Budhaditya Rajyoga 2023: మిథునంలో ఏర్పడిన బుధాదిత్య రాజయోగం.. ఈ రాశులవారికి సంతానప్రాప్తి, ధనలాభం..

Budhaditya Rajyoga: హిందూ ధర్మంలో జ్యోతిష్య శాస్త్రానికి ప్రముఖ స్థానం ఉంది. జ్యోతిష్యం ప్రకారం నవగ్రహాలు మనపై ఎల్లవేళలా ప్రభావం చూపుతాయి. అయితే ఈ ప్రభావాలు వాటి స్థితిగతులను బట్టి కొందరికీ అనుకూలంగా, మరి కొందరికీ ప్రతికూలంగా..

Budhaditya Rajyoga 2023: మిథునంలో ఏర్పడిన బుధాదిత్య రాజయోగం.. ఈ రాశులవారికి సంతానప్రాప్తి, ధనలాభం..
Budhaditya Rajyoga
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 25, 2023 | 10:01 PM

Budhaditya Rajyoga: హిందూ ధర్మంలో జ్యోతిష్య శాస్త్రానికి ప్రముఖ స్థానం ఉంది. జ్యోతిష్యం ప్రకారం నవగ్రహాలు మనపై ఎల్లవేళలా ప్రభావం చూపుతాయి. అయితే ఈ ప్రభావాలు వాటి స్థితిగతులను బట్టి కొందరికీ అనుకూలంగా, మరి కొందరికీ ప్రతికూలంగా ఉంటాయి. ఈ క్రమంలోనే జూన్ 24న గ్రహాల రాకుమారుడిగా ప్రసిద్ధి చెందిన బుధగ్రహం మిధునంలోకి ప్రవేశించాడు. అయితే బుధుడి కంటే ముందుగానే సూర్యుడు ఆ రాశిలోకి సంచరిస్తున్నాడు. మీథున రాశిలో సూర్యడు, బుధుడు ఒకే సారి సంచరిస్తున్న కారణంగా బుధాదిద్య రాజయోగం ఏర్పడింది. జ్యోతిష్య నిపుణుల ప్రకారం ఈ రాజయోగం కొన్ని రాశులవారికి ఎంతో సానుకూలంగా ఉంటుంది. అంతేకాక వారు పట్టిందల్లా బంగారం అయ్యేలా చేస్తుందట. మరి ఆ అదృష్ట రాశులేమిటో ఇప్పుడు చూద్దాం..

మిధునరాశి: సూర్యుడు, బుధుడు కలయిక మిథున రాశిలోనే జరిగిన కారణంగా ఈ రాశివారికి బుధాదిత్య రాజయోగం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఫలితంగా మీరు కొత్త ఆదాయ మార్గాలను కనుగొంటారు. అలాగే స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో మీరు సింధూరం ధరించడం మరిన్ని శుభ ఫలితాలను చేకూర్చేదిగా ఉంటుంది.

మేషరాశి: మిధున రాశిలో సూర్యుడు, బుధుడు సంచరిస్తున్న కారణంగా మేషరాశివారికి మంచి జరుగుతుంది. ఈ సమయంలో మేషరాశివారు ఎన్నో శుభవార్తలను వింటారు. ముఖ్యంగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న వివాదాలు తొలగిపోయి, ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్, వివాహం అయ్యేందుకు అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

వృషభ రాశి: మిథున రాశిలో కలిగిన బుధాదిత్య రాజయోగం వృషభ రాశివారికి కూడా శుభఫలితాలను ఇస్తుంది. వ్యాపారులకు ధనలాభం, కొత్త ఆదాయ మార్గాలు, పాత సంబంధాలు బలపడేందుకు కూడా ఇది మంచి సమయంగా ఉంటుంది. ముఖ్యంగా యువకులు కొత్త వ్యాపారలను ప్రారంభించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: ఈ కథనంలో ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇంకా టీవీ9 తెలుగు దీన్ని దృవీకరించడంలేదు.