Sun Transit: త్వరలో సొంత రాశిలో అడుగు పెట్టనున్న సూర్యుడు.. ఈ ఐదు రాశులకు చెందిన వ్యక్తులపై లక్ష్మీదేవి కటాక్షం..

ఆగస్టు నెలలో సూర్య భగవానుడు ఒక సంవత్సరం తర్వాత తన సొంత రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. శక్తి, ఆత్మ కారకం అయిన సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశించడం సింహ రాశి వారికి ఒక వరం మాత్రమే కాదు.. మరికొన్ని ఇతర రాశులకు చెందిన వ్యక్తులకు కూడా సూర్య సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ రాశుల వారికి ఉద్యోగంలో ప్రమోషన్ , జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని రాశుల వ్యక్తులు కొన్ని ప్రత్యేక స్థానాన్ని పొందవచ్చు.

Sun Transit: త్వరలో సొంత రాశిలో అడుగు పెట్టనున్న సూర్యుడు.. ఈ ఐదు రాశులకు చెందిన వ్యక్తులపై లక్ష్మీదేవి కటాక్షం..
Surya Gochar 2024
Follow us
Surya Kala

|

Updated on: Aug 06, 2024 | 8:16 AM

జ్యోతిష్యశాస్త్రంలో నవ గ్రహాలకు, రాశులకు విశిష్ట స్థానం ఉంది. నవ గ్రహాలకు అధినేత సూర్యభగవానుడు. నెలకి ఒకసారి తన రాశిని మార్చుకుంటాడు సూర్యుడు. ఈ నేపధ్యంలో సూర్యుడు త్వరలో సింహరాశిలో సంచరించబోతున్నాడు. ఆగస్టు నెలలో సూర్య భగవానుడు ఒక సంవత్సరం తర్వాత తన సొంత రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. శక్తి, ఆత్మ కారకం అయిన సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశించడం సింహ రాశి వారికి ఒక వరం మాత్రమే కాదు.. మరికొన్ని ఇతర రాశులకు చెందిన వ్యక్తులకు కూడా సూర్య సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ రాశుల వారికి ఉద్యోగంలో ప్రమోషన్ , జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని రాశుల వ్యక్తులు కొన్ని ప్రత్యేక స్థానాన్ని పొందవచ్చు.

సూర్యుని సంచారం ఎప్పుడంటే

ప్రస్తుతం సూర్యుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. అనంతరం ఈ నెల ( ఆగష్టు) 16వ తేదీన సూర్యభగవానుడు కర్కాటక రాశి నుంచి బయటకు వచ్చి తన సొంత రాశి అయిన సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. సూర్యుడు ఆగస్ట్ 16, 2024 రాత్రి 07:53 గంటలకు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. సెప్టెంబర్ 16 వరకు ఈ రాశిలో ఉంటాడు. ఇక ఆగస్ట్ 22 వరకు సూర్యుడు, బుధుడు, శుక్రుడు కలవడం వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది.

  1. మేషరాశి: సింహరాశిలో సూర్యుడు సంచరించడం వల్ల మేష రాశి వారు తమ వృత్తిలో అనుకూల ఫలితాలు పొందుతారు. పూజల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలతోపాటు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి.
  2. వృషభ రాశి: వృషభ రాశి వారికి కూడా సింహరాశిలోకి సూర్యుని ప్రవేశం చాలా మేలు చేస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. వారసత్వ ఆస్తులు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాదు మూలధన పెట్టుబడులకు ఇది మంచి సమయం. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి.
  3. కర్కాటక రాశి: కర్కాటక రాశి వారికి సూర్య సంచారం పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి వారి జాతకంలో సూర్యభగవానుడు నాల్గవ స్థానంలోకి ప్రవేశించానున్నాడు. దీంతో డబ్బులకు ఇబ్బంది ఉండదు. ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. అంతే కాకుండా ఉద్యోగంలో కూడా పురోగతికి అవకాశం ఉంటుంది.
  4. సింహ రాశి: సూర్య భగవానుడు సింహ రాశికి అధిపతి. అటువంటి పరిస్థితిలో సూర్య భగవానుడి తన సొంత రాశిలోకి ప్రవేశించడం వలన సింహ రాశి వారికి చాలా శుభప్రదంగా, ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో వృత్తి, వ్యాపారంలో గణనీయమైన విజయన్ని సొంతం చేసుకుంటారు. వైవాహిక జీవితాల్లో సంతోషం పెరుగుతుంది. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు రావచ్చు.
  5. ధనుస్సు రాశి: సింహరాశిలో సూర్యభగవానుడు అడుగు పెట్టడం ధనుస్సు రాశి వారికి శుభప్రదం. సూర్యభగవానుడు ధనుస్సు రాశిలోని తొమ్మిదవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఈ కాలంలో ధనుస్సు రాశి ప్రజలు పూర్తిగా అదృష్టాన్ని సొంతం చేసుకుంటారు. వృత్తి, వ్యాపారం మొదలుకొని వ్యక్తిగత జీవితం వరకు ప్రతిచోటా సానుకూలత వాతావరణం నెలకొంటుంది.
ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు