- Telugu News Photo Gallery Spiritual photos Telugu Astrology: These Zodiac Signs to Gain Power, Promotions and Leadership Details in Telugu
Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!
Adhikara Yoga: కొన్ని రాశుల వారు సహజసిద్ధంగా అధికార దాహం కలిగి ఉంటారు. ఏ స్థాయిలో ఉన్నా అధికారం చెలాయించగలుగుతారు. ప్రస్తుతం కుజ, రవి, రాహు, గురు గ్రహాల అనుకూలత వల్ల ఈ రాశులవారి కలలు సాకారం అయి అధికారం చెలాయించే యోగం పడుతుంది. డిసెంబర్ 5వ తేదీ లోగా వీరికి అధికార యోగం పట్టే అవకాశం ఉంది. మేషం, మిథునం, సింహం, తుల, వృశ్చికం, ధనూ రాశుల వారు ఏ రంగంలో ఉన్న పదోన్నతులు, అధికార యోగాలు కలిగే అవకాశం ఉంది. వారికి సంబంధించిన సంస్థలో సర్వాధికారి అయ్యే అవకాశం ఉంది.
Updated on: Oct 13, 2025 | 7:02 PM

మేషం: అధికార కారకుడైన రవి, కుజులు ఈ రాశికి సప్తమంలోనూ, గురువు తృతీయంలోనూ సంచారం చేస్తున్నందువల్ల వీరికి తప్పకుండా అధికార యోగం పడుతుంది. నాయకత్వ స్థానంలో ఉండాలన్న వీరి కోరిక, కల, ఆశయం నెరవేరడం జరుగుతుంది. ఉన్నతాధికారుల వీరి సమర్థతను గుర్తించి అధికార బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. సామాజికంగా, ఇంటా బయటా కూడా వీరి మాట చెల్లుబాటవుతుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది.

మిథునం: ఏ రంగంలో ఉన్నా ఉన్నత స్థానాలను అధిరోహించడమే లక్ష్యంగా పెట్టుకునే ఈ రాశివారికి కుజ, రవి, గురు గ్రహాలు బాగా అనుకూలంగా మారడం వల్ల త్వరలో వీరి ఆశయం నెరవేరే అవకాశం ఉంది. ఉద్యోగంలో వీరి శక్తిసామర్థ్యాలకు, అందరినీ కలుపుకునిపోయే తత్వానికి గుర్తింపు లభించడంతో పాటు పదోన్నతులు లభించే అవకాశం ఉంది. సీనియర్లను కాదని ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. బాధ్యతలతో పాటు జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది.

సింహం: ఈ రాశికి గురువు, కుజుడితో పాటు రాశ్యధిపతి రవి కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అతి త్వరలో ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. వీరి శక్తి సామర్థ్యాలు, నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలను అధికారులు గుర్తించి అనేక విధాలుగా ప్రోత్సహించడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఏ స్థానంలో ఉన్నప్పటికీ, సీనియర్ల మీదా, అధికారుల మీదా పెత్తనం చెలాయించే సూచనలున్నాయి. జీతభత్యాలు భారీగా పెరిగే అవకాశం ఉంది.

తుల: అధికార స్థానంలో కూర్చోవాలన్న ఈ రాశివారి చిరకాల వాంఛ త్వరలో తప్పకుండా నెరవేరుతుంది. భాగ్య స్థానంలో గురువు, తులా రాశిలో రవి, కుజుల యుతి వంటి కారణాల వల్ల వీరు తమ సత్తాను నిరూపించుకుని ఉన్నత స్థానాలకు వెళ్లడం జరుగుతుంది. అక్టోబర్ 19 నుంచి డిసెంబర్ 5 లోగా వీరికి ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగంలో ఉన్నత పదవి లభించే అవకాశం ఉంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి కూడా అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.

వృశ్చికం: ఒకరి కింద పని చేయడం ఏమాత్రం ఇష్టం లేని ఈ రాశివారి కోరిక త్వరలో నెరవేరుతుంది. అధికారులను లేదా యాజమాన్యాన్ని తమ పనితీరుతో, సామర్థ్యంతో మెప్పించి ఉన్నత పదవులు పొందడం తప్పకుండా జరుగుతుంది. ఉన్నత వర్గాలతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. సంపన్నులతో పరిచయాలు పెరుగుతాయి. జీవనశైలి పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. సొంతంగా ఒక సంస్థను ప్రారంభించేందుకు ప్రయత్నాలు సాగిస్తారు. ఆదాయం బాగా పెరుగుతుంది.

ధనుస్సు: ఈ రాశివారిలో ఉన్నత ఆశయాలు, యాంబిషన్ కాస్తంత ఎక్కువగా ఉంటాయి. పైగా రాశి అధిపతి గురువు ఈ రాశిని సప్తమ స్థానం నుంచి వీక్షించడం వల్ల ఈ ఆశయాలు మరింత వృద్ధి చెందుతాయి. ఉన్నత స్థానాల కోసం, పదోన్నతుల కోసం వీరు ఉద్యోగం మారే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులు విదేశాల్లో ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.



