Zodiac Signs: అరుదైన యోగం.. ఆ రాశుల వారికి ఆదాయపరంగా అదృష్టకాలం..

ఈ నెల 16, 17, 18 తేదీల్లో చంద్ర, రవులు పూర్ణ దృష్టితో పరస్పరం వీక్షించుకోవడం జరుగుతుంది. ఈ గురు పూర్ణిమ రోజున రవిని చంద్రుడితో పాటు రాహువు, గురువు, కుజుడు కూడా వీక్షించడం జరుగుతోంది. రవి ఇప్పటికే కన్యా రాశిలో కేతువుతో యుతి చెంది ఉన్నాడు. రవి మీద ఈ విధంగా గురు పూర్ణిమ నాడు అయిదు గ్రహాల ప్రభావం పడడం ఒక విశేషం.

Zodiac Signs: అరుదైన యోగం.. ఆ రాశుల వారికి ఆదాయపరంగా అదృష్టకాలం..
Rare Yoga
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Oct 14, 2024 | 5:51 PM

ఈ నెల 16, 17, 18 తేదీల్లో చంద్ర, రవులు పూర్ణ దృష్టితో పరస్పరం వీక్షించుకోవడం జరుగుతుంది. ఈ గురు పూర్ణిమ రోజున రవిని చంద్రుడితో పాటు రాహువు, గురువు, కుజుడు కూడా వీక్షించడం జరుగుతోంది. రవి ఇప్పటికే కన్యా రాశిలో కేతువుతో యుతి చెంది ఉన్నాడు. రవి మీద ఈ విధంగా గురు పూర్ణిమ నాడు అయిదు గ్రహాల ప్రభావం పడడం ఒక విశేషం. ఆధ్యాత్మికంగా ఇదొక యోగ కాలమే అయినప్పటికీ, ఆదాయపరంగా కూడా అదృష్ట కాలమని చెప్పవచ్చు. వృషభం, కర్కాటకం, సింహం, కన్య, ధనుస్సు, మకర రాశుల వారికి ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగపరంగా ఆశించిన పురోగతి ఉంటుంది.

  1. వృషభం: ఈ రాశికి పంచమ కోణంలో సంచారం చేస్తున్న రవి మీద పౌర్ణమి ప్రభావానికి తోడు నాలుగు గ్రహాల ప్రభావం పడడం వల్ల ఆ మూడు రోజుల కాలంలో ఎటువంటి ఆదాయ ప్రయత్నానికి శ్రీకారం చుట్టినా ఊహించని విజయాలు లభిస్తాయి. మరింత మంచి జీతభత్యాలతో కూడిన ఉద్యో గంలోకి మారడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాల వృద్ధికి సంబంధించి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. మొత్తం మీద ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది.
  2. కర్కాటకం: ఈ రాశికి ధనాధిపతి అయిన రవికి బాగా బలం పెరగడం వల్ల ఆదాయం తప్పకుండా దిన దినా భివృద్ధి చెందుతుంది. ప్రయత్న లాభంతో పాటు అప్రయత్న ధన లాభం కూడా ఉంటుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, అదనపు రాబడి బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు ఊహించని స్థాయిలో లాభాలను ఆర్జిస్తాయి. షేర్లు, స్పెక్యు లేషన్లు, ఆర్థిక లావాదేవీలు లాభాలను పండిస్తాయి. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది.
  3. సింహం: రాశినాథుడైన రవి ధన స్థానంలో ఉండడం ఒక విశేషం కాగా, ఈ రవి మీద మరో నాలుగు గ్రహాల ప్రభావం పడడం మరో విశేషం. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి రావడం, సంపద వృద్ధి చెందడం, ఆర్థిక సహాయం లభించడం వంటివి జరుగుతుంది. ప్రభుత్వమూలక ధన లాభం కలుగుతుంది. ఉద్యో గంలో జీతాలు పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపట్టే అవకాశం ఉంది.
  4. కన్య: ఈ రాశిలో సంచారం చేస్తున్న రవి మీద గురు, కుజ, చంద్ర, రాహువుల దృష్టి పడడం వల్ల ఈ రాశివారు ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి కష్టనష్టాలున్నా బయటపడడం జరుగుతుంది. ముఖ్యంగా ఆదాయం రెండింతలు మూడింతలుగా పెరగడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఇంట్లో శుభ కార్యాలు జరగడానికి అవకాశం ఉంది. కుటుంబ పరిస్థితులు చక్కబడ తాయి. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాల పంట పండుతుంది.
  5. ధనుస్సు: ఈ రాశికి దశమ స్థానంలో ఉన్న రవి మీద నాలుగు గ్రహాల దృష్టి పడినందువల్ల ఉద్యోగులకు బాగా డిమాండ్ పెరుగుతుంది. సమర్థత, శక్తి సామర్థ్యాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. విదే శాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. జీతాలపరంగా శీఘ్ర పురోగతి ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు, రాబడి బాగా వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ప్రభుత్వమూలక ధన లాభం ఉంటుంది.
  6. మకరం: ఈ రాశికి భాగ్య స్థానంలో ఉన్న రవికి బలం పెరగడం వల్ల ప్రభుత్వం నుంచి ధన లాభం, గుర్తింపు కలుగుతాయి. ఉద్యోగంలో హోదాతోపాటు వేతనాలు బాగా పెరిగే అవకాశం ఉంది. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఖర్చులు తగ్గించుకుని, పొదుపు పాటిస్తారు. షేర్లు, వడ్డీలు, స్పెక్యులేషన్ల మీద మదుపు చేసి లాభాలు పొందుతారు. ఊహించని విధంగా విదేశీ సొమ్ము అనుభవించే యోగం కూడా ఉంది.

ఈజీగా అయిపోయే మీల్ మేకర్ మంచూరియా.. ఆరోగ్యం కూడా..
ఈజీగా అయిపోయే మీల్ మేకర్ మంచూరియా.. ఆరోగ్యం కూడా..
అన్నంతో రుచిగా మురుకులు.. కరకరలాడుతూ భలేగా ఉంటాయి..
అన్నంతో రుచిగా మురుకులు.. కరకరలాడుతూ భలేగా ఉంటాయి..
ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
కోహ్లీతో పాటు స్మిత్, రూట్ కూడా రిటైర్మెంట్ ఇస్తారు:గ్రెగ్ చాపెల్
కోహ్లీతో పాటు స్మిత్, రూట్ కూడా రిటైర్మెంట్ ఇస్తారు:గ్రెగ్ చాపెల్
చలికాలంలో కూడా కరెంటు బిల్లు పెరిగిపోతుందా? ఈ ట్రిక్స్‌తో..
చలికాలంలో కూడా కరెంటు బిల్లు పెరిగిపోతుందా? ఈ ట్రిక్స్‌తో..