుగమం అవు తుంది. ఉద్యోగం కోసం, ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం అవుతాయి.
- మకరం: ఈ రాశివారికి ఏలిన్నాటి శని ప్రభావం నుంచి దాదాపు పూర్తిగా విముక్తి లభిస్తుంది. రావలసిన డబ్బు సకాలంలో అందడం, జీతభత్యాలు ఆశించిన స్థాయిలో పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో రాబడికి లోటు లేకపోవడం వంటివి జరుగుతాయి. ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. ఎటు వంటి ప్రయత్నం తలపెట్టినా సకాలంలో నెరవేరుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి.
- కుంభం: ఈ రాశివారికి సప్తమంలో బుధ, శుక్రుల కలయిక జరుగుతున్నందువల్ల ఏలిన్నాటి శని ప్రభావం గణనీయంగా తగ్గుతుంది. అనేక ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సానుకూలపడతాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఉద్యోగ జీవి తంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆశించిన విధంగా ఉద్యోగం లభిస్తుంది. చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న ఆస్తి వివాదం ఒకటి సానుకూలంగా పరిష్కారమవుతుంది.
- మీనం: శనీశ్వరుడి మీద రెండు శుభగ్రహాల దృష్టి పడినందువల్ల అనారోగ్య సమస్యలకు సరైన చికిత్స లభిస్తుంది. వైద్య ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లడానికి అవకాశాలు మెరుగుపడ తాయి. ఉద్యోగులు, నిరుద్యోగులు ఎదురు చూస్తున్న విదేశీ ఉద్యోగావకాశాలు తేలికగా అంది వస్తాయి. కోర్టు కేసు ఒకటి అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ముఖ్యమైన ప్రయత్నాలు, వ్యవహారాల్లో ఎటువంటి ఆటంకాలున్నా తొలగిపోతాయి. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది.