Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి..12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (ఆగస్టు 5, 2024): మేష రాశి వారు సోమవారంనాడు సన్నిహిత బంధువులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృషభ రాశి వారు సన్నిహిత బంధువులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మిథున రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు ఆటంకాలు, అవరోధలన్నీ తొలగిపోతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి..12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు
Horoscope Today 05th August 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 05, 2024 | 5:01 AM

దిన ఫలాలు (ఆగస్టు 5, 2024): మేష రాశి వారు సోమవారంనాడు సన్నిహిత బంధువులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృషభ రాశి వారు సన్నిహిత బంధువులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మిథున రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు ఆటంకాలు, అవరోధలన్నీ తొలగిపోతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

సన్నిహిత బంధువులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో పాటు ఆలయాలు సందర్శించుకుంటారు. చేపట్టిన పనులు, వ్యవహారాల్లో ప్రతిష్టంభనలు తొలగిపోతాయి. నష్టదాయక కార్యకలాపాలకు దూరంగా ఉండడం మంచిది. వృథా ఖర్చుల్ని వీలైనంతగా తగ్గించుకోవడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుని ఆశించిన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగపరంగా ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో బాగా అనుకూల వాతావరణం ఉంటుంది. విదేశాల్లో ఉన్న మిత్రుల నుంచి ఎదురు చూస్తున్న సమాచారం అందుతుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలకు లోటుండదు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, సంతోషంగా సాగిపోతుంది. ముఖ్యమైన పనుల్లో కార్యసిద్ధికి, వ్యవహార జయం కలుగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు అనుకూలమైన స్పందన లభిస్తుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆటంకాలు, అవరోధ లన్నీ తొలగిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఇష్టమైన స్నేహితులు, బంధువులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టిన ప్రతి పనినీ సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు చాలావరకు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ధనపరంగా కొద్దిపాటి ఒడిదుడుకులు ఉంటాయి. ప్రయాణాల్లో శ్రమాధిక్యత, భారీ ఖర్చులు తప్ప ప్రయోజనం ఉండదు. వృత్తి, వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. తోబుట్టువులతో ఊహించని వివా దాలు కలుగుతాయి. ఉద్యోగంలో ప్రతి బాధ్యతనూ సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ముఖ్యమైన వ్యవ హారాలు, ప్రయత్నాల్లో వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి తగ్గు తుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ప్రస్తుతానికి దూర ప్రయాణాలు పెట్టుకోకపోవడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ఇబ్బందులుంటాయి. వృత్తి, వ్యాపారాలు చాలావరకు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం సాదాసీదాగా కొనసాగుతుంది. ధనపరంగా ఆశించిన పురోగతి ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో చికాకులు తొలగి పోతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆదాయం, ఆరోగ్యం సవ్యంగా సాగిపోతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఇంటికి ఇష్టమైన బంధువులు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో విందులో పాల్గొంటారు. నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వ్యాపారాల్లో కీలక మార్పులు చేపడతారు. కొత్త ప్రయత్నాలకు, కొత్త నిర్ణయాలకు ఇది బాగా అనుకూల సమయం. వృత్తి, ఉద్యోగాల్లో సంతృప్తికర వాతావ రణం ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కొన్ని ముఖ్యమైన పనుల్ని తేలికగా పూర్తి చేస్తారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సల హాలు బాగా కలిసి వస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆస్తి సమస్య ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు అందివస్తాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాల్లో ఆశించిన విజయం లభిస్తుంది. బంధువుల్లో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో కొద్దిగా ఆటంకాలుంటాయి. కుటుంబ పెద్దల్ని అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ధనపరంగా ఎవరికైనా మాట ఇవ్వడం పెట్టుకోవద్దు. వృత్తి, వ్యాపారాలు సమస్యాత్మకంగా సాగుతాయి. ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగుతుంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆర్థిక సంబంధమైన ప్రయత్నాలు సఫలమవుతాయి. స్తోమతకు మించి బంధువులకు ఆర్థిక సహాయం చేస్తారు.

ధనుస్సు (మూల, పూర్వా‌షాఢ, ఉత్తరాషాఢ 1)

ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. కొందరు బంధువులతో అకారణంగా విరోధాలు కలు గుతాయి. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. మంచి వ్యక్తు లతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్త వింటారు. పిల్లలు చదువుల్లో ఘన విజయాలు సాధిస్తారు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా, ఆశాజనకంగా ఉంటుంది. ఇష్టమైన బంధువుల రాకపోకల వల్ల ఇంటి వాతావరణం సందడిగా ఉంటుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. పిల్లల చదువుల మీద శ్రద్ధ చూపిస్తారు. ఉద్యోగులు ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది. అనుకోకుండా డబ్బు బాగా కలిసి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

తలపెట్టిన పనులు, వ్యవహారాలన్నీ మందకొడిగా సాగుతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండ డం మంచిది. ప్రయాణాల్లో శ్రమ మిగులుతుంది. కష్టార్జితంలో చాలా భాగం వృథా అయ్యే అవకాశం ఉంది. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశిం చిన స్థిరత్వం లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. మొండి బాకీలు వసూలు చేస్తారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

దాయాదులతో స్థిరాస్తి వివాదాలు, సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. పూజలు, పుణ్య కార్యాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. అనుకున్న పనులు, వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగాల్లో అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలను చాలావరకు అధిగమి స్తారు. నిరుద్యోగులకు దూర ప్రాంతాల నుంచి మంచి ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.