AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money Astrology: ఆ రాశుల వారికి సంపాదన మీదే దృష్టి.. రెండు మాసాల్లో ఆశించిన ఫలితాలు..!

గురు, కుజుల్లో ఏ ఒక్క గ్రహమైనా వృషభ రాశిలో ఉంటే ధన వ్యామోహం పెరుగుతుంది. అదే విధంగా, శుక్ర, బుధుల్లో ఏ ఒక్కరు సింహ రాశిలో ఉన్నా ధన దాహం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఈ రెండు కాంబినేషన్లు చోటు చేసుకున్నందువల్ల ఆరు రాశుల వారిలో విపరీతంగా డబ్బు సంపాదించాలనే యావ, ధ్యాస బాగా పెరిగే అవకాశం ఉంది.

Money Astrology: ఆ రాశుల వారికి సంపాదన మీదే దృష్టి.. రెండు మాసాల్లో ఆశించిన ఫలితాలు..!
Money Astrology
TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Aug 05, 2024 | 7:05 PM

Share

గురు, కుజుల్లో ఏ ఒక్క గ్రహమైనా వృషభ రాశిలో ఉంటే ధన వ్యామోహం పెరుగుతుంది. అదే విధంగా, శుక్ర, బుధుల్లో ఏ ఒక్కరు సింహ రాశిలో ఉన్నా ధన దాహం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఈ రెండు కాంబినేషన్లు చోటు చేసుకున్నందువల్ల ఆరు రాశుల వారిలో విపరీతంగా డబ్బు సంపాదించాలనే యావ, ధ్యాస బాగా పెరిగే అవకాశం ఉంది. ఈ ఆరు రాశుల్లో వృషభం, సింహం, కన్య, వృశ్చికం, మకరం, కుంభం ఉన్నాయి. ఈ రాశుల వారు కొద్ది కష్టంతో ఒకటి రెండు నెలల్లో తమ లక్ష్యాలను సాధించుకునే అవకాశం కూడా ఉంది.

  1. వృషభం: ఈ రాశి సహజ ధన స్థానం అయినందువల్ల ఈ రాశివారిలో మామూలుగానే సంపాదన ధ్యాస ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఈ రాశిలో కుజ, గురువులు, చతుర్థ స్థానంలో శుక్ర, బుధులు సంచారం చేస్తున్నందువల్ల, వీరు అనేక ఆదాయ ప్రయత్నాల ద్వారా సంపదను వృద్ధి చేసుకునేం దుకు ప్రయత్నిస్తారు. ఎంత కష్టానికైనా వీరు సిద్ధపడతారు. ఆదాయ వ్యయాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు. సంపాదన విషయంలో వీరి లక్ష్యాలు సిద్ధిస్తాయి.
  2. సింహం: ఈ రాశిలో శుక్ర, బుధులు, దశమ స్థానంలో కుజ, గురువుల సంచారం కారణంగా ఈ రాశివారు ఏదో విధంగా ధన సంపాదన సాగించాలనే ఆలోచనలో పడతారు. సాధారణంగా వీరికి వీరి మీద నమ్మకం ఎక్కువ. సంపాదన విషయంలో ధైర్యంగా ముందుకు దూసుకుపోతారు. లక్ష్యాలను నిర్దే శించుకుని ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తారు. వీరిలో ఆకట్టుకునే శక్తి, నాయకత్వ లక్షణాలు ఎక్కు వగా ఉన్నందువల్ల వీరికి అనేక సంపాదనావకాశాలు అంది వస్తాయి. వీరు అనుకున్నది సాధిస్తారు.
  3. కన్య: ఈ రాశికి భాగ్య స్థానంలో కుజ, గురువులు, రాశ్యధిపతి బుధుడితో శుక్రుడి యుతి వల్ల వీరి దృష్టంతా ధన సంపాదన మీద కేంద్రీకృతమవుతుంది. సాధారణంగా వీరు ఏ అవకాశాన్నీ చేజా ర్చుకోరు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడంలోనూ, పట్టుదలలోనూ వీరిని మించినవారు ఉండరు. వృత్తి, వ్యాపారాలను తమ వినూత్నమైన ఆలోచనలతో కొత్త పుంతలు తొక్కిస్తారు. ఉద్యోగాల్లో అధికారుల ప్రాపకం ద్వారా జీతభత్యాలనే కాక, అదనపు రాబడిని కూడా బాగా పెంచుకుంటారు.
  4. వృశ్చికం: రాశ్యధిపతి కుజుడు ధన కారకుడు, ధనాధిపతి అయిన గురువుతో కలిసి సప్తమ స్థానంలో సంచారం చేయడం, ఉద్యోగ స్థానంలో బుధ, శుక్రులు కలిసి ఉండడం వల్ల వీరు అనేక మార్గాల్లో ఆదాయం గడించే అవకాశం ఉంది. అనవసర ఖర్చుల్ని తగ్గించుకుని, పొదుపు పాటిస్తారు. ఏ విధంగా డబ్బు సంపాదించాలో, ఎక్కడ అవకాశాలున్నాయో వీరికి తేలికగా పసిగట్టగలుగుతారు. లక్ష్య సాధనకు వీరు ప్రతి అవకాశాన్నీ, ప్రతి మార్గాన్నీ ఉపయోగించుకోవడం చేసుకోవడం జరుగుతుంది.
  5. మకరం: ఈ రాశికి పంచమస్థానంలో, అంటే ఆలోచనా స్థానంలో, కుజ, గురులు, అష్టమ స్థానంలో శుక్ర, బుధులు కలిసి ఉండడం వల్ల ఆదాయం పెంచుకోవడానికి ఎంతటి శ్రమకైనా సిద్ధపడతారు. వీరిలో ఉన్నత స్థాయి ఆశయాలు, లక్ష్యాలతో పాటు, పట్టుదల, ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగా ఉన్నం దువల్ల అనేక మార్గాల్లో ఆదాయం గడించడానికి అవకాశం ఉంది. దీర్ఘకాలిక ప్రణాళికల ద్వారా వీరు ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు, బ్యాంక్ బ్యాలెన్స్ ను వృద్ధి చేసుకునే అవకాశం ఉంది.
  6. కుంభం: ఈ రాశికి చతుర్థ స్థానంలో కుజ, గురువులు, సప్తమ స్థానంలో బుధ, శుక్రుల సంచారం వల్ల ధన వ్యామోహం బాగా పెరుగుతుంది. క్రమశిక్షణకు, బాధ్యతకు మారుపేరైన శనీశ్వరుడు ఈ రాశికి అధిపతి అయినందువల్ల వీరు ఆర్థిక లక్ష్యాలను తప్పకుండా సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో సరైన నిర్ణయాల్ని తీసుకుంటారు. ఆస్తి వివాదాన్ని అనుకూలంగా పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపా రాల్ని లాభాల బాట పట్టిస్తారు. ఉద్యోగాల్లో జీతభత్యాలతో పాటు రాబడి కూడా బాగా పెరుగుతుంది.