Ketu Gochar 2024: ఒంటరి కేతువుతో వారికి మంచిరోజులు.. ఆ రాశుల వారికి ధన, అధికార యోగాలు..!
కన్యా రాశిలో చాలా కాలంగా ఏదో ఒక గ్రహంతో కలిసి ఉన్న కేతువు ఈ నెల (అక్టోబర్) 21 నుంచి ఏడాది చివరి వరకూ ఒంటరిగా సంచారం చేయబోతున్నాడు. ఈ కేతువు మీద గురు దృష్టి ఉండడం వల్ల కొన్ని రాశుల వారు ఆకస్మిక ధన లాభం పొందే అవకాశం ఉంటుంది. కేతువు ఆకస్మిక పరిణామాలకు, ఊహించని పరిస్థితులకు కారకుడు. ఈ వక్ర గ్రహం వల్ల జీవితంలో కొన్ని ఆకస్మిక శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి.
కన్యా రాశిలో చాలా కాలంగా ఏదో ఒక గ్రహంతో కలిసి ఉన్న కేతువు ఈ నెల 21 నుంచి ఏడాది చివరి వరకూ ఒంటరిగా సంచారం చేయడం జరుగుతోంది. ఈ కేతువు మీద గురు దృష్టి ఉండడం వల్ల కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన లాభానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆకస్మిక పరిణామాలకు, ఊహించని పరిస్థితులకు కారకుడైన ఈ వక్ర గ్రహం వల్ల జీవితంలో కొన్ని ఆకస్మిక శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. ఈ కేతు సంచారం కారణంగా మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మకర రాశుల వారికి ధన యోగాలు, అధికార యోగాలు పట్టే అవకాశం ఉంది.
- మేషం: ఈ రాశికి కేతువు ఆరవ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల అనారోగ్యాల నుంచి బయటపడ డంతో పాటు శారీరక దృఢత్వం కూడా కలుగుతుంది. అనుకోకుండా ధన లాభాలు కలిసి ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికార లాభం కలు గుతుంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. కార్యకలాపాలు బాగా విస్తరిస్తాయి. నిరుద్యోగులకు అప్రయత్నంగా కొన్ని అవకాశాలు కలిసి వస్తాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
- కర్కాటకం: ఈ రాశికి తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న కేతువు వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయ వంతం అవుతుంది. ముఖ్యంగా ఆదాయ ప్రయత్నాలు అంచనాలకు మించి సత్ఫలితాలనిస్తాయి. ఏ రంగంలోని వారికైనా కొద్దో గొప్పో పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో ఊహించని అభివృద్ధి ఉండ వచ్చు. ప్రయాణాల వల్ల బాగా లాభముంటుంది. వృత్తి, వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.
- కన్య: ఈ రాశిలో సంచారం చేస్తున్న కేతువు పూర్తిగా యోగదాయకంగా మారుతుంది. అనేక పర్యా యాలు ధన యోగాలు కలిగి సంపద పెరుగుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి అప్రయత్నంగా బయటపడే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరు గుతుంది. శక్తి సామర్థ్యాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. సమాజంలోని పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలకు డిమాండ్ పెరుగుతుంది.
- వృశ్చికం: ఈ రాశికి లాభస్థానంలో కేతు సంచారం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. లాభదాయక, ఉపయోగకర పరిచయాలు ఏర్పడతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. వృత్తి, వ్యాపా రాలను విస్తరించడం జరుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు సైతం అంది వస్తాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు బాగా పెరిగే అవకాశం ఉంది.
- ధనుస్సు: ఈ రాశికి దశమ స్థానంలో కేతు సంచారం వల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. ఒక సంస్థకు అధిపతి అయ్యే అవకాశం కూడా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి. ఉద్యోగం మారడానికి అవకాశాలు మెరుగుపడతాయి. స్వయం ఉపాధివారు బాగా రాణిస్తారు. ఆదాయం అనేక విధాలుగా పెరగడం వల్ల ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
- మకరం: ఈ రాశికి భాగ్య స్థానంలో కేతువు సంచారం వల్ల విదేశీయానానికి అవకాశాలు కలుగుతాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు, వివిధ వృత్తుల వారికి విదేశీ ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి నిశ్చయం కావడం జరుగు తుంది. అనేక విధాలుగా అదృష్ట యోగాలు, ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. చాలా కాలంగా పెండింగులో ఉన్న శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఇష్టమైన పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.