Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (సెప్టెంబర్ 1, 2024): మేష రాశి వారు ఈ రోజు ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వారు ముఖ్యమైన వ్యవహారాల్లో విజయాలకు అవకాశం ఉంది. మిథున రాశి వారికి కొద్దిగా అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి దినఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Horoscope Today 01st September 2024
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 01, 2024 | 6:00 AM

దిన ఫలాలు (సెప్టెంబర్ 1, 2024): మేష రాశి వారు ఈ రోజు ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వారు ముఖ్యమైన వ్యవహారాల్లో విజయాలకు అవకాశం ఉంది. మిథున రాశి వారికి కొద్దిగా అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి దినఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో కాస్తంత అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది. ఉద్యోగరీత్యా ప్రయాణాలకు అవకాశం ఉంది. ఆధ్యాత్మిక విష యాల మీద శ్రద్ధాసక్తులు పెరుగుతాయి. కొందరు బంధువులతో వివాదాలు తలెత్తుతాయి. వ్యాపా రులు ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా సాగిపోతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని సరదాగా కాలక్షేపం చేస్తారు. నిరుద్యోగులకు విదేశాల నుంచి కీలక సమాచారం అందుతుంది. కొద్ది శ్రమతో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయాలకు అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతి సూచనలున్నాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

కొద్దిగా అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా, ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. కుటుంబ వాతావరణం ఆనం దంగా ఉంటుంది. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు సిద్దిస్తాయి. ఉద్యోగంలో సరైన నిర్ణ యాలు తీసుకుని మంచి ఫలితాలు పొందుతారు. పిల్లల విషయంలో శుభవార్త వింటారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

బంధువుల రాకతో కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. వ్యాపారాల్లో సరైన లాభాలు అందుతాయి. అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆస్తి వివా దంలో ఆటంకాలు తొలగుతాయి. వాహన యోగం పడుతుంది. ఉద్యోగులకు పని భారం నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. రావలసిన సొమ్ము కొద్ది ప్రయ త్నంతో చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల రీత్యా ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. బంధువులతో మాట పట్టింపులుం టాయి. ఆరోగ్యపరంగా వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల ఆశించిన ప్రయోజనాలుంటాయి. వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఉద్యోగులకు అద నపు బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త అవకా శాలు అంది వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండడం అవసరం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపారాలు కూడా కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో నిరుద్యోగులు విజయాలు సాధిస్తారు. లాభదా యక పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరిగినప్పటికీ, వాటిని సమర్థవం తంగా నిర్వర్తిస్తారు. ఇష్టమైన బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. చేపట్టిన వ్యవహారాల్లో తప్పకుండా విజయం సాధిస్తారు. ఆదాయానికి లోటుండదు. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వ్యాపారులకు విశేషమైన లాభాలు అందుతాయి. ఇల్లు కొనే ప్రయత్నం చేస్తారు. కుటుంబంతో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. ముఖ్యమైన పనులను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. అనుకోకుండా ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవు తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట )

ప్రయాణాల వల్ల ఇబ్బందులు పడతారు. కుటుంబ సభ్యుల మీద ఖర్చు పెరుగుతుంది. వ్యాపా రాల్లో స్వల్ప లాభాలకు అవకాశం ఉంది. బంధుమిత్రుల విషయాల్లో తలదూర్చకపోవడం మంచిది. ఉద్యోగ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక వాతావరణంలో మెరుగుదల కని పిస్తుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలకు లోటుండదు. ముఖ్యమైన వ్యవహారాలను నెమ్మ దిగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యం పరవాలేదని పిస్తుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

అనారోగ్య సమస్యల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగు తాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. అవసరానికి మించి చేతిలో డబ్బు ఉండే అవకాశం ఉంది. ఉద్యోగులకు సహోద్యోగులతో మాట పట్టింపులుంటాయి. వృత్తి జీవి తంలో కొత్త గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. కుటుంబ వాతావరణం చాలా వరకు ప్రశాంతంగా ఉంటుంది. దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. చేపట్టిన పనుల్లో కార్యసిద్ది కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడు తుంది. మంచి పరిచయాలు కలగడానికి అవకాశం ఉంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. పిల్లల చదువులకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. వ్యాపారాల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు చేపడతారు. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారులు మీ సలహాలు, సూచ నలకు విలువనిస్తారు. అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. బంధువుల వివాదాల్లో జోక్యం చేసుకోకపోవడం శ్రేయ స్కరం. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. అనుకోకుండా ఆదాయం వృద్ధి చెందు తుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

కొద్ది ప్రయత్నంతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలని స్తాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు, చేపట్టే ప్రయత్నాల వల్ల అత్యధికంగా ప్రయోజనం పొందుతారు. వృత్తి, ఉద్యోగాలలో హోదాలు పెరగడానికి అవకాశం ఉంది. వ్యాపారాల్లో కూడా ఆర్థిక లాభాలకు బాగా అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ పెద్దల సలహాలు తీసు కోవడం మంచిది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు.

హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్