- Telugu News Photo Gallery Spiritual photos Budhaditya Yog: budh and sun yuti in thula rashi these zodiac signs to have budhaditya yoga details in telugu
Budhaditya Yoga: బుధాదిత్య యోగం.. వారికి వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..!
ఈ నెల 17 నుంచి 29 వరకు 12 రోజుల పాటు బుధ, రవులు తులా రాశిలో యుతి చెందడం జరుగుతుంది. ఇది బుధాదిత్య యోగానికి అవకాశం కల్పిస్తుంది. ఈ యోగం వల్ల ఒక్కో రాశిలో ఒక్కో విధమైన ఫలితాలుంటాయి. తులా రాశిలో ఏర్పడుతున్న ఈ బుధాదిత్య యోగం వల్ల సమస్యల పరిష్కారానికి అవకాశం కలుగుతుంది. ముఖ్యంగా వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కలిగే అవకాశం ఉంటుంది.
Updated on: Oct 13, 2024 | 8:23 PM

ఈ నెల 17 నుంచి 29 వరకు 12 రోజుల పాటు బుధ, రవులు తులా రాశిలో యుతి చెందడం జరుగుతుంది. ఇది బుధాదిత్య యోగానికి అవకాశం కల్పిస్తుంది. ఈ యోగం వల్ల ఒక్కో రాశిలో ఒక్కో విధమైన ఫలితాలుంటాయి. తులా రాశిలో ఏర్పడుతున్న ఈ బుధాదిత్య యోగం వల్ల సమస్యల పరిష్కారానికి అవకాశం కలుగుతుంది. ముఖ్యంగా వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కలిగే అవకాశం ఉంటుంది. మిథునం, కర్కాటకం, కన్య, తుల, ధనుస్సు, మకర రాశుల వారికి ఈ బుధాదిత్య యోగం ముఖ్యమైన సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.

మిథునం: ఈ రాశికి పంచమ స్థానంలో రాశ్యధిపతి బుధుడితో రవి కలుస్తున్నందువల్ల ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబ సమస్యల నుంచి, ముఖ్యంగా పిల్లల సమస్యల నుంచి చాలావరకు బయటపడడం జరుగుతుంది. ఉద్యోగంలో సహచరులతో పోటీపడి విజయాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో శత్రు జయంతో పాటు ఆర్థిక సమస్యల పరిష్కారానికి మార్గం దొరుకుతుంది. విద్యార్థులు, నిరుద్యోగులు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో తేలికగా నెగ్గుతారు.

కర్కాటకం: ఈ రాశికి చతుర్థ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ఆస్తి సమస్యలు, వివాదాలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతాయి. ఆదాయం బాగా పెరగడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. గృహ, వాహన సంబంధమైన ప్రయత్నాల్లో ఆటంకాలు తొలగి పోతాయి. విలువైన ఆస్తి లభించే అవకాశం ఉంది. తల్లి ఆరోగ్యం కుదుటపడుతుంది. ఉద్యోగంలో ఇష్టమైన ప్రాంతానికి స్థాన చలనానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది.

కన్య: ఈ రాశికి ధన స్థానంలో రాశ్యధిపతి బుధుడితో రవి గ్రహం కలవడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడడం జరుగుతుంది. ఆదాయ ప్రయత్నాలు, ఆదాయ మార్గాలు తక్కువ కష్టంతో ఎక్కువ ఫలితాలనిస్తాయి. ఇతరుల వివాదాలను పరిష్కరిస్తారు. మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో మీ సలహాలు, సూచనలు అధికారులకు ఎంతో ఉపయోగపడతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది.

తుల: ఈ రాశిలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ఉద్యోగంలో పురోగతి, అధికార లాభానికి సంబం ధించిన సమస్యలు, ఆటంకాలు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభించి వృత్తి, వ్యాపారాలు సజావుగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. ఏ వ్యవహారమైనా, ఏ ప్రయత్నమైనా ఎటు వంటి ఆటంకాలు లేకుండా సునాయాసంగా పూర్తవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో తప్పకుండా సానుకూల సమాచారం అందుతుంది.

ధనుస్సు: ఈ రాశికి లాభ స్థానంలో బుధ, రవులు కలవడం వల్ల బుధాదిత్య యోగంతో పాటు, ధర్మకర్మాధిప యోగం అనే అరుదైన యోగం కూడా పడుతుంది. దీనివల్ల ఉద్యోగంలో సహోద్యోగుల మీద పైచేయి సాధించడం, ఉన్నత స్థానాలకు చేరుకోవడం జరుగుతుంది. ఆదాయ వృద్ధికి సంబంధిం చిన ఏ ప్రయత్నమైనా తప్పకుండా విజయవంతం అవుతుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు కలలో కూడా ఊహించని ఆఫర్లు, ఆహ్వానాలు అందుతాయి.

మకరం: ఈ రాశికి పదవ స్థానంలో, అంటే ఉద్యోగ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడుతున్నందువల్ల ఉద్యోగంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. పదోన్నతికి సంబంధించిన ఆటంకాలు తొలగిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఎటువంటి సమస్యల ఒత్తిడి ఉన్నప్పటికీ బాగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యల నుంచి చాలావరకు బయటపడడం జరుగుతుంది. రావలసిన డబ్బు, మొండి బాకీలు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతాయి. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.



