Horoscope Today: వారికి హ్యాపీగా, సాఫీగా కుటుంబ జీవితం.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (ఆగస్టు 6, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. వృషభ రాశికి చెందిన నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పట్టే అవకాశం ఉంది. ఉద్యోగులకు కూడా ఆఫర్లు అందే సూచన లున్నాయి. మిథున రాశి వారి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. మేషరాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: వారికి హ్యాపీగా, సాఫీగా కుటుంబ జీవితం.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు
Horoscope Today 06th August 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 06, 2024 | 5:01 AM

దిన ఫలాలు (ఆగస్టు 6, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. వృషభ రాశికి చెందిన నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పట్టే అవకాశం ఉంది. ఉద్యోగులకు కూడా ఆఫర్లు అందే సూచన లున్నాయి. మిథున రాశి వారి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. మేషరాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆస్తి వ్యవహారాలతో పాటు ఆర్థిక వ్యవహారాల్లో కూడా కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. స్తోమతకు మించి మిత్రులకు సహాయం చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో శుభవార్తలు వినడం జరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు బాగా పుంజుకుంటాయి. ఉద్యోగ ప్రయ త్నాలు ఫలించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో ఇష్టమైన పుణ్యక్షేత్రం సందర్శిస్తారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పట్టే అవకాశం ఉంది. ఉద్యోగులకు కూడా ఆఫర్లు అందే సూచనలున్నాయి. దూర ప్రాంతం నుంచి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికా రులకు నమ్మకం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు గడిస్తారు. కుటుంబ సభ్యుల మీద ఖర్చు పెరుగుతుంది. చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. గ్రహ బలం బాగా అనుకూ లంగా ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. రావలసిన డబ్బు సకాలంలో అందు తుంది. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో పని భారం పెరిగి ఇబ్బంది పడతారు. అధికారుల నుంచి కొద్దిగా ఒత్తిడి తప్పకపోవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించుతుంది. దైవ కార్యాల్లోనూ, సమాజ సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. పెళ్లి ప్రయత్నాల విషయంలో దూరపు బంధువుల నుంచి ఆశించిన కబురు అందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. పిల్లలు కొద్ది శ్రమతో చదువుల్లో పురోగతి సాధిస్తారు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ప్రయాణాల వల్ల ఆశించిన ఉపయోగం ఉంటుంది. వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. రావలసిన ధనం సకాలంలో అందుతుంది. అనవసర ఖర్చులు అదుపు తప్పుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. బంధువులు కొందరు లేని పోని విమర్శలు సాగించే అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలు చదువుల్లో తేలికగా విజయాలు సాధిస్తారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఇష్టమైన మిత్రుల నుంచి శుభ కార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో ఊహించని లాభాలు లభిస్తాయి. ప్రముఖుల పరిచయాలు ఉపయోగపడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సంతృప్తికర వాతావరణముం టుంది. ఆదాయపరంగా ఆశించిన అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు సాధి స్తారు. కుటుంబ జీవితం చాలావరకు హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, వ్యాపారాలను విస్తరించాలన్న ఆలోచన చేస్తారు. అనుకోకుండా ధన లాభం కలిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ జీవితం నల్లేరు మీది బండిలా సాగిపోతుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధించడం జరుగుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

కొన్ని కీలకమైన వ్యక్తిగత సమస్యలు తొలగిపోతాయి. ఆస్తి వివాదం ఒకటి మానసిక ఒత్తిడి కలిగిస్తుంది. ధనపరంగా ఒడిదుడుకుల నుంచి చాలావరకు బయటపడతారు. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఊరట లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఏ ప్రయత్నం చేపట్టినా అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. అనుకోకుండా ఉద్యోగులకు, నిరుద్యోగులకు కొన్ని ఆఫర్లు అందుతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

అదనపు ఆదాయ ప్రయత్నాలు సంతృప్తికర ఫలితాలినిస్తాయి. ముఖ్యమైన పనులు, వ్యవహా రాల్లో వ్యయ ప్రయాసలుంటాయి. కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటుంది. ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరిగి, కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. కొద్ది ప్రయత్నంతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక సమస్యలు ఉండకపోవచ్చు. వ్యక్తి గత సమస్యలను కూడా చాలావరకు పరిష్కరించుకుంటారు. ఉద్యోగంలో పని భారం కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. అనుకున్న పనుల్ని అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆదాయ ప్రయత్నాలు సంతృప్తికర ఫలితాలనిస్తాయి. దాంపత్య జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆరోగ్యానికి లోటుండదు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

కొందరు బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. అధిక శ్రమతో గానీ పనులు పూర్తి కావు. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఎవరితోనూ తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్త వింటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. మొండి బాకీలు వసూలవుతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

కుటుంబ వ్యవహారాల మీద దృష్టి పెడతారు. పిల్లల చదువులు అభివృద్ధి బాటపడతాయి. బంధు వుల నుంచి ఊహించని శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీ అయిపో తాయి. ప్రయాణాల్లో మంచి పరిచయాలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. ముఖ్యమైన ప్రయత్నాలన్నీ సకాలంలో సవ్యంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారులు మీకు బాగా ప్రాధాన్యం ఇస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?