Horoscope Today: ఆ రాశుల వారికి ఆదాయం పెరిగే అవకాశం..12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (ఆగస్టు 7, 2024): మేష రాశికి చెందిన ఉద్యోగులకు చాలా కాలం ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుతాయి. వృషభ రాశివారికి ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులుంటాయి. మిథున రాశి వారు ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
దిన ఫలాలు (ఆగస్టు 7, 2024): మేష రాశికి చెందిన ఉద్యోగులకు చాలా కాలం ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుతాయి. వృషభ రాశివారికి ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులుంటాయి. మిథున రాశి వారు ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగులకు చాలా కాలం ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుతాయి. వ్యాపారాల్లో భాగస్థులతో అనుకూలతలు పెరుగుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థికంగా అనుకూల పరిస్థితులుంటాయి. రాదనుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. కొద్ది రోజుల పాటు ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టు కోవద్దు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
అనుకోకుండా మొండి బాకీలు వసూలవుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలిగినప్పటికీ, సకాలంలో వాటిని పూర్తి చేస్తారు. మిత్రుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా ముందుకు సాగు తాయి. ఉద్యోగ జీవితం బాగా అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులుంటాయి. మంచి పరిచయాలు కలుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ప్రయాణాల్లో చిక్కులు, ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగంలో అదనపు పని భారం వల్ల విశ్రాంతి లభించదు. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. వృత్తి జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ఇంటా బయటా అనుకూల పరిస్థితులుంటాయి. నిరుద్యోగులకు అనుకూల సమాచారం అందుతుంది. పిల్లల విద్యా విషయాల మీద దృష్టి పెట్టడం మంచిది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఏ పని తలపెట్టినా శ్రమాధిక్యత తప్పకపోవచ్చు. వ్యాపార వ్యవహారాలు జోరందుకుంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. కీలక వ్యవహారాల్లో బంధుమిత్రుల మీద ఆధారపడకపోవడం మంచిది. ధన వ్యవహారాల్లో కొద్దిగా అప్రమత్తంగా ఉండడం మంచిది. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు కొద్ది శ్రమతో సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
అవసరానికి తగ్గట్టుగా చేతికి డబ్బు అందుతుంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. ఇష్టమైన బంధువులతో ఇంట్లో ఆనందంగా గడు పుతారు. మిత్రుల సహాయంతో వ్యక్తిగత సమస్యలను చాలావరకు పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో నష్టాల నుంచి చాలావరకు బయటపడతారు. ఉద్యోగాల్లో సమస్యల తొలగి పోతాయి. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
దగ్గర బంధువుల నుంచి శుభవార్తలు, ఆహ్వానాలు అందుతాయి. రావలసిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబ సమస్యల్ని చాలావరకు పరిష్కరించుకుంటారు. ఆదాయం విష యంలో కొత్త ప్రయత్నాలు చేపడతారు. అనుకోకుండా వాహన యోగం పడుతుంది. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. వ్యాపా రాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మిత్రులతో ఎంజాయ్ చేస్తారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. జీవిత భాగస్వామితో అపార్థాలు తొలగిపోతాయి. చేపట్టిన పనులు సవ్యంగా సాగిపోతాయి. కుటుంబ సభ్యులతో విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. వ్యాపారాల్లో ఆశించిన లాభా లుండకపోవచ్చు. వృత్తి, ఉద్యోగాలు సాదా సీదాగా సాగిపోతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. అనుకోకుండా మంచి పరిచయాలు ఏర్పడతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఒకటి రెండు కుటుంబ సమస్యలు బాగా ఇబ్బంది పెడతాయి. ఉద్యోగంలో ప్రతి బాధ్యతనూ సమ ర్థవంతంగా నిర్వర్తిస్తారు. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. వృత్తి జీవితం బిజీ అయిపో తుంది. నిరుద్యోగుల ప్రయత్నాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. చేపట్టిన పనులన్నీ పూర్తవు తాయి. ఆస్తి వ్యవహారాల్లో సోదరుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత అవసరం.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
సమాజంలో ప్రముఖుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుంది. వ్యాపారాల్లో వివాదాలు పరిష్కా రమై, లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు మంచి కంపెనీ నుంచి కీలక సమాచారం అందు తుంది. ఉద్యోగులకు కూడా నూతన అవకాశాలు అందుతాయి. మిత్రుల సహాయంతో వ్యవహా రాలు, పనులు పూర్తవుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఉద్యోగంలో ఓర్పుతో వ్యవహరించి సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా, సామరస్యంగా ఉంటాయి. ఆకస్మిక ధన లాభ సూచ నలున్నాయి. వ్యాపారాలు నిదానంగా కొనసాగుతాయి. ఉద్యోగంలో సహోద్యోగుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన కీలక సమాచారం అందుతుంది. పెళ్లి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఇంటా బయటా అనుకూల పరిస్థితులుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో సరదాగా గడుపుతారు. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. జీవిత భాగస్వామితో వస్త్రాభరణాలు కొను గోలు చేస్తారు. చేపట్టిన పనుల్లో విజయాలు లభిస్తాయి. కొందరు మిత్రుల సమస్యలను పరిష్కరి స్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా సాగిపోతాయి..
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, వ్యాపారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ఫలితం అందుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించిన సమాచారం ఒకటి ఉత్సాహం కలిగిస్తుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవు తాయి. పిల్లల చదువులు ఆశించిన స్థాయిలో ఉంటాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలను పరి ష్కరించుకుంటారు. నష్టదాయక వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.