- Telugu News Photo Gallery Spiritual photos Surya gochar 2024: sun transit in tula these zodiac signs to face new problems details in telugu
Sun Transit 2024: రవి నీచత్వంతో ఆ రాశుల వారికి కొత్త సమస్యలు.. పరిహారాలు ఇవే..!
Surya Gochar 2024: ఈ నెల 17 నుంచి నవంబర్ 16 వరకూ రవి తులా రాశిలో నీచత్వం పొందడం జరుగుతోంది. గ్రహ రాజైన రవి నీచబడడం కొన్ని రాశులకు ఏమంత మంచిది కాదు. తండ్రి, అధికారం, ప్రభుత్వం, ఆరోగ్యం, సంపదలకు కారకుడైన రవి ఏ విధంగా బలహీనపడినా ఈ కారకత్వాలకు సంబంధించి సమస్యలు సృష్టించడం జరుగుతుంది.
Updated on: Oct 15, 2024 | 1:36 PM

ఈ నెల 17 నుంచి నవంబర్ 16 వరకూ రవి తులా రాశిలో నీచత్వం పొందడం జరుగుతోంది. గ్రహ రాజైన రవి నీచబడడం కొన్ని రాశులకు ఏమంత మంచిది కాదు. తండ్రి, అధికారం, ప్రభుత్వం, ఆరోగ్యం, సంపదలకు కారకుడైన రవి ఏ విధంగా బలహీనపడినా ఈ కారకత్వాలకు సంబంధించి సమస్యలు సృష్టించడం జరుగుతుంది. మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, కుంభం, మీన రాశుల వారు రవి నీచబడడం వల్ల కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ రాశుల వారు ఓ నెల రోజుల పాటు రోజూ ఉదయం ఆదిత్య హృదయం లేదా సుందరకాండ పఠించడం వల్ల రవి దోషాలు తగ్గే అవకాశం ఉంటుంది.

మేషం: ఈ రాశికి పంచమాధిపతిగా అత్యంత శుభుడైన రవి నీచబడడం వల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా తగ్గే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో భాగస్వాములతో సమస్యలు తలెత్తు తాయి. ప్రయాణాలు నష్టదాయకంగా సాగుతాయి. వైవాహిక, ప్రేమ జీవితాల్లో అపార్థాలు, వివాదాలు చోటు చేసుకుంటాయి. ఆదాయ వృద్ధికి ఆటంకాలు, అవాంతరాలు ఏర్పడతాయి. తండ్రి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ప్రభుత్వపరంగా ఊహించని సమస్యలు కలిగే అవకాశం ఉంది.

కర్కాటకం: ఈ రాశివారికి ధనాధిపతిగా రవి చతుర్థంలో నీచబడుతున్నందువల్ల సొంత ఇల్లు, వాహనం వంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. తల్లి ఆరోగ్యం ఆందోళన కలిగించే అవకాశం ఉంది. చిన్నాచితకా కుటుంబ సమస్యలు బాధిస్తాయి. ఆస్తి వివాదాల పరిష్కారానికి అవాంతరాలు కలుగుతాయి. ప్రయాణాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా మోస పోవడం లేదా నష్టపోవడం జరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోపం కలుగుతుంది.

కన్య: ఈ రాశికి వ్యయాధిపతిగా రవి ధన స్థానంలో నీచబడడం వల్ల ఆర్థిక వ్యవహారాల్లో సమస్యలు తలెత్తుతాయి. రావలసిన సొమ్ము ఒక పట్టాన చేతికి అందదు. ఆర్థిక లావాదేవీలు నష్టం కలిగి స్తాయి. ఆస్తి లేదా గృహ ఒప్పందాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. ఆర్థికంగా ఒత్తిడి పెరిగి రుణాలు చేయవలసి వస్తుంది. ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. నష్టదాయక వ్యవహారాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. ఆరోగ్య సమస్యలకు అవకాశం ఉంది.

వృశ్చికం: ఈ రాశికి వ్యయ స్థానంలో రవి నీచబడడం వల్ల ఉద్యోగ సమస్యలు తలెత్తుతాయి. ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీ కావడం జరుగుతుంది. అధికారుల ఆగ్రహానికి గురవుతారు. ఉద్యోగంలో పొర పాట్లు చేసే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వం నుంచి ఇబ్బందులుంటాయి. తండ్రి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది. చిన్న ఉద్యోగం కోసం దూర ప్రాంతాలకు వెళ్లవలసి వస్తుంది. వృత్తి, వ్యాపా రాలు మందకొడిగా సాగుతాయి. ఇంటా బయటా ప్రాధాన్యం, ప్రాభవం బాగా తగ్గే అవకాశం ఉంది.

కుంభం: ఈ రాశికి భాగ్య స్థానంలో రవి నీచత్వం చెందడం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. తండ్రితో కూడా విభేదాలు ఏర్పడతాయి. నిరుద్యోగులు కొద్దిగానిరాశకు గురయ్యే అవకాశం ఉంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నవారు తీవ్ర ఒత్తిడికి గురి కావాల్సి వస్తుంది. దూర ప్రయాణాలు ఇబ్బంది పెడతాయి. ముఖ్యమైన ప్రయత్నాలు విఫలం అయ్యే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరగక పోవచ్చు.

మీనం: ఈ రాశికి అష్టమ స్థానంలో రవి నీచ సంచారం వల్ల అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. రావలసిన డబ్బు సకాలంలో అందక ఇబ్బంది పడతారు. రుణ సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభించకపోవచ్చు. చిన్న పనికి కూడా ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. ప్రభుత్వం నుంచి సమస్యలు తలెత్తుతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు ఒక పట్టాన పరిష్కారం కాకపోవచ్చు. కుటుంబ సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి.



