Horoscope Today: ఈరాశివారి మనసు చెడు పనుల మీదకు మళ్లుతుంది.. నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (March 25 2022) : రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా వృత్తి , ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా సరే తమకు ఈరోజు ఎలా ఉంటుంది అని ఆలోచిస్తారు.

Horoscope Today: ఈరాశివారి మనసు చెడు పనుల మీదకు మళ్లుతుంది.. నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
Follow us
Basha Shek

|

Updated on: Mar 25, 2022 | 6:00 AM

Horoscope Today (March 25 2022) : రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా వృత్తి , ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా సరే తమకు ఈరోజు ఎలా ఉంటుంది అని ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల(Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (మార్చి 25వ తేదీ ) శుక్రవారం రాశి ఫలాలు(Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి

ఈ రాశివారు విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటారు. శారీరక శ్రమ పెరుగుతుంది. కొన్ని కీలకమైన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఉన్నతాధికారులతో అప్రమత్తంగా ఉండాలి. సమస్యలెదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగేయాలి. శివుడుని ప్రార్థిస్తే మంచి కలుగుతుంది.

వృషభ రాశి

ప్రారంభించిన పనులను పూర్తిచేయడానికి సహనం, ఓర్పు, చిత్తశుద్ధి చాలా అవసరం. అనవసర విషయాలతో తలదూర్చి విలువైన సమయాన్ని వృథా చేసుకోకండి. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. శివ ఆరాధన శుభప్రదం.

మిథున రాశి

ఈరాశివారికి దైవానుగ్రహం ఉంటుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆటంకాలు ఎదురైనా మనోధైర్యంతో ముందడుగేస్తారు. వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే మరిన్ని మంచి ఫలితాలు అందకుంటారు.

కర్కాటక రాశి

ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఆయా పనుల్లో అనుకూల ఫలితాలను అందుకుంటారు. అనుకున్న రంగాల్లో విజయాలు సాధిస్తారు. విష్ణు నామస్మరణ మరింత మేలు చేకూరుస్తుంది.

సింహ రాశి

కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్‌కు సంబంధించి ముఖ్య ప్రణాళికలు వేసుకుంటారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే శుభం కలుగుతుంది.

కన్య రాశి

భవిష్యత్తు ప్రణాళికల్లో బిజీగా ఉంటారు. అయితే మీ మనసు చెడు పనుల మీదకు మళ్లే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. ఆదాయానికి తగ్గ ఖర్చులు ఉంటాయి. తోటివారితో అభిప్రాయ బేధాలు, కలహాలు వచ్చే సూచనలు ఉన్నాయి.

తుల రాశి

ఆర్థికంగా మంచి ఫలితాలు అందుకుంటారు. అనుకున్న రంగాల్లో మేలైన ఫలితాలు సాధిస్తారు. అయితే మానసిక ప్రశాంతతను కోల్పోకూడదు. ఒత్తిడి, ఆందోళనను దరిచేరనీయకండి. వెంకటేశ్వర స్వామిని దర్శించడం వల్ల అనుకూల ఫలితాలు కలుగుతాయి.

వృశ్చిక రాశి

మరింత ఉత్సాహంగా పనిచేస్తారు. కుటుంబీకులు, బంధువుల సహకారం లాభిస్తుంది. కీలక విషయాలను కుటుంబంలో చర్చించి నిర్ణయం తీసుకుంటే మంచిది. లక్ష్మీ సహస్రనామం పఠిస్తే మంచి జరుగుతుంది.

ధనుస్సు రాశి

చేపట్టే పనుల్లో సంతృప్తికర ఫలితాలను సాధిస్తారు. మానసిక సంతోషాన్ని పొందుతారు. విందులు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. విష్ణు సహస్రనామాలు చదవడం వల్ల ఉత్తమ ఫలితాలు అందుకుంటారు.

మకర రాశి

కీలక విషయాల్లో అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు అవసరమవుతాయి. శత్రువుల జోలికి పోకుండా ఉండటం మంచిది. ఒక వార్త మనసుకు బాధ కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. గణపతి స్వామి సందర్శనం శుభప్రదం.

కుంభ రాశి

ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించాలి. అప్పుడే అందరి ప్రశంసలు అందుకుంటారు. కొన్ని విషయాల్లో ఊహించిన దాని కన్నా అనుకూల ఫలితాలు అందుకుంటారు . శ్రీరామస్వామిని దర్శించుకుంటే ఉత్తమ ఫలితాలు అందుకుంటారు

మీన రాశి

వృత్తి, ఉద్యోగ,వ్యాపారాల్లో అనుకూలమైన సమయం నడుస్తోంది. మీ పనితీరుకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. విందులు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబీకులు, బంధువుల సహకారంతో ఒక ముఖ్య వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. శ్రీ రామ నామాన్ని జపించడం వల్ల మేలు చేకూరుతుంది.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read:Krithi Shetty: క్యూట్ లుక్స్ తో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్న కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోస్

Mango Farming: మామిడి ప్రియులకు చేదు వార్త.. పండ్ల రారాజును మింగేస్తున్న తామర పురుగు

BEL Recruitment 2022: బీఈ/బీటెక్‌ అర్హతతో.. భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో 63 ట్రైనీ, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ ఉద్యోగాలు..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!