Horoscope Today: ఆరోగ్యం విషయంలో ఆ రాశి వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (జూలై 26, 2024): మేష రాశి వారికి మీ దగ్గర బంధువుల నుంచి రావలసిన డబ్బు సమయానికి చేతికి అందుతుంది. వృషభ రాశి వారికి ఇరుగు పొరుగుతో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది జాగ్రత్త. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి, ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
దిన ఫలాలు (జూలై 26, 2024): మేష రాశి వారికి మీ దగ్గర బంధువుల నుంచి రావలసిన డబ్బు సమయానికి చేతికి అందుతుంది. వృషభ రాశి వారికి ఇరుగు పొరుగుతో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది జాగ్రత్త. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి, ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
పిల్లల చదువుల మీద దృష్టి పెడతారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. దగ్గర బంధువుల నుంచి రావలసిన డబ్బు సమయానికి చేతికి అందుతుంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. సమా జంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు ఆశించిన అవకాశాలు అంది వస్తాయి. ప్రయాణాల్లో విలువైన వస్తువులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ముఖ్యమైన పనులను ఆత్మవిశ్వాసరంతో పూర్తి చేస్తారు. ఇరుగు పొరుగుతో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. స్థిరాస్తి వివాదం ఒకటి రాజీమార్గంలో పరిష్కారమవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అంది వస్తాయి. కుటుంబపరంగా కూడా కొద్దిగా టెన్షన్లు ఉండే అవకాశం ఉంది. ఆదాయం అనేక మార్గాల్లో వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
కుటుంబసమేతంగా పుణ్య క్షేత్రానికి వెడతారు. పిల్లల విషయంలో ఊహించని శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి, ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. కొన్ని వ్యవహారాల్లో మానసిక ఒత్తిడి తప్పకపోవచ్చు. ప్రయాణాల వల్ల ఆశించిన లాభాలుంటాయి. స్థిరాస్తి వ్యవహారాలు అతి కష్టం మీద పరిష్కారమవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిపాటి సమస్యలున్నా తెలివితేటలతో అధిగమిస్తారు. కొందరు మిత్రుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
తల్లితండ్రులతో మాట పట్టింపులు తలెత్తుతాయి. ఉద్యోగాల్లో అధికారుల ఆదరణకు, ప్రోత్సాహానికి లోటుండదు. మిత్రులతో భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు, వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఇంటా బయటా ఒత్తిడి పెరుగుతుంది. కొద్దిగా అనారోగ్య సమస్యలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా కొనసాగుతాయి. ఆదా యంలో ఆశించిన పెరుగుదల ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఆర్థిక ప్రయత్నాలన్నీ అనుకూల ఫలితాలనిస్తాయి. బంధుమిత్రుల రాకపోకలు ఆనందం కలిగిస్తాయి. సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా కొనసాగుతాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థ యాత్ర చేస్తారు. ముఖ్యమైన పనులు, వ్యవహారాలను పూర్తి చేయడంలో కొద్దిగా మానసికంగా ఒత్తిడి ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. అధికారులు అతిగా ఉపయోగిం చుకుంటారు. ఇంటా బయటా ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో రాబడి బాగా పెరుగుతుంది. వ్యాపారంలో అనుకూలతలు పెరుగుతాయి. ఉద్యోగులు ఉద్యోగం మారే అవ కాశాలున్నాయి. గత కొద్ది కాలంగా ప్రయత్నం చేస్తున్న పెళ్లి సంబంధం కుదరవచ్చు. నిరుద్యోగు లకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అనేక మార్గాలో ఆదాయం పెరుగుతుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
సమయానికి డబ్బందుతుంది. కొందరు మిత్రులకు ధన సహాయం చేస్తారు. వ్యాపారాలు లాభాల పరంగా బాగా పుంజుకుంటాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాటవాలకు అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ప్రయాణాల్లో విలువైన పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త మంచిది.
వృశ్చికం (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ)
ప్రయత్నాలు, పనులన్నీ మందకొడిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం వల్ల విశ్రాంతి కరువవుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. బంధుమిత్రులతో విభేదాలు పరిష్కారమవుతాయి. అవసరానికి సరిపడా డబ్బందుతుంది. మీకు రావలసిన డబ్బు గురించి గట్టి ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. అదనపు ఆదాయ మార్గాలపై మరింత శ్రద్ధ పెట్టడం మంచిది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కీలకమైన వ్యవహారాలు, పనుల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని లబ్ధి పొందుతారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొను గోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగ జీవి తంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. బంధువుల నుంచి శుభ కార్య ఆహ్వానాలు అందు తాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ఆశించిన శుభవార్తలు వింటారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
అనవసర వస్తువులు, కార్యకలాపాల మీద ధన వ్యయం చేసే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం ఎక్కువగా ఉన్న కారణంగా నిద్రాహారాలు సరిగ్గా ఉండకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి సజా వుగా సాగిపోతుంది. బంధువుల నుంచి విమర్శలు వినడం జరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా కొనసాగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెంపొందుతాయి. సామాజి కంగా మంచి గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆశించిన శుభవార్తలు వింటారు.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రుల నుంచి విలువైన బహుమతులు అందుకుంటారు. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఇష్టమైన బంధువులతో ఒక శుభ కార్యంలో పాల్గొంటారు. పిల్లల చదువులు సంతృప్తికరంగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది కానీ, దాంతో సమానంగా ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. స్థాన చలనానికి అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బంది పడతారు. ఇంటా బయటా అప్రమ త్తంగా వ్యవహరించాలి. ఊహించని విధంగా ఖర్చులు పెరుగుతాయి. వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల సమాచారం అందుకుంటారు.