- Telugu News Photo Gallery Spiritual photos Deepavali 2024: these Eco friendly Ideas to celebrate Diwali Festival
Diwali 2024: దీపావళిని పర్యావరణ అనుకూల పద్ధతిలో జరుపుకోవడానికి ఈ చిట్కాలు పాటించండి..
హిందువులు ఘనంగా జరుపుకునే పండగలలో ఒకటి దీపావళి. వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్దా అందరూ కలిసి ఇష్టంగా జరుపుకునే పండగ. ఉండేది బంగ్లా అయినా, పూరి గుడిసె అయినా అవమాస్య చీకట్లను తరిమి కొడుతూ చిన్న దీపం అంటే జీవితంలో వెలుగులు ఉంటాయని తెలియజెప్పే దీపావళి. దీపాలను వెలిగించడం, పటాకులు కాల్చడం ఎంతో ఇష్టంగా చేసే దీపావళి పండగ అంటే చెడు నుంచి మంచికి, ఓటమి నుంచి గెలుపుకి, భయం నుంచి ధైర్యానికి ప్రకృతి వేసే పూల దారే దీపావళి.. ఈ పండగను పర్యావరణ అనుకూల పద్ధతిలో జరుపుకోవాలని ఆలోచిస్తుంటే కొన్ని చిట్కాలను గురించి తెలుసుకుందాం..
Updated on: Oct 16, 2024 | 2:33 PM

దీపాల పండుగ అంటే దీపావళి అందరికీ నచ్చే పండుగ. దీపావళి రోజున దీపాలు వెలిగించడం, పటాకులు పేల్చడం, గోపూజ చేయడం, లక్ష్మీపూజ చేయడం ద్వారా పండుగను జరుపుకుంటాము.

దీపావళి రోజున దీపాలు వెలిగిస్తారు. పటాకులు కాలుస్తారు. ఇలా చేయడం వలన వాయు కాలుష్యాన్ని కలిగిస్తుంది. ఇది ఆస్తమా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD), ఇతర శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి ఇబ్బంది కలిగిస్తుంది.

బాణాసంచా ప్రభావం వల్ల పర్యావరణంపై చెడు ప్రభావం పడుతుందని తెలిసి కూడా పటాకులు కాల్చి వాయు కాలుష్యాన్ని పెంచడం సరికాదని ప్రకృతి ప్రేమికులు చెబుతున్నారు. అయితే దీపావళిని పర్యావరణ అనుకూలమైన రీతిలో జరుపుకోవాలని ఆలోచిస్తుంటే ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.

దీపావళిని సంప్రదాయబద్ధంగా పండుగ జరుపుకోండి. మార్కెట్‌లో చాలా అందమైన పర్యావరణ అనుకూల ఎంపికలు అందుబాటులో ఉన్నప్పుడు పర్యావరణానికి మంచిది. అయితే ప్లాస్టిక్ సంచులను కొనడం మానేయండి. ప్లాస్టిక్‌కు బదులు సాంప్రదాయక మట్టి కుండలను ఎంపిక చేసుకోండి. ఈ విధంగా స్థానిక కళాకారులను కూడా ప్రోత్సహించవచ్చు.

ముగ్గులకు రంగులు వేయాలను కుంటే సహజ రంగులను జోడించండి. దీపావళి రోజున రంగోలీలు పెట్టడం అంటే అందరికీ ఇష్టమే. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. ఈ సంవత్సరం రంగోలీకి రసాయన రంగులకు బదులుగా సహజ రంగులను ఉపయోగించండి. రంగోలీని మరింత పర్యావరణ అనుకూలమైనదిగా చేయడానికి బియ్యం పిండి, పసుపు, బంతి పువ్వులు, గులాబీ రేకులు, చామంతి రేకులను ఉపయోగించవచ్చు.

పర్యావరణ అనుకూల బహుమతులు ఇవ్వండి. దీపావళి రోజున స్నేహితులు, కుటుంబ సభ్యులకు అలంకరణ వస్తువులను బహుమతిగా ఇవ్వడం ఇష్టమైతే ఈ సంవత్సరం మీ స్నేహితులకు కొంచెం పర్యావరణ అనుకూలమైన బహుమతిని ఇవ్వడానికి ప్రయత్నించండి. మొక్క, సేంద్రీయ ఉత్పత్తులు, చేతితో తయారు చేసిన లేదా రీసైకిల్ చేసిన వస్తువులను బహుమతిగా ఇవ్వండి.

దీపావళి రోజున బాణసంచా కాల్చడం ఇష్టపడితే.. పర్యావరణ అనుకూలమైన ఉత్తమ మార్గాలను ఎంచుకోండి. ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్ లేదా గ్రీన్ క్రాకర్స్ ను ఎంచుకోండి. అంతేకాదు తక్కువ శబ్దం, పొగ ఉత్పత్తి చేసే బాణసంచా కాల్చండి.

LED లైట్లను ఉపయోగించండి. దీపావళి అంటే వెలుగుల పండుగ. ఈ పండుగ రోజున మీ ఇల్లు దేదీప్యమానంగా మెరిసిపోవాలని మీరు కోరుకుంటే, మీరు మీ ఇళ్లను అలంకరించేందుకు పర్యావరణ అనుకూలమైన LED లైట్లను ఎంచుకోవచ్చు. అంతేకాదు స్వచ్చమైన నువ్వుల నూనేతో దీపాలు వెలిగించడం ఆధ్యాత్మికంగానే కాదు పర్యావరణానికి కూడా మేలు.




