Horoscope Today: ఆ రాశుల వారికి శుభవార్త.. సోమవారం 12 రాశుల వారి దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
Rashi Phalalu (26 June 2023): భవిష్యత్తులో తమ జీవితంలో ఏం జరగబోతోందో.. ముందే తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. దీని కోసం ప్రపంచ వ్యాప్తంగా జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరిస్తారు. ఇవాళ ఆయా రాశుల వారికి ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి? 12 రాశుల వారి సోమవారం దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
Rashi Phalalu (26 June 2023): భవిష్యత్తులో తమ జీవితంలో ఏం జరగబోతోందో.. ముందే తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. దీని కోసం ప్రపంచ వ్యాప్తంగా జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరిస్తారు. సోమవారం దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఉద్యోగంలో ఒకటి రెండు చిన్న చిన్న సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం నిలకడగా బాగానే ఉంటుంది. సంపాదన పెరిగే అవకాశం కూడా ఉంది. బంధువులు ఇంటికి రావడం జరుగుతుంది. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. శుభవార్తకు అవకాశం ఉంది. కుటుంబ జీవితం సరదాగా సామరస్యంగా సాగిపోతుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా, సామరస్యంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారంలో కూడా పెద్దగా సమస్యలేవీ ఉడకపోవచ్చు. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది. ఆరోగ్యం చాలా వరకు కుదుటపడుతుంది. కొన్ని కుటుంబ విషయాలు పట్టు విడుపులతో వ్యవహరించడం మంచిది. పిల్లల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) : ఆదాయానికి సంబంధించి ఎదురుచూస్తున్న శుభవార్త చెవిన పడే అవకాశం ఉంది. అటు ఉద్యోగంలోనూ, ఇటు కుటుంబంలోనూ కొద్దిగా కోపతాపాలు తగ్గించుకోవడం మంచిది. ఓర్పు సహనాలు చాలా అవసరం. వృత్తి నిపుణులకు అన్ని విధాలుగాను సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులు ఆఫర్ అందుకునే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) : ఉద్యోగ వాతావరణం, వృత్తి, వ్యాపారాలు సాను కూలంగా ఉంటాయి కానీ కుటుంబ జీవితంలో ఒకటి రెండు చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. సంయమనంతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అయితే ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు లభి స్తాయి. ఉద్యోగ ప్రయత్నం సఫలం అవుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) : కొన్ని ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతల కారణంగా పని భారం పెరిగే అవకాశం ఉంది. సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. డాక్టర్లు లాయర్ల వంటి వృత్తి రంగాలకు చెందిన వారు మంచి గుర్తింపు పొందే సూచనలు ఉన్నాయి. దూర ప్రాంతం నుంచి ఆశించిన శుభవార్త వింటారు. వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): సొంత పనుల మీద శ్రద్ధ పెంచడం మంచిది. ఆదాయ ప్రయత్నాలు చాలా వరకు కలిసి వస్తాయి. ఇతరుల వ్యవహారాలలో ఎటువంటి పరిస్థితులలోనూ తల దూర్చవద్దు. కొందరు బంధువులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ముందుకు సాగుతాయి. వ్యాపారాలలో లాభాలు కనిపి స్తాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అన వసర ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) : ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండకపో వచ్చు. ఇతరులకు ఆర్థిక సహాయం చేయడం కూడా జరుగుతుంది. విలాస జీవితం గడుపు తారు. ఉద్యోగంలో ప్రతిభ పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. అధికారుల నుంచి ప్రోత్సాహం ఉంటుంది. వృత్తి నిపుణులు బాగా బిజీ అయిపోతారు. కుటుంబ జీవితంలో సామరస్యం పెరుగుతుంది. ఒక ముఖ్యమైన కుటుంబ సమస్యను పరిష్కరించుకుంటారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ) : కొద్ది శ్రమతో ఒకటి రెండు ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకొని పొదుపు పాటి స్తారు. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఉద్యోగ జీవితంలో పని భారం పెరిగిన ప్పటికీ సంతృప్తికరమైన ప్రతిఫలం లభిస్తుంది. వృత్తి రంగాలలో ఉన్న వారికి శ్రమ బాగా పెరుగు తుంది. కుటుంబంలో ఒకటి రెండు సమస్యలు ఉన్నప్పటికీ ప్రశాంతంగా సాగిపోతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) : ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. అధికార యోగానికి లేదా ప్రమోషన్కు అవకాశం ఉంది. సంసార జీవితం సాఫీగా సాగిపోతుంది. కొత్త ప్రయత్నాలు, కొత్త నిర్ణయాల వల్ల శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఉద్యోగ వివాహ ప్రయత్నాలలో సానుకూల వార్తలు వింటారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) : కొన్ని ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఆదాయాన్ని సంబంధించి శుభవార్త వినడం జరుగుతుంది. ఉద్యోగంలో పని భారం పెరిగినప్పటికీ మంచి ప్రతిఫలం ఉంటుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తి నిపుణులకు బాగా డిమాండ్ పెరుగుతుంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. పిల్లలు అభివృద్ధి చెందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) : ఆర్థిక లావాదేవీల వల్ల ఆశించిన ప్రయోజనం ఉంటుంది. షేర్లు, జూదం, లాటరీ, వడ్డీలు వంటి వ్యవహారాల వల్ల ఆర్థిక లాభం పొందుతారు. ఉద్యోగ జీవితం చాలా వరకు సాఫీగా సాగిపో తుంది. వ్యాపారాలలో లాభాలు ఊపందుకుం టాయి. కుటుంబ సమస్య ఒకటి అప్రయత్నంగా పరిష్కారం అవుతుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. జీవిత భాగ స్వామికి విలువైన కానుకలు ఇవ్వడం జరుగుతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) : విహార యాత్రలకు ప్లాన్ చేసే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక జీవితం మీద ఆసక్తి పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బాగా బిజీ అయిపోతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి.
నోట్: ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..