- Telugu News Photo Gallery This is what happens if you keep a copper sun in your house, Check Here is Details
Coper Surya: రాగితో చేసిన సూర్యుడిని ఇంట్లో పెట్టుకుంటే జరిగేది ఇదే..
చాలా మంది ఇంటికి ఎదురుగా రాగి సూర్యుడిని పెట్టుకుంటూ ఉంటారు. ఇలా రాగి సూర్యుడిని ఇంటికి ఎదురుగా పెట్టవచ్చా.. పెడితే ఎలాంటి యోగాలు కలుగుతాయి? అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంటికి ఎదురుగా రాగి సూర్యుడిని పెట్టుకోవచ్చు. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి.. పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా.. రాగి సూర్యుడు అడ్డుకుంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి. రాగితో చేసిన సూర్యుడిని..
Updated on: Oct 17, 2024 | 2:26 PM

చాలా మంది ఇంటికి ఎదురుగా రాగి సూర్యుడిని పెట్టుకుంటూ ఉంటారు. ఇలా రాగి సూర్యుడిని ఇంటికి ఎదురుగా పెట్టవచ్చా.. పెడితే ఎలాంటి యోగాలు కలుగుతాయి? అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంటికి ఎదురుగా రాగి సూర్యుడిని పెట్టుకోవచ్చు.

ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి.. పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా.. రాగి సూర్యుడు అడ్డుకుంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి. రాగితో చేసిన సూర్యుడిని ఇంటికి ఎదురుగా పెట్టడం వల్ల అదృష్టం కూడా కలిసి వస్తుందట.

రాగి సూర్యుడిని ఇంట్లో ఉండే గోడలపై సరైన దిశలో పెడితే.. చక్కటి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా గౌరవం, మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో ఉండే తగాదాలు సర్దుకుని.. సంబంధాలు మెరుగు పడతాయి.

రాగి సూర్యుడికి బలమైన ఆకర్షణ శక్తి ఉంటుంది. కాబట్టి ఇది ఇంట్లో ఉండటం వల్ల మీ కుటుంబానికి మంచి పేరు, ప్రఖ్యాతలు లభిస్తాయి. వ్యాపారవేత్తలు పెడితే.. లాభాలు బాగా కలిసి వస్తాయి. ధనాకర్షణ కూడా పెరుగుతుంది. సూర్య భగవానుడి ఆశీస్సులు కూడా లభిస్తాయి.

ఈ రాగి సూర్యుడిని ఇంటికి ప్రధాన ద్వారం తూర్పు దిశలో ఉంటే.. తలుపు వెలుపల పెట్టవచ్చు. ఇలా పెట్టడం వల్ల సంపద అనేది వృద్ధి అవుతుంది. ఇలా లేని వాళ్లు తూర్పు దిశలో కూడా ఈ రాగి సూర్యుడిని పెట్టుకున్నా మంచి ఫలితాలే ఎదురవుతాయి. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)




