AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashi Phalalu: ఆ రాశి నిరుద్యోగులకు మంచి ఆఫర్.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today (November 26, 2025): మేష రాశికి చెందిన ఉద్యోగులు మంచి ఉద్యోగానికి మారే అవకాశం ఉంది. వృత్తి నిపుణులకు డిమాండ్ పెరుగుతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో పని ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. గౌరవాభిమానాలు పెరుగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Rashi Phalalu: ఆ రాశి నిరుద్యోగులకు మంచి ఆఫర్.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Rashi Phalalu 26 November 2025
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 26, 2025 | 5:31 AM

Share

దిన ఫలాలు (నవంబర్ 26, 2025): మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఉద్యోగులు మంచి ఉద్యోగానికి మారే అవకాశం ఉంది. వృత్తి నిపుణులకు డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారంలో తప్పకుండా అభివృద్ధి కనిపిస్తుంది. ఆదాయానికి లోటుండదు. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది చాలా వరకు అనుకూలమైన సమయం. జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం శ్రేయస్కరం.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ మంచి ప్రతి ఫలం ఉంటుంది. సహచరులకు సహాయ సహకారాలు అందిస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక విషయాల్లో చాలా వరకు అనుకూల వాతావరణం ఉంటుంది. తోబుట్టువులతో వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఆదాయం బాగానే వృద్ది చెందుతుంది. ఇరుగు పొరుగుతో వివాదాలు తలెత్తే సూచనలున్నాయి. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఉద్యోగంలో పని ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. గౌరవాభిమానాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. నిరుద్యోగులు తప్పకుండా శుభవార్త వింటారు. ఆదాయానికి లోటుండకపోవచ్చు. ప్రయాణాల వల్ల ఆశించిన లాభాలు కలుగుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆరోగ్యం జాగ్రత్త.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఉద్యోగంలో అధికారులతో సామరస్యం ఏర్పడుతుంది. ఆశించిన పురోగతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా పుంజుకోవడం జరుగుతుంది. ప్రయత్న లోపం లేకుండా ముఖ్యమైన వ్యవహారాల్ని పూర్తి చేయడం మంచిది. ఉద్యోగ ప్రయత్నం సఫలం అవుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఇబ్బంది కలిగిస్తాయి. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో అపార్థాలు తొలగిపోయి, అన్యోన్యత పెరుగుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఉద్యోగంలో బాధ్యతల నిర్వహణలో జాగ్రత్తగా ఉండడం మంచిది. కొన్ని పొరపాట్లు చోటు చేసుకోవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంది. చేపట్టిన పనులు, వ్యవహారాలు నత్తనడక నడుస్తాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. కొందరు బంధువులతో స్వల్ప విభేదాలకు అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాలలో సానుకూలతలు పెరుగుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారుల్ని ఆకట్టుకుంటారు. వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది. కొత్త పెట్టుబడులకు అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతుంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ఆర్థిక వాతావరణం బాగా అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. ఉద్యోగంలో మంచి ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. ఆర్థికంగా బాగా అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో ఆర్థిక పురోగతి సాధిస్తారు. చేపట్టిన పనులు సకా లంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో హ్యాపీగా కాలక్షేపం చేస్తారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. పిల్లల పురోగతి విషయంలో శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఉద్యోగంలో సహోద్యోగుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయ. వ్యాపారాలు నిదానంగా పురోగమిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబ సభ్యులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇతరుల వ్యక్తిగత విషయాల్లో తలదూర్చవద్దు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. లాభాలు బాగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన పనుల్లో అవరోధాలు ఎదురైనప్పటికీ, పట్టుదలగా వాటిని పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక విషయాల మీద దృష్టి పెడతారు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): వృత్తి, ఉద్యోగాల్లో బాగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. అధికారులు ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. వ్యాపారాల మీద మరింత శ్రద్ధపెట్టడం అవసరం. ముఖ్యమైన వ్యవహారాల్లో సన్నిహితుల సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మి ఆర్థిక బాధ్యతలు అప్పగించవద్దు. వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం కూడా మంచిది కాదు. ఆరోగ్యం చాలావరకు నిలకడగా ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఉద్యోగం ఉత్సాహంగా, సామరస్యంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు ఊపందుకుంటాయి. రావాల్సిన బాకీలు, బకాయిలు క్షేమంగా చేతికి అందుతాయి. చాలావరకు అవసరాలు తీరిపోతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలపై శ్రద్ధ పెట్టడం మంచిది. మిత్రులతో మాట పట్టింపులు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఇతరులకు ఆర్థిక సహాయం చేయడంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. జీవిత భాగస్వామితో వాదోపవాదాలకు దిగ వద్దు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ విస్తరిస్తుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ధన లాభం పొందుతారు. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐ.టి నిపుణుల వంటి వృత్తుల వారు బాగా పురోగతి చెందుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. ఆర్థిక ప్రయత్నాల వల్ల ప్రయోజనం పొందుతారు. ఆశించిన శుభవార్తలు వింటారు.

Follow Us