Horoscope Today: ఈరోజు వీరు అపకీర్తి రాకుండా జాగ్రత్త పడాలి.. ధనలాభం ఉంటుంది.. బుధవారం రాశి ఫలాలు..

వీరు ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.. అనారోగ్య సమస్యలు.. ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది. ఆవేశంలో తీసుకునే నిర్ణయాల

Horoscope Today: ఈరోజు వీరు అపకీర్తి రాకుండా జాగ్రత్త పడాలి.. ధనలాభం ఉంటుంది.. బుధవారం రాశి ఫలాలు..
Horoscope 2022
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 16, 2022 | 7:36 AM

మేష రాశి.. వీరు ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.. అనారోగ్య సమస్యలు.. ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది. ఆవేశంలో తీసుకునే నిర్ణయాల వలన చేపట్టిన పనులు ఆగిపోతాయి.. బంధుమిత్రులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది.

వృషభ రాశి.. వీరికి ఈరోజు మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. చేపట్టిన పనులు ఆగిపోతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగాలు.. వ్యాపారంలో అభివృద్ది ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదల విషయంలో జాగ్రత్తలు అవసరం.

మిథున రాశి.. వీరికి ఖర్చులు పెరుగుతాయి. దీంతో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. నూతన వస్తువులు.. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. కొత్తవారితో పరిచయం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు.

కర్కాటక రాశి.. ఈరోజు వీరికి మానసిక ఆందోళన పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఖర్చులు పెరుగుతాయి. పనులు ప్రారంభించే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కోపం వలన అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

సింహ రాశి.. వీరు ఈరోజు ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటారు. నూతన పనులు మొదలుపెడతారు. కుటుంబంలో విబేధాలు తొలగిపోతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రుల సాయం తీసుకుంటారు.

కన్య రాశి.. రుణ ప్రయాత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంల మనశ్శాంతి లోపిస్తుంది. స్నేహితులతో విరోధం ఏర్పడుతుంది.. మానసిక ఆందోళన పెరుగుతుంది. చేపట్టిన పనులు ఆగిపోతాయి.

తుల రాశి.. రుణ బాధలు తొలగిపోతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు.. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ పరిస్థితులు కూడా సంతృప్తికరంగా ఉంటాయి.

వృశ్చిక రాశి.. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. కుటుంబంలో సంతృప్తికర వాతావరణం నెలకొంటుంది. సరైన నిర్ణయాలు తీసుకోవాలి.

ధనుస్సు రాశి.. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలు చేస్తారు. బంధుమిత్రుల సహాయ సాహకారాలు అందుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సరైన నిర్ణయాలు తీసుకోవాలి.

మకర రాశి.. ఈరోజు దూర ప్రయాణాలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. రుణ ప్రయాత్నాలు ఫలిస్తాయి.

కుంభ రాశి.. ఈరోజు వీరు అపకీర్తి రాకుండా జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండేదుకు ప్రయత్నించాలి. దూర వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ఆలోచింది సరైన నిర్ణయాలు తీసుకోవాలి.

మీన రాశి.. ఈరోజు వీరికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. పేరు.. ప్రతిష్టలు పెరుగుతాయి. రుణ బాధలు తొలగిపోతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. కుటుంబంలో కలహాలు దూరమవుతాయి.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read: RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. మరో ట్రైలర్ ను రిలీజ్ చేసే ప్లాన్ లో జక్కన్న..

Boyapati Srinu: తన మార్క్ ఆఫ్ యాక్షన్‌ జానర్‌ పాన్ ఇండియా మూవీ వైపు అడుగులేస్తున్న బోయపాటి

Alia Bhatt : బాలీవుడ్ టు హాలీవుడ్ వయా టాలీవుడ్.. బీటౌన్ బ్యూటీ జోరు మాములుగా లేదుగా.

Pushpa The Rise: ఇంకా తగ్గని పుష్ప మేనియా.. ఈసారి పోలీసుల వంతు.. వైరల్ అవుతున్న వీడియో..