Horoscope Today: వారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయమే.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Today Horoscope (August14, 2025): మేష రాశి వారు వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన కొత్త ప్రోత్సాహకాలను అందుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతులకు కూడా అవకాశముంది. వృషభ రాశి వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. నమ్మినవారి వల్ల మోసపోయే అవకాశం ఉంది. మిథున రాశికి చెందిన నిరుద్యోగుల ప్రయత్నాలు విజయవంతమవుతాయి. దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

దిన ఫలాలు (ఆగస్టు 14, 2025): మేష రాశి వారు వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన కొత్త ప్రోత్సాహకాలను అందుకునే అవకాశముంది. వృషభ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త.. మీరు నమ్మినవారి వల్ల మోసపోయే అవకాశం ఉంది. మిథున రాశికి చెందిన నిరుద్యోగుల ప్రయత్నాలు విజయవంతమయ్యే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
గ్రహ బలం బాగా అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన కొత్త ప్రోత్సాహకాలను అందుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతులకు కూడా అవకాశముంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. తోబుట్టువులతో వివాదాల్ని జాగ్రత్తగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులు కొత్త ఆఫర్లు అందుకుంటారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. నమ్మినవారి వల్ల మోసపోయే అవకాశం ఉంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. కుటుంబ ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా పూర్తవుతాయి. ఆస్తి వివాదాల్లో అప్రమత్తంగా ఉండడం శ్రేయస్కరం. అదనపు ఆదాయానికి బాగా అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన శుభవార్తలు వింటారు. వ్యాపారాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో తగిన మార్పులు చేపట్టి బాగా లబ్ధి పొందుతారు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. తలపెట్టిన పనుల్లో కొద్దిగా శ్రమాధిక్యత ఉన్నప్పటికీ ఆశించిన ఫలితముంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు విజయవంతమవుతాయి. పిల్లలు పురోగతి సాధిస్తారు. దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
అష్టమ రాహువు ప్రభావం వల్ల కొద్దిగా డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. స్వల్ప అనారోగ్యానికి కూడా అవకాశముంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. రెట్టింపు ఉత్సాహంతో బాధ్యతలు, లక్ష్యాల్ని పూర్తి చేస్తారు. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో అధికారులు భారీ లక్ష్యాలను అప్పగించే అవకాశముంది. అష్టమ శని ప్రభావం వల్ల శారీరక, మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది. తలపెట్టిన పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. రియల్ ఎస్టేట్, లిక్కర్, రాజకీయాలు, వ్యాపార రంగాల్లో ఉన్న వారికి లాభాల పంట పండుతుంది. కుటుంబ సమస్యలు క్రమంగా సర్దు మణుగుతాయి. ఆరోగ్యం పరవాలేదు. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆదాయం బాగా వృద్ధి చెందడం వల్ల ఒకటి రెండు వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల ఆదరణ బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు కనిపిస్తాయి. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. సంపాదనకు లోటు ఉండదు. వృథా ఖర్చులకు బాగా అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో అప్రయత్న ధన లాభం ఉంటుంది. వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది. వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేపట్టి లబ్ధి పొందు తారు. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. విదేశాల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఆదాయం అనుకూలంగా ఉండడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. గృహ, వాహన ప్రయత్నాలు సఫలమవుతాయి.కొందరు శత్రువులు మిత్రులుగా మారి సహాయపడతారు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు ఉపకరిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా అసంతృప్తి కలిగిస్తాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాడ 1)
ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. ఆర్థికంగా ఆశించిన స్థాయి పురోగతి ఉంటుంది. బంధుమిత్రుల్లో మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. వ్యాపారాలు సాఫీగా, ఉత్సాహంగా సాగిపోతాయి. రావలసిన సొమ్ము, బాకీలు సకాలంలో చేతికి అందుతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు ఆఫర్లు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాలు సానుకూలపడతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఆదాయం బాగానే ఉంటుంది కానీ, అనవసర ఖర్చులతో ఇబ్బంది పడతారు. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఫలితం ఉంటుంది.. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం లభిస్తుంది. సన్నిహితులతో వాదోపవాదాలకు దిగవద్దు. కొత్త వ్యక్తులతో స్నేహ సంబంధాలు ఏర్పడతాయి. ఆరోగ్యం పరవాలేదు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు రొటీనుగా సాగిపోతాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో అధికారులు బాగా ఎక్కువగా ఆధారపడతారు. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. కొన్ని కొత్త ఆదాయవృద్ధి ప్రయత్నాలను చేపడతారు. పెండింగ్ పనులను వ్యయ ప్రయాసలతో పూర్తి చేస్తారు. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలను చక్కబెడతారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ముఖ్యమైన ప్రయత్నాలు నెరవేరుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. నిరు ద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి అనుకోకుండా ఉపశమనం లభిస్తుంది. బంధుమిత్రులతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త పడడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో కొంత ఒత్తిడి, శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా ఇబ్బందులుంటాయి.



