Financial Boom: ఉచ్చ స్థితిలోకి గురువు.. ఈ రాశుల వారికి సిరిసంపదలు ఖాయం..!
Jupiter Exalted Impact: గురువు అక్టోబర్ 19 నుండి డిసెంబర్ 5 వరకు కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలోకి వస్తున్నాడు. ఈ కాలంలో వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మీన రాశులకు విశేష ధన లాభం, ఆర్థిక సమస్యల పరిష్కారం, కుటుంబ సంతోషం కలగనుంది. ఆదాయ వృద్ధి, శుభ కార్యాలు, విదేశీ అవకాశాలు, అన్నింటా విజయం సాధించి అదృష్టాన్ని పొందుతారు.

Financial Boom Zodiacs
గురువు ఉచ్ఛ స్థితిలోకి వచ్చే పక్షంలో కొన్ని రాశులకు పండగే పండగ. చాలా కాలంగా అనుభవిస్తున్న కష్టనష్టాలకు తెరపడి వీరికి ఎంతో ఊరట లభిస్తుంది. గురువు ఈ నెల (అక్టోబర్) 19 నుంచి కర్కాటక రాశిలో ఉచ్ఛలోకి రావడం జరుగుతోంది. డిసెంబర్ 5వ తేదీ వరకు గురువుకు ఈ ఉచ్ఛ స్థితి కొనసాగుతుంది. గురువు ఉచ్ఛలో ఉన్నంత కాలం వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మీన రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభించడంతో పాటు అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. ధన, పుత్ర, గృహ, కుటుంబ కారకుడైన గురువు ఈ రాశులకు అనేక మార్గాల్లో సుఖ సంతోషాలు, సిరిసంపదలను అనుగ్రహించడం జరుగుతుంది.
- వృషభం: ఈ రాశికి లాభాధిపతి అయిన గురువు తృతీయ స్థానంలో ఉచ్ఛపట్టడం వల్ల ఈ రాశివారు ఆదాయ వృద్ధికి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి, షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల ద్వారా సంపద వృద్ధి చెందడానికి బాగా అవకాశం ఉంది. రావలసిన డబ్బుతో పాటు, మొండి బాకీలు, బకాయిలు, రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కూడా చేతికి అందుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది.
- మిథునం: ఈ రాశికి ధన స్థానంలో గురువు ఉచ్ఛపట్టడం వల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందే అవకాశం ఉంది. కుటుంబం వృద్ధిలోకి వస్తుంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఇంట్లో గృహ ప్రవేశం, పెళ్లి వంటి శుభ కార్యాలు జరుగుతాయి. మీ సలహాలు, సూచనలతో అధికారులే కాక, బంధుమిత్రులు కూడా లబ్ధి పొందుతారు. సంతానం ప్రాప్తికి బాగా అవకాశం ఉంది.
- కన్య: ఈ రాశికి లాభ స్థానంలో గురువు ఉచ్ఛపడుతున్నందువల్ల మనసులోని కోరికలు నెరవేరుతాయి. గృహ లాభం కలుగుతుంది. ఆస్తిపాస్తుల వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. సంతాన యోగం కలుగుతుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి.
- వృశ్చికం: ఈ రాశికి ధనాధిపతి అయిన గురువు భాగ్య స్థానంలో ఉచ్ఛపట్టడం వల్ల విదేశీయానానికి ఆటంకాలు తొలగిపోతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. విదేశీ సంపాదనను అనుభవించే యోగం కలుగుతుంది. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. అత్యంత ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. రాజపూజ్యాలు కలుగుతాయి. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు విశేషంగా లాభిస్తాయి.
- మీనం: రాశ్యధిపతి గురువు పంచమ స్థానంలో ఉచ్ఛస్థితికి రావడం వల్ల ఈ రాశివారికి డిసెంబర్ 5 వరకూ ఏలిన్నాటి దోషం వర్తించకపోవచ్చు. మనసులోని కోరికల్లో చాలా భాగం నెరవేరుతాయి. సొంత ఇంటి కల, విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న ఆశయం తప్పకుండా సాకారం అవుతాయి. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తికి చేతికి అందుతుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది.
ఇవి కూడా చదవండి







