AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Astrology: బుధ గ్రహ ప్రభావం.. వృత్తి, వ్యాపారాల్లో ఈ రాశులకు తిరుగే ఉండదు!

జ్యోతిషశాస్త్రం ప్రకారం బుధ గ్రహం మదుపులు, పెట్టుబడులు, బ్యాంకులు, వ్యాపారాలు, షేర్లు, స్పెక్యులేషన్లకు కారకుడు. ఈ నెల(అక్టోబర్) 24 వరకు ఈ బుధ గ్రహం తన మిత్ర క్షేత్రమైన తులా రాశిలో, రవి, కుజులతో కలిసి సంచారం చేస్తున్నందువల్ల కొన్ని రాశులవారు అదనపు ఆదాయాన్ని సంపాదించుకోవడానికి అవకాశాలు కలిగాయి. వృత్తి, వ్యాపారాలతో పాటు షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీల ద్వారా అత్యధికంగా సంపాదించుకోవడానికి తులా బుధుడు మిథునం, కర్కాటకం, కన్య, తుల, ధనుస్సు, మకర రాశులకు అవకాశం కల్పించే అవకాశం ఉంది.

TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Oct 15, 2025 | 3:05 PM

Share
మిథునం: ఈ రాశికి పంచమ స్థానంలో రాశ్యధిపతి బుధుడి సంచారం వల్ల ఈ రాశివారు వృత్తి, వ్యాపారాల్లో కొత్త పుంతలు తొక్కుతారు. ఎటువంటి పెట్టుబడి పెట్టినా, ఎంత పెట్టుబడి పెట్టినా బాగా  కలిసి వచ్చే అవకాశం ఉంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగులు షేర్లు, స్టాకులు కొనడం వల్ల తప్పకుండా అంచనాలను మించిన లాభాలు పొందు తారు. భూములు, ఆస్తులు, బంగారం మీద పెట్టుబడులు పెట్టడం వల్ల ధన లాభాలు కలుగుతాయి.

1 / 6
కర్కాటకం: ఈ రాశికి చతుర్థ స్థానంలో బుధుడి సంచారం వల్ల పొలాలు, స్థలాలు, ఆస్తులు, ఇళ్ల మీద పెట్టుబడులు పెట్టడానికి సమయం అనుకూలంగా ఉంది. మదుపులు, పెట్టుబడులు అత్యధికంగా లాభిస్తాయి. వడ్డీ వ్యాపారాలు, పందాలు కూడా లాభాల వర్షం కురిపిస్తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. అతి తక్కువ పెట్టుబడితో అత్యధిక లాభాలు పొందడం జరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. వృత్తి జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది.

2 / 6
కన్య: ఈ రాశిలో ధన స్థానంలో రాశ్యధిపతి బుధుడి సంచారం వల్ల ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎటువంటి పెట్టుబడి పెట్టినా, ఏ విధంగా మదుపు చేసినా వీరికి లాభాల పంట పండుతుంది. భాగస్వామ్య వ్యాపారాల వల్ల కూడా బాగా కలిసి వస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల అంచనాలకు మించిన ధన లాభాలు కలుగుతాయి. కొద్ది ప్రయత్నంతో అదనపు ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. స్థిరాస్తుల మీద పెట్టుబడులు పెట్టడం కూడా చాలా మంచిది.

3 / 6
తుల: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన బుధుడు ఇదే రాశిలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి లాభాలు, రాబడి పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. మదుపులు, పెట్టుబడులు వంద శాతం లాభాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఆదాయం పెరగడంతో పాటు, అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల కూడా అత్యధికంగా లాభాలు పొందుతారు. షేర్లు, స్పెక్యులేషన్లు, లాటరీలు, వడ్డీ వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీల మీద పెట్టుబడులు పెట్టడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది.

4 / 6
ధనుస్సు: ఈ రాశికి లాభ స్థానంలో బుధ సంచారం వల్ల ఈ రాశివారు అతి తక్కువ శ్రమతో అత్యధికంగా లాభాలు పొందుతారు. అతి తక్కువ కాలంలో ఐశ్వర్యవంతులయ్యే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధికి సమయం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం మంచిది. అదనపు ఆదాయం ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఎటువంటి వ్యాపారం తలపెట్టినా కలిసి వస్తుంది. ఆస్తిపాస్తులు బాగా కలిసి వస్తాయి.

5 / 6
మకరం: ఈ రాశికి దశమ స్థానంలో బుధ సంచారం వల్ల ఆస్తిపాస్తుల మీదా, రియల్ ఎస్టేట్ మీదా పెట్టు బడులు పెట్టడం వల్ల అపార ధన లాభం కలుగుతుంది. ఇతరులతో కలిసి వ్యాపారాలు చేయడం వల్ల లాభాలు కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, బంగారం, భూమి, లాటరీల మీద పెట్టుబడులు పెట్టి ఊహించని లాభాలు పొందే అవకాశం ఉంది. అదనపు ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉన్నందువల్ల ఈ సమయాన్ని వీలైనంతగా సద్వినియోగం చేసుకోవడం మంచిది.

6 / 6