AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gruha, Vahana Yoga: ఏడాది చివరి లోగా ఆ రాశుల వారికి గృహ, వాహన యోగాలు..!

కొన్ని రాశులకు ఈ ఏడాది చివరి లోగా తప్పకుండా గృహ, వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది. చాలా కాలంగా సొంత ఇంటి కోసం ప్రయత్నాలు సాగిస్తున్న వారికి ఆ కల నెరవేరే అవకాశం కనిపిస్తోంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం నాలుగవ స్థానాన్ని బట్టి, నాలుగవ స్థానం అధిపతిని బట్టి ఈ రెండు యోగాల గురించి చెప్పాల్సి ఉంటుంది.

Gruha, Vahana Yoga: ఏడాది చివరి లోగా ఆ రాశుల వారికి గృహ, వాహన యోగాలు..!
Gruha vahana yoga
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 06, 2024 | 6:57 PM

Share

కొన్ని రాశులకు ఈ ఏడాది చివరి లోగా తప్పకుండా గృహ, వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది. చాలా కాలంగా సొంత ఇంటి కోసం ప్రయత్నాలు సాగిస్తున్న వారికి ఆ కల నెరవేరే అవకాశం కనిపిస్తోంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం నాలుగవ స్థానాన్ని బట్టి, నాలుగవ స్థానం అధిపతిని బట్టి ఈ రెండు యోగాల గురించి చెప్పాల్సి ఉంటుంది. వృషభం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీన రాశుల వారికి కొద్ది ప్రయత్నంతో గృహ, వాహన యోగాలు పట్టడంతో పాటు, ఆస్తిపాస్తులు కలిసి రావడం, కుటుంబ జీవితం మెరుగ్గా ఉండడం వంటివి కూడా జరిగే అవకాశం కూడా ఉంది. ఇవన్నీ నాలుగవ స్థానం కిందకు వస్తాయి.

  1. వృషభం: ఈ రాశిలో గురు, కుజుల సంచాచంతో పాటు, చతుర్థ స్థానంలో బుధ, శుక్రుల సంచారం వల్ల అతి త్వరలో వీరికి గృహ యోగం పట్టే అవకాశం ఉంది. అనుకోకుండా ఆస్తిపాస్తులు కలిసి రావడం, పిత్రార్జితం లభించడం, ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం కావడం వంటివి జరిగి, గృహ, వాహన యోగాలకు మార్గం సుగమం అవుతుంది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగి పోతుంది. గృహ యోగానికి సంబంధించి తేలికగా రుణ సౌకర్యం లభించే అవకాశం కూడా ఉంది.
  2. కర్కాటకం: ఈ రాశివారికి చతుర్థ స్థానాధిపతి శుక్రుడు బాగా అనుకూలంగా ఉండడం, లాభస్థానంలో గురువు సంచారం చేయడం వంటి కారణాల వల్ల తప్పకుండా గృహ, వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమై, విలువైన ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. చాలా కాలంగా గృహ, వాహన సౌకర్యాల కోసం ప్రయత్నిస్తున్నవారికి అప్ర యత్నంగానే సొంత ఇంటి కల నెరవేరే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో రుణ సౌకర్యం లభిస్తుంది.
  3. తుల: ఈ రాశికి లాభ స్థానంలో శుక్ర, బుధుల సంచారం, చతుర్థ స్థానాధిపతి శని బాగా అనుకూలంగా ఉండడం వల్ల తప్పకుండా గృహ, వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది. పాత ఇంటిని కొని మెరుగుపరచుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ఉద్యోగంలో రావలసిన బకాయిలు చేతికి అందే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపా రాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ఆదాయానికి లోటు లేనందువల్ల సొంత ఇంటి కల నెరవేరుతుంది.
  4. ధనుస్సు: ఈ రాశికి చతుర్థంలో రాహువు, భాగ్య స్థానంలో శుక్ర, బుధుల సంచారం వల్ల అతి త్వరలో సొంత ఇంటి కల నెరవేరే అవకాశం ఉంది. వాహన కారకుడైన శుక్రుడు భాగ్య స్థాన సంచారం వల్ల వాహన యోగం కూడా పడుతుంది. వస్త్రాభరణాల కొనుగోలుకు కూడా అవకాశం ఉంది. ఆస్తి పాస్తులు సమకూరుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. గృహ, వాహన యోగాలకు అవసరమైన రుణ సౌకర్యంకూడా తేలికగా లభిస్తుంది.
  5. కుంభం: ఈ రాశికి చతుర్థ స్థానంలో గురు, కుజుల సంచారం వల్ల, చతుర్థ స్థానాధిపతి శుక్రుడు సప్తమ స్థానంలో ఉన్నందువల్ల పెద్దగా ప్రయత్నం అవసరం లేకుండానే సొంత ఇంటి కల, సొంత వాహనం కల నెరవేరే అవకాశం ఉంది. స్థిరాస్తి వివాదం పరిష్కారమై, విలువైన ఆస్తి లభిస్తుంది. సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందు తుంది. రుణ సౌకర్యాలు తేలికగా లభిస్తాయి. కుటుంబ జీవితం కూడా సుఖ సంతోషాలతో సాగిపో తుంది.
  6. మీనం: ఈ రాశికి చతుర్థ స్థానాధిపతి అయిన బుధుడు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అతి త్వరలో ఫ్లాట్ కొనే అవకాశం ఉంది. అనుకోకుండా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. ఆస్తి పాస్తులు కలిసి వస్తాయి. మాతృమూలక ధన లాభం ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగాపెరగడం, ఉద్యోగాల్లో భారీ జీతాలతో కూడిన స్థిరత్వం ఏర్పడడం వంటి కారణాలవల్ల తప్పకుండా గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది.

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్