Lord Shani Dev: బుధ గ్రహంతో శని వీక్షణ.. ఆ రాశుల వారికి ఆర్థిక, ఉద్యోగ సమస్యల నుంచి విముక్తి
శని, బుధ గ్రహాలు యుతి చెందినా, పరస్పరం వీక్షించుకున్నా ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకోగల తెలివితేటలు అభివృద్ధి చెందుతాయని, అందుకు తగ్గ స్తోమత కూడా ఏర్పడుతుందని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ఈ నెల 5వ తేదీ నుంచి 23 వరకు సింహ రాశిలో సంచరించే బుధ గ్రహంతో కుంభ రాశిలో ఉన్న శనికి వీక్షణ ఏర్పడుతుంది.
శని, బుధ గ్రహాలు యుతి చెందినా, పరస్పరం వీక్షించుకున్నా ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకోగల తెలివితేటలు అభివృద్ధి చెందుతాయని, అందుకు తగ్గ స్తోమత కూడా ఏర్పడుతుందని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ఈ నెల 5వ తేదీ నుంచి 23 వరకు సింహ రాశిలో సంచరించే బుధ గ్రహంతో కుంభ రాశిలో ఉన్న శనికి వీక్షణ ఏర్పడుతుంది. దీనివల్ల మేషం, వృషభం, కర్కాటకం, సింహం, తుల, ధనూ రాశివారికి ఆర్థిక, వ్యక్తిగత, ఉద్యోగ సమస్యల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది.
- మేషం: ఈ రాశికి పంచమ స్థానంలో ఉన్న బుధుడితో లాభస్థానంలో ఉన్న శనీశ్వరుడికి పరస్పర వీక్షణ ఏర్పడినందువల్ల ప్రతిభా పాటవాలు, నైపుణ్యాలు బాగా వృద్ధిలోకి వస్తాయి. ఉద్యోగంలో మంచి గుర్తింపు ఏర్పడి, పదోన్నతులకు అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉన్నందువల్ల ఆర్థిక సమస్యలు, కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆస్తి వివాదం అప్రయత్నంగా సమసిపోతుంది.
- వృషభం: ఈ రాశికి నాలుగవ స్థానంలో ఉన్న బుధుడు, దశమ స్థానంలో ఉన్న శని ఒకరినొకరు చూసుకో వడం వల్ల ఉద్యోగంలో స్తబ్ధత, ప్రతిష్ఠంభన వంటివి తొలగిపోయి, క్రమంగా ప్రాధాన్యం పెరుగు తుంది. వృత్తి, వ్యాపారాలు కూడా సరికొత్త యాక్టివిటీతో ఊపందుకుంటాయి. ఒకటి రెండు ముఖ్య మైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం బాగా వృద్ధి చెంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.
- కర్కాటకం: శని, బుధుల పరస్పర వీక్షణ వల్ల ఈ రాశివారికి అష్టమ శని ప్రభావం దాదాపు పూర్తిగా తగ్గిపో తుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులన్నీ నిరాటంకంగా, జాప్యం లేకుండా పూర్తి కావడం వల్ల ఆర్థికంగా లాభాలు కలుగుతాయి. ఆదాయ ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. ఉద్యోగంలో హోదాతో పాటు వేతనాల కూడా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక లావాదేవీలు, కార్యకలా పాలు జోరందుకుంటాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
- సింహం: ఈ రాశిలో ఉన్న బుధుడితో శనికి వీక్షణ ఏర్పడినందువల్ల ఈ రాశివారికి రాజయోగం పడు తుంది. ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా చాలావరకు పరి ష్కారమవుతాయి. ఇంటా బయటా ప్రాధాన్యం పెరుగుతుంది. ఏ సమస్యనైనా స్వప్రయత్నంతో పరిష్కరించుకోగలుగుతారు. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప మార్పులతో అత్యధిక లాభాలు పొందు తారు. ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం పడుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి.
- తుల: ఈ రాశివారికి లాభ స్థానంలో ఉన్న బుధుడికి, పంచమ స్థానంలో ఉన్న శనికి వీక్షణ ఏర్పడి నందువల్ల సరికొత్త ఆలోచనలతో వృత్తి, వ్యాపారాలను లాభాల బాట పట్టించడం జరుగుతుంది. వ్యక్తిగత సమస్యలను పట్టుదలగా పరిష్కరించుకుంటారు. అదనపు ఆదాయ ప్రయత్నాలతో ఆర్థిక సమస్యలను చాలావరకు పరిష్కరించుకుంటారు. ఉద్యోగంలో తమ ప్రతిభా పాటవాలను, సమర్థతను నిరూపించుకుంటారు. ఉద్యోగంలో హోదాలతో పాటు వేతనాలు పెరిగే అవకాశం ఉంది.
- ధనుస్సు: బుధ, శనుల పరస్పర వీక్షణ వల్ల ఈ రాశివారికి ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి ఆస్కారముంది. ఆదాయ ప్రయ త్నాలు విజయవంతం కావడం వల్ల ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. ఆర్థిక సమస్యల ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడి, లాభాల బాటపడతాయి. నిరుద్యోగుల కల సాకారం అవుతుంది.