ధన వృద్ధికి సంబంధించిన స్థానాలు 2, 9, 11. ఇందులో ఏ స్థానాధిపతి అదే స్థానంలో ఉన్నా, మిగిలిన రెండు స్థానాల్లో ఉన్నా ఆదాయం విశేషంగా అభివృద్ధి చెందుతుంది. రాశ్యధిపతి ఈ 2, 9, 11 స్థానాల్లో ఉన్నా ఆదాయం బాగా పెరుగుతుంది. ప్రస్తుతం అయిదు రాశులకు ఈ విధమైన ధన యోగం పట్టింది. మేషం, సింహం, కన్య, తుల, మకర రాశుల వారికి ఈ నెలాఖరు వరకు ఈ ధన యోగం అవిచ్ఛిన్నంగా సాగిపోయే అవకాశం ఉంది.