- Telugu News Photo Gallery Spiritual photos Sun transit in libra 17 October: these 5 zodiac signs luck will shine like gold
Sun Transit: దీపావళి కంటే ముందే తుల రాశిలో సూర్యుడు అడుగు.. ఈ ఐదు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..
నవ గ్రహాలకు సూర్యుడు అధినేత. ప్రత్యక్ష దైవంగా పూజలను అందుకునే సూర్యుడు ప్రతి నెల తన రాశిని మార్చుకుంటాడు. దీనిని సంక్రమణం అంటారు. ఇలా సూర్యుడు రాశిని మార్చుకునే సమయంలో మొత్తం 12 రాశుల వారు ప్రభావితం అవుతారు. త్వరలో సూర్యుడు తులా రాశిలోకి అడుగు పెట్టనున్నాడు. దీంతో ఐదు రాశుల వారి అదృష్టం బంగారంలా ప్రకాశిస్తుంది. ఈ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
Updated on: Oct 13, 2025 | 5:46 PM

జ్యోతిషశాస్త్రంలో సూర్యుడిని గ్రహాల రాజు అని పిలుస్తారు. అన్ని గ్రహాల మాదిరిగానే సూర్యుడు కూడా నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. సూర్యుడు కదిలే రాశి పేరుతో సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. సూర్యుడు ప్రస్తుతం కన్యారాశిలో ఉన్నాడు. అక్టోబర్ 17న సూర్యుడు తన రాశిని మార్చుకోనున్నాడు. అప్పుడు సూర్యుడు కన్యారాశి నుంచి తులారాశిలోకి వెళ్తాడు. తులారాశి సంక్రాంతి పండుగ కూడా అక్టోబర్ 17న జరుపుకుంటారు.

దృక్ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం అక్టోబర్ 17, 2025న మధ్యాహ్నం 1:55 గంటలకు సూర్యుడు తులారాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుని రాశి మార్పు 12 రాశులపైనా ప్రభావం చూపుతుంది. ఇది మాత్రమే కాదు మొత్తం దేశం, ప్రపంచం కూడా సూర్యుని రాశి మార్పు ద్వారా ప్రభావితమవుతుంది. అయితే సూర్యుడు తులారాశిలోకి వచ్చిన తర్వాత ఐదు రాశులకు చెందిన వారి అదృష్టం బంగారంలా ప్రకాశిస్తుంది. ఈ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.

తులా రాశి: సూర్యుడు తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కనుక ఈ రాశిలో జన్మించిన వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన ప్రాజెక్టులు ఊపందుకుంటాయి. వ్యాపారవేత్తలు కొత్త వ్యాపార ప్రణాళికలను అభివృద్ధి చేసి వాటిని అమలు చేయవచ్చు.

కన్య రాశి: సూర్యుని రాశి మార్పు తర్వాత కన్య రాశి వారికి కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. భాగస్వామ్యంలో పనిచేసే వారు గణనీయమైన లాభాలను పొందే అవకాశం ఉంది. ఇంట్లో సౌకర్యాలు పెరిగే అవకాశం ఉంది. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది.

సింహ రాశి: సింహ రాశి వారికి అధిపతి సూర్యుడు. సూర్యుని రాశి మార్పు తరువాత సింహ రాశి వారికి సమాజంలో గౌరవం లభించే అవకాశం ఉంది. సామాజిక స్థితిని బలోపేతం చేసుకుంటారు. వృత్తిలో నాయకత్వాన్ని పొందే అవకాశం కూడా ఉంది.

వృషభ రాశి: సూర్యుని రాశి మార్పు తో వృషభ రాశికి చెందిన వ్యక్తులు ఆర్థిక లాభాలను పొందే అవకాశం ఉంది. కొత్త ఆదాయ వనరులు ఉద్భవించవచ్చు. బోనస్‌లు, ప్రమోషన్‌లు లేదా జీతం పెంపుదల లభించవచ్చు. వ్యాపారవేత్తలు తమ పెట్టుబడుల నుంచి మంచి రాబడిని పొందవచ్చు.

కుంభ రాశి: సూర్యుడు సంచారము చేసిన తరువాత కుంభ రాశి వారికి కెరీర్ పురోగతి ఏర్పడుతుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. బదిలీ లేదా పదోన్నతి కలిగే అవకాశం ఉంది. ఉద్యోగ మారలనుకుని ప్రయత్నం చేస్తున్నవారికి ఇది మంచి సమయం కావచ్చు.




