- Telugu News Photo Gallery Spiritual photos Sun Ketu Conjunction: Unexpected Luck for These zodiac signs Details in Telugu
Lucky Zodiac Signs: రవి, కేతువుల కలయిక.. ఆ రాశుల వారు నక్క తోక తొక్కినట్టే..!
రవి, కేతువులు పరస్పర శత్రు గ్రహాలైనప్పటికీ, ఇవి రెండూ కలవడం వల్ల ఆకస్మిక పరిణామాలు చోటు చేసుకుంటాయని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ఈ నెల(ఆగస్టు) 16 నుంచి సెప్టెంబర్ 16 వరకూ సింహరాశిలో రవి, కేతు గ్రహాల యుతి జరుగుతోంది. సింహ రాశి రవికి స్వక్షేత్రం అయినందువల్ల కేతు బలం కన్నా రవి బలం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మిథునం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, ధనూ రాశుల వారికి సంబంధించి కొన్ని ఆకస్మిక శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది.
Updated on: Aug 13, 2025 | 5:37 PM

మిథునం: ఈ రాశికి తృతీయ స్థానంలో రవి, కేతువుల కలయిక వల్ల ఆస్తిపాస్తుల విషయంలో ఆకస్మిక పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై విలువైన భూ లాభం కలుగుతుంది. జీవనశైలి సమూలంగా మారిపోతుంది. మంచి స్నేహాలు ఏర్పడతాయి. ఉద్యోగపరంగా, ఆదాయవృద్దిపరంగా ఊహించని అవకాశాలు అందుతాయి. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో తప్పకుండా అంచనాల్ని మించిన పురోగతి ఉంటుంది.

కర్కాటకం: ఈ రాశికి ద్వితీయ స్థానంలో రవి, కేతువులు కలవడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ది చెంది, సంపన్నుల జాబితాలో చేరిపోయే అవకాశం ఉంది. రావలసిన సొమ్ముతో పాటు రాదనుకుని వదిలేసుకున్న సొమ్ము కూడా వసూలవుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు అంచనాలను మించుతాయి. వృత్తి, వ్యాపారాలు రాబడిపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపారాలు, షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి.

సింహం: ఈ రాశిలో రాశినాథుడు రవి కేతువును కలవడం వల్ల ఊహించని విధంగా దశ తిరుగుతుంది. అనేక విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారు సక్సెస్ అవుతారు. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయ మార్గాలు ఫలించి సంపన్నులవుతారు. అనారోగ్యానికి సరైన చికిత్స లభిస్తుంది.

తుల: ఈ రాశికి లాభ స్థానంలో రవి, కేతువులు యుతి చెందడం వల్ల ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలతో సహా అదనపు ఆదాయ మార్గాల ద్వారా ఆదా యం బాగా వృద్ది చెందుతుంది. జీవనశైలి సమూలంగా మారిపోతుంది. పిత్రార్జితం లభిస్తుంది. ఆస్తి పాస్తులు కలిసివస్తాయి. ఉద్యోగంలో హోదాతో పాటు జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపా రాలు లాభాల బాట పడతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

వృశ్చికం: ఈ రాశికి దశమ స్థానంలో రవి, కేతువులు కలవడం వల్ల ఉద్యోగంలో ఆకస్మిక పరిణామాలు చోటు చేసుకుంటాయి. సీనియర్లను కాదని పదోన్నతులు కలిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశీ ఉద్యోగాలు లభించడం జరుగుతుంది. తండ్రి జోక్యంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది.

ధనుస్సు: ఈ రాశికి భాగ్య స్థానంలో ఈ రెండు గ్రహాల కలయిక వల్ల విదేశీ అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. ఉన్నత విద్యకు విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు స్థిరత్వం పొందుతారు. వృత్తి, ఉద్యోగాల రీత్యా ఇతర దేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఆస్తి సమస్యలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది.



