Horoscope Today: వారికి ఆర్థిక సమస్యల నుంచి ఊరట.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు
Today Horoscope (October 17, 2024): మేష రాశికి చెందిన వారు ఆర్థిక విషయాల్లో ఎవరికీ హామీలు ఉండకపోవడం మంచిది. అలాగే వృషభ రాశి వారు ఉద్యోగాల్లో వివాదాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. మిథున రాశి వారు ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.
దిన ఫలాలు (అక్టోబర్ 17, 2024): మేష రాశి వారు ఆర్థిక విషయాల్లో ఎవరికీ హామీలు ఉండకపోవడం, వాగ్దానాలు చేయకపోవడం మంచిది. వృషభ రాశి వారు ఉద్యోగాల్లో వివాదాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. మిథున రాశి వారు ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
- మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు, లక్ష్యాలు మారే అవకాశం ఉంది. నిరుద్యోగులు పోటీ పరీక్షలు లేదా ఇంటర్వ్యూలలో విజయాలు సాధిస్తారు. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. బంధువుల సహాయంతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. అనుకోకుండా కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక విషయాల్లో ఎవరికీ హామీలు ఉండకపోవడం, వాగ్దానాలు చేయకపోవడం మంచిది. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ అనుకూల ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
- వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఉద్యోగాల్లో వివాదాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాలు నిదానంగా, నిలకడగా సాగిపోతాయి. గృహ నిర్మాణ కార్యక్రమాల్లో వేగంగా పనులు పూర్తవుతాయి. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించకపోవడం మంచిది. శ్రమాధిక్యత ఉన్నప్పటికీ అదనపు ఆదాయ ప్రయత్నాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. నిరుద్యోగులు తమకు అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
- మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఉద్యోగంలో బాధ్యతలు మారిపోయే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఉత్సాహం కలిగిస్తుంది. కొద్ది ప్రయత్నంతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆస్తి వివాదం పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. కొందరు బంధుమిత్రుల వల్ల ఊహించని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కుటుంబసమేతంగా దైవ కార్యాల్లో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు.
- కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఆర్థికంగా అనుకూలతలు పెరుగుతాయి. పిల్లల చదువుల విషయంలో శుభ వార్తలు వింటారు. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో అంచనా లను మించి లాభాలు గడిస్తారు. ఉద్యోగంలో ఒత్తిడి, శ్రమ బాగా తగ్గిపోయే అవకాశం ఉంది. నిరుద్యోగులు ఒకటి రెండు శుభవార్తలు వింటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పెళ్లి విషయంలో బంధుమిత్రుల నుంచి సహకారం అందుతుంది. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది.
- సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఉద్యోగాలలో అధికారులు ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. శారీరక, మానసిక ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన పనుల్లో ఆలస్యాలకు, అవాంతరాలకు అవకాశం ఉంది. రావలసిన సొమ్ము అవసర సమయంలో అందుతుంది. కుటుంబ సభ్యులతో అనుకోకుండా వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది.
- కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): చేపట్టిన పనులు నిదానంగా, మందకొడిగా సాగుతాయి. పిల్లల చదువుల విషయంలో ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాల వల్ల బాగా లాభముంటుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధి కోసం కొత్త మార్గాల మీద దృష్టి సారిస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది.
- తుల (చిత్త 3,4,స్వాతి, విశాఖ 1,2,3): వృత్తి, వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలతో ముందుకు సాగుతారు. ఉద్యోగపరంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయ మార్గాలు బాగా పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యల మీద విజయాలు సాధిస్తారు. ఆర్థిక సమస్యల నుంచి ఊరట చెందుతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఆశా జనకంగా ముందుకు సాగుతాయి. పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు చాలావరకు సానుకూలపడతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది.
- వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): అన్ని రంగాలవారికి అనుకూలతలు పెరుగుతాయి. గృహం కొనుగోలు వ్యవహారంలో నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబ పరిస్థితులు బాగా సానుకూలంగా మారతాయి. ముఖ్యమైన పనులన్నీ సజావుగా, సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగులకు జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. వృత్తి జీవితం సాఫీగా, సానుకూలంగా సాగిపోతుంది. రాదనుకున్న సొమ్ము, బాకీలు చేతికి అందుతాయి.
- ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఉపయోగకర పరిచయాలతో ఉత్సాహం పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం ఉంది. అతి కష్టం మీద ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. నిరుద్యోగుల శ్రమ ఫలించే అవకాశం ఉంది. సమాజంలో గౌరవాభిమానాలు పెరుగుతాయి. శుభవార్తలు వింటారు.
- మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): వృత్తి, వ్యాపారాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు మంచి పదవులు లభించే అవ కాశం ఉంది. వాహన ప్రయాణాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. చేపట్టిన పనులు నిదా నంగా పూర్తవుతాయి. మిత్రులతో వివాదాలు, అపార్థాలు పరిష్కారమవుతాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. అనేక మార్గాల్లో ఆర్థిక లాభాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కొందరు మిత్రులు అండగా నిలబడతారు. కొద్ది ప్రయత్నంతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది.
- కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఇంటా బయటా అనుకూలతలు కలుగుతాయి. ప్రయాణాల్లో కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడ తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అనుకూలంగా ఉండి, విస్తరణ ప్రయత్నాలు చేపడతారు. స్థిరాస్తి వివాదంలో విజయం లభిస్తుంది. ఉద్యోగంలో అధికారుల సహాయ సహకారాలు లభి స్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు.
- మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత ఉన్నప్పటికీ, వాటిని సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రుల నుంచి అవసరమైన సహాయం అందుతుంది. ఆస్తి సమస్య పరిష్కారం కావడంతో ఊరట చెందుతారు. వాహన యోగం కలిగే అవకాశం ఉంది. పిల్లలు చదువుల్లో ఘన విజయాలు సాధిస్తారు. నిరుద్యో గులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలపరంగా ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు తప్పకపోవచ్చు. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి