- Telugu News Photo Gallery Spiritual photos Astro tips for water use: misuse of water affects moon badly remedies in telugu
నీటి దుర్వినియోగం చేసే అలవాటు ఉంటే తస్మాస్ జాగ్రత్త.. చంద్ర గ్రహ దోషంతో ఎన్ని కష్టాలు పడతారో తెలుసా..
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు, నక్షత్రాలు, రాశులు మానవ జీవితంలో చూపించే మంచి చెడుల గురించి అనేక విషయాలు పేర్కొంది. అంతేకాదు మనిషి చేసే పనులు కూడా గ్రహాలను ప్రభావితం చేస్తాయని వెల్లడించింది. ఇందులో నీటి వినియోగం గురించి కూడా ఉంది. మనిషి రోజువారీ అవసరాల్లో నీటికి అత్యంత ప్రాధ్యాన్యత ఉంది. ఈ నీరుని అనవసరంగా ఉపయోగిస్తే అతని జీవితంలో ప్రతికూలత ప్రవేశిస్తుంది. ఈ ప్రతికూలత కూడా ఒక గ్రహం చెడు ప్రభావం చూపించడం వలెనే జరుగుతుంది. ఈ రోజు నీటిని వృధా చేస్తే వారిపై ఏ గ్రహం చెడు ప్రభావం చూపిస్తోందో తెలుసుకుందాం..
Updated on: Aug 14, 2025 | 11:43 AM

మన దైనందిన జీవితంలోని ఎన్ని విషయాలు నవ గ్రహాలకు సంబంధించినవి అని జ్యోతిష్యశాస్త్రం పేర్కొంది. మనిషి జాతకంలో గ్రహాల ఉనికి.. మనిషి నడవడికపై ప్రభావం చూపుతుంది? మన అలవాట్లు కొన్నిసార్లు నవ గ్రహాలపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. ఈ కారణంగా మన జీవితంలో చాలా సమస్యలు తలెత్తుతాయి. కొంతమంది అనవసరంగా నీటిని వృధా చేస్తూ ఉంటారు. అప్పుడు కొంతమంది అయ్యో ఆ నీటిని అలా ఎందుకు వృధా చేస్తున్నారు అని భావిస్తారు.

ఇలా నీటిని వృధా చేసే అలావాటు మంచిది కాదని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంది. ఇలా అనవసరంగా నీటిని ఉపయోగించే అలవాటు ఎవరికైనా ఉంటే జాగ్రత్తగా ఉండాలి. నిజానికి నీటిని వృధా చేయడం మన జాతకంలో ఉన్న ఒక ముఖ్యమైన గ్రహాన్ని ప్రభావితం చేస్తుంది. ఆ గ్రహం ఏమిటి? ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తోంది తెలుసుకుందాం..

చంద్రుడు భావోద్వేగాలు, మనస్సు, నీటితో సంబంధం కలిగి ఉంటాడు. నీటిని దుర్వినియోగం చేయడం లేదా వృధా చేయడం వల్ల చంద్రుని ప్రతికూల ప్రభావాలు పెరుగుతాయని జ్యోతిష పండితులు చెబుతారు.

అనవసరంగా నీరుని వృధా చేయడం వలన కుండలిలో చంద్ర గ్రహం బలహీనపడుతుంది. చాలా మంది కుళాయిని తెరిచి ఉంచుతారు. కొంతమంది ఇళ్లలో నీటి ట్యాంక్ నుంచి నీరు పొంగిపొర్లడం ప్రారంభమవుతుంది. ఇది ఒకటి లేదా రెండుసార్లు జరిగితే, ఎటువంటి సమస్య లేదు. అయితే వీటిని అలవాటుగా చేసుకోవడం సరైనది కాదు. ఇవన్నీ కుండలిలో చంద్రుడిపై ప్రభావాన్ని చూపిస్తాయి.

ఏ వ్యక్తికైనా కుండలిలో చంద్రుని స్థానం చెడుగా లేదా బలహీనంగా ఉన్నప్పుడు అతని జాతకంలో చంద్ర దోషం ఉంటుంది. ఈ దోషం కారణంగా ఇంట్లో అసమ్మతి పరిస్థితి ఏర్పడుతుంది. అదే సమయంలో, మనస్సు చంచలంగా మారుతుంది. అంతేకాదు చాలా నిరాశకు లోనవుతారు. మనసు ఉద్రిక్తతో ఉంటుంది.

జ్యోతిషశాస్త్రంలో చంద్రుడు నీరు, భావోద్వేగాలకు సంబంధించిన గ్రహం. కనుక నీటిని వృధా చేసే అలవాటు ఉన్న వారి మనసు అసమతుల్యత, మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందట. అదృష్టం తగ్గడం.. ఏ పని మొదలు పెట్టినా చెడు ప్రభావాలు కలుగవచ్చు

కనుక ఎవరైనా సరే నీటిని దుర్వినియోగం చేయకుండా ఉండటం , నీటిని పొదుపుగా వాడటం మంచిది. చంద్రుని ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి మార్గాలు. అంతేకాదు చంద్రుని ప్రభావం జాతకంలో ఇతర గ్రహాలు, నక్షత్రాల స్థానాలపై కూడా ఆధారపడి ఉంటుంది. కనుక వ్యక్తికి నీటి దుర్వినియోగం చేయడం వలన కలిగే ప్రతికూల ప్రభావాలు ఎంతవరకు ఉంటాయి అనేది వారి జాతకంపై ఆధారపడి ఉంటుంది.

జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే, నీటిని దుర్వినియోగం చేయకూడదు. ఉదయించే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం, సోమవారం పాలు లేదా పాయసం దానం చేయడం, చంద్రుడికి సంబంధించిన మంత్రాలను జపించడం వంటి పరిహారాలు చేయడం, నీటిని పొదుపుగా ఉపయోగించడం వంటివి చంద్రుడిని శాంతింపజేస్తాయి.




