జ్యోతిషశాస్త్రంలో ఒక్కో రాశిలో 18 నెలలు సంచారం చేసే రాహు కేతువులు ఎప్పుడూ వక్రించే ఉంటాయి. ప్రస్తుతం మీన, కన్యా రాశుల్లో ఉన్న ఈ రెండు గ్రహాలు 2025 మే 18 వరకు ఇవే రాశుల్లో కొనసాగుతాయి. ఒక్కో రాశిలో రెండున్నర సంవత్సరాలు సంచారం చేసే శని ప్రస్తుతం నవంబర్ 15 వరకూ కుంభ రాశిలోనూ, ప్రతి రాశిలోనూ ఏడాది పాటు సంచారం చేసే గురువు ఫిబ్రవరి 4 వరకూ వృషభ రాశిలోనూ వక్రించి ఉన్నాయి. మొత్తం మీద నాలుగు గ్రహాలు ప్రస్తుతం వక్రించి ఉన్నాయి. ఈ వక్ర గ్రహాల వల్ల వృషభం, కర్కాటకం, కన్య, తుల, వృశ్చికం, మకర రాశులు అత్యధికంగా లాభాలు పొందడం జరుగుతుంది. వీరి జీవితాలు కొత్త పుంతలు తొక్కుతాయి.