AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం ఉంది.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే

Horoscope Today (27-03-2022): రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా తమకు ఈరోజు ఎలా ఉంటుందని .. మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. వృత్తి , ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ రంగంలో

Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం ఉంది.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే
Surya Kala
|

Updated on: Mar 27, 2022 | 6:48 AM

Share

Horoscope Today (27-03-2022): రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా తమకు ఈరోజు ఎలా ఉంటుందని .. మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. వృత్తి , ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా సరే వెంటనే తమ దినఫలాల (Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (మార్చి 27వ తేదీ ) ఆదివారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారికి స్నేహితుల వలన మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆశించిన ఫలితాలు సొంతమవుతాయి.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు కీలక నిర్ణయాలను తీసుకుంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనవసర ధన వ్యక్తం చేస్తారు.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి సక్సెస్ అందుకుంటారు. కుటుంబలో చిన్నపాటి సమస్యలు ఎదుర్కొంటారు. కోపాన్ని అదుపులో పెట్టుకుని ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు  శుభవార్త వింటారు. బంధు, మిత్రుల సహకారం లభిస్తుంది.  సమాజంలో పేరు ప్రతిష్టలు అందుకుంటారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు  ఆర్ధిక ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సి ఉంటుంది. విందు, వినోద,  కార్యక్రమాలలో పాల్గొంటారు.  అధిక శ్రమ కలుగుతుంది. అపవాదులు ఎదుర్కొంటారు. బంధు, మిత్రులతో ఆచితూచి మెలగాల్సి ఉంటుంది.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా ఉత్సాహంగా పనిచేస్తారు. . బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రారంభించబోయే పనుల్లో విజయం చేకూరుతుంది. బంధువులతో ఆచి తూచి వ్యవహరించాలి. కొన్ని సంఘటనలు సంతోషాన్ని ఇస్తాయి.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి.  కొందరి ఆలోచనా తీరు బాధను కలిగిస్తుంది.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు అభివృద్ధికి సంబంధించిన వార్తలు వింటారు. బంధు, మిత్రులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కుంభ రాశి: ఈరోజు ఈ రాశివారు శ్రమ అధికంగా పడాల్సి ఉంటుంది. బంధు, మిత్రులతో విబేధాలు రావచ్చు. కుటుంబ సలహాలతో ముందుకు సాగడం మంచిది.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు అవసరానికి తగిన డబ్బులను అందుకుంటారు. ఇతరుల సహకారంతో పనులు పూర్తి చేస్తారు. బంధు, మిత్రులతో సంతోషముగా గడుపుతారు.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read:

Ashwagandha: అశ్వగంధ పురుషులకు దివ్య ఔషధం.. లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!

Follow Us
ఏడాదికి ఎన్నిసార్లు ఏసీ సర్వీసింగ్ చేయించాలి..?
ఏడాదికి ఎన్నిసార్లు ఏసీ సర్వీసింగ్ చేయించాలి..?
కేవలం మూడు నిముషాల్లోనే బాడీని కూల్ చేసే వడలు..
కేవలం మూడు నిముషాల్లోనే బాడీని కూల్ చేసే వడలు..
ప్రమాదం అంచున విలవిలలాడిన శునకం.. ఫైర్ సిబ్బంది వీడియో వైరల్
ప్రమాదం అంచున విలవిలలాడిన శునకం.. ఫైర్ సిబ్బంది వీడియో వైరల్
SRH కెప్టెన్ బౌలింగ్.. ‘పెద్ది’ భామ బ్యాటింగ్.. వీడియో ఇదిగో
SRH కెప్టెన్ బౌలింగ్.. ‘పెద్ది’ భామ బ్యాటింగ్.. వీడియో ఇదిగో
ఐపీఎల్ ప్లేఆఫ్స్ సస్పెన్స్ క్లైమాక్స్‎కు వచ్చేసింది
ఐపీఎల్ ప్లేఆఫ్స్ సస్పెన్స్ క్లైమాక్స్‎కు వచ్చేసింది
ఎబోలా వైరస్ కల్లోలంపై భారత్ హైఅలర్ట్.. ఈ లక్షణాలు కనిపిస్తే..
ఎబోలా వైరస్ కల్లోలంపై భారత్ హైఅలర్ట్.. ఈ లక్షణాలు కనిపిస్తే..
మామిడి పండ్లతో టేస్టీ డెజర్ట్.. కుండలో చల్లటి మ్యాంగో ఫిర్నీ..
మామిడి పండ్లతో టేస్టీ డెజర్ట్.. కుండలో చల్లటి మ్యాంగో ఫిర్నీ..
చీకటి పడ్డాక పొరపాటున కూడా ఈ దేవుళ్ల పేర్లు తలవకూడదట!
చీకటి పడ్డాక పొరపాటున కూడా ఈ దేవుళ్ల పేర్లు తలవకూడదట!
మీ పాదాల అందాన్ని పాడుచేస్తున్న మడమల పగుళ్లు.. చిటికెలో మాయం
మీ పాదాల అందాన్ని పాడుచేస్తున్న మడమల పగుళ్లు.. చిటికెలో మాయం
ఈ గిన్నెలో చాయ్ పెడ్తే రోగాలు మాయం.. పూర్వీకులు చెప్పిన ట్రిక్
ఈ గిన్నెలో చాయ్ పెడ్తే రోగాలు మాయం.. పూర్వీకులు చెప్పిన ట్రిక్