Telugu Astrology: దుస్థానాల్లో గురువు.. అయినా ఆ రాశుల వారికి శుభ యోగమే!
ఈ నెల (అక్టోబర్) 19 నుంచి డిసెంబర్ 5 వరకు గురువు కర్కాటక రాశిలో ఉచ్ఛపట్టడం జరుగుతోంది. గురువు ఉచ్ఛ స్థితి వల్ల కొన్ని రాశులకు మహా యోగాలు పట్టడం నిజమే కానీ, ఆ గురువు దుస్థానాల్లో ఉన్నప్పటికీ ఏదో విధంగా లాభం కలిగిస్తాడని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. వృషభానికి తృతీయంలోనూ, సింహ రాశికి వ్యయ స్థానంలోనూ, ధనూ రాశివారికి అష్టమ స్థానంలోనూ, కుంభ రాశికి షష్ట స్థానంలోనూ గురువు సంచారం చేస్తున్నప్పటికీ కొన్ని విషయాల్లో తప్పకుండా శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది.

Jupiter Shubh Yogas

- వృషభం: ఈ రాశికి తృతీయ స్థానంలో గురువు సంచారం చేయడం ఏమంత మంచిది కాదు. పైగా తృతీయ స్థానంలో గురువు అత్యంత బలహీనుడు. అయితే, తృతీయంలో గురువు ఉచ్ఛపట్టడం వల్ల విదేశాల్లో ఉద్యోగం సంపాదించడం, విదేశాల్లో స్థిరపడడం, విదేశీ సంపాదనను అనుభవించడం వంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకోకుండా విద్య, ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా తరచూ విదేశాలకు వెళ్లి రావడం కూడా జరిగే అవకాశం ఉంది.
- సింహం: ఈ రాశికి వ్యయ స్థానంలో గురువు ఉచ్ఛపట్టడం వల్ల మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి ఎక్కువ అవకాశం ఉంది. పదోన్నతి కోసమో, జీతభత్యాలు పెరగడం కోసమో ఉద్యోగం మారడం జరుగుతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది. విహార యాత్రలు, తీర్థ యాత్రలు ఎక్కువగా చేయడం జరుగుతుంది. మొక్కుబడులు చెల్లించుకోవడం మంచిది. శుభ కార్యాల మీద భారీగా వ్యయం అవుతుంది. ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతుంది.
- ధనుస్సు: రాశ్యధిపతి గురువు అష్టమ స్థానంలో ఉచ్ఛపట్టడం వల్ల ఈ రాశివారికి అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందడం, ఆకస్మిక ధన లాభం కలగడం వంటివి జరిగే అవకాశం ఉంది కానీ, ధన నష్టం, వృథా ఖర్చులు కూడా బాగా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి కుదిరే అవకాశం ఉంది. వ్యక్తిగత జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది.
- కుంభం: ఈ రాశికి ధన, లాభ స్థానాధిపతి అయిన గురువు ఆరవ స్థానంలో ఉచ్ఛపట్టడం వల్ల కష్టార్జితంలో ఎక్కువ భాగం శత్రు, రోగ, రుణ సమస్యల మీద ఖర్చవుతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోలేరు కానీ, ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థికంగా బాగా ఒత్తిడి ఉంటుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. సొంత ఇల్లు అమరే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండడం శ్రేయస్కరం.