- Telugu News Photo Gallery Spiritual photos Kuja Gochar in Karkataka Rashi These zodiac signs to have adikara yoga details in telugu
Kuja Gochar 2024: కర్కాటక రాశిలో కుజుడి.. ఆ రాశుల వారికి అధికార యోగం
ఈ నెల 21 నుంచి 2025 జనవరి వరకు కుజ గ్రహం కర్కాటక రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. కర్కాటక రాశి కుజుడికి నీచ రాశి అయినప్పటికీ కొన్ని రాశులకు అదృష్టాలనివ్వడం జరుగుతుంది.దీనివల్ల శారీరక, మానసిక ఒత్తిళ్లు బాగా తగ్గుతాయి. అధికార యోగం పడుతుంది. విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. కొన్ని వ్యక్తిగత, కుటుంబ సమస్యలు అప్రయత్నంగా పరిష్కారం అవుతాయి. ఆర్థిక సమస్యల నుంచి కూడా విముక్తి లభించే అవకాశం ఉంది.
Updated on: Oct 15, 2024 | 7:53 PM

ఈ నెల 21 నుంచి 2025 జనవరి వరకు కుజ గ్రహం కర్కాటక రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. కర్కాటక రాశి కుజుడికి నీచ రాశి అయినప్పటికీ కొన్ని రాశులకు అదృష్టాలనివ్వడం జరుగుతుంది. వృషభం, కన్య, తుల, వృశ్చికం, కుంభం, మీన రాశుల వారికి కుజుడు నీచ పడడమే యోగదాయకంగా మారుతుంది. దీనివల్ల శారీరక, మానసిక ఒత్తిళ్లు బాగా తగ్గుతాయి. అధికార యోగం పడుతుంది. విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. కొన్ని వ్యక్తిగత, కుటుంబ సమస్యలు అప్రయత్నంగా పరిష్కారం అవుతాయి. ఆర్థిక సమస్యల నుంచి కూడా విముక్తి లభించే అవకాశం ఉంది. నీచ కుజుడితో ఇబ్బందులు పడేవారు సుబ్రహ్మణ్యాష్టకం చదువు కోవడం, పగడం పొదిగిన ఉంగరం ధరించడం వల్ల చెడు పరిస్థితుల్లో మార్పు వస్తుంది.

వృషభం: ఈ రాశికి తృతీయ స్థానంలో కుజుడు నీచబడడం వల్ల ఆత్మవిశ్వాసం, ధైర్యం, సాహసం, చొరవ వంటి లక్షణాలు వృద్ధి చెందుతాయి. ఏ ప్రయత్నమైనా సఫలం అవుతుంది. ప్రయాణాల వల్ల బాగా లాభం ఉంటుంది. ఏ రంగంలో ఉన్నవారికైనా పురోగతి ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదా యం వృద్ధి చెందుతుంది. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు సఫలం అవుతాయి. మంచి పరిచయాలు కలుగుతాయి.

కన్య: ఈ రాశివారికి లాభస్థానంలో కుజుడు నీచబడడం వల్ల ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయ వృద్ధికి సంబంధించి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. ఆస్తి, గృహ ఒప్సందాలు కుదురుతాయి. భూ లాభం కలుగుతుంది. అన్న దమ్ములతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రాభవం పెరుగుతుంది.

తుల: ఈ రాశికి సప్తమ స్థానంలో కుజుడి నీచ సంచారం వల్ల ఉద్యోగపరంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు, ఇష్టమైన ప్రాంతాలకు బదిలీలు వంటివి జరిగే అవకాశం ఉంది. ఉద్యోగులు మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి కూడా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాల నుంచి చాలావరకు బయటపడే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించవచ్చు. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.

వృశ్చికం: రాశ్యధిపతి కుజుడు భాగ్య స్థానంలో నీచబడడం వల్ల యోగం పడుతుంది. విదేశాలకు వెళ్లే అవ కాశం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. విదేశీ పెళ్లి సంబంధం కుదురుతుంది. తండ్రి నుంచి భూ లాభం కలుగుతుంది. సోదరులతో సమస్యలు, వివాదాలు పరిష్కారమవుతాయి. తీర్థయాత్రలు, విహార యాత్రలు ఎక్కువగా చేయడం జరుగుతుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది.

కుంభం: ఈ రాశికి ఆరవ స్థానంలో నీచ కుజ సంచారం వల్ల ఆదాయం వృద్ధి చెంది ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అనారో గ్యాల నుంచి ఆశించిన స్థాయిలో ఉపశమనం పొందే అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలు చాలా వరకు సత్ఫలితాలనిస్తాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే సూచనలు న్నాయి. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. ఆశించిన స్థాయిలో భూలాభం కలుగుతుంది.

మీనం: ఈ రాశికి అత్యంత శుభుడైన కుజుడు పంచమ స్థానంలో ప్రవేశించడం వల్ల సంతాన యోగానికి అవకాశం కలుగుతుంది. దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. తండ్రి నుంచి ఆస్తిపాస్తులు లభిస్తాయి. మాటకు బాగా విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో హోదా పరంగా, ఆర్థికపరంగా శీఘ్ర పురోగతికి అవకాశం ఉంటుంది. ప్రతిభా పాటవాలకు గుర్తింపు లభి స్తుంది. లాభదాయక పరిచయాలు కలుగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు.



